మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న ఫ్రాన్స్‌కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ మాటను కాదని ఉక్రెయిన్‌కు దళాలను పంపిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరింది.
కాగా, తాజాగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగో.. ఫ్రాన్స్ రక్షణమంత్రి సెబాస్టియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో అక్కడ ఫ్రెంచ్ దళాల మోహరింపుపై షోయిగో ప్రస్తావించారు. ఒకవేళ నిజంగానే ఉక్రెయిన్‌లో ఫ్రెంచ్ దళాలు ఉంటే అది వారి దేశానికే తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. అంతేకాకుండా భవిష్యత్త్‌లో ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపించడానికి ఫ్రాన్స్ సాహసిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో, వీరి మధ్య సంభాషణ ఉద్రిక్తంగానే జరిగినట్టు సమాచారం.
ఇక, ఇటీవల కాలంలో రష్యా విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ గురువారం మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జులైలో జరగనున్న పారిస్ ఒలింపిక్స్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఈ క్రీడలకు ఆటంకం కలిగించేందుకు మాస్కో ప్రయత్నిస్తుందని అన్నారు. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓటమి చెందాల్సిందేనని మెక్రాన్ ఇటీవల ప్రకటనలు ఇస్తున్నారు. రష్యాపై శత్రుత్వాన్ని ప్రేరేపించే ఉద్దేశం ఫ్రాన్స్‌కు లేనప్పటికీ, ఏదో ఒకరోజు ఐరోపా దళాలు ఉక్రెయిన్‌కు వెళ్లడం ఖాయమని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment