![Ukraine Returned Students Hunger Strike in Delhi Ramlila Ground - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/25/ukraine.jpg.webp?itok=BaYURMu0)
సాక్షి, న్యూఢిల్లీ: తమ పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలని ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ‘పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఉక్రెయిన్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్’ రెండో రోజు దీక్ష సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. భారతీయ వైద్య వర్సిటీల్లో తమకు అవకాశం కల్పించేలా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్టు–1956, నేషనల్ మెడికల్ కమిషన్ యాక్టులకు సవరణలు చేయాలని కోరారు. పొరుగు దేశం శ్రీలంకకు సాయం చేస్తున్న కేంద్రం దేశంలోని విద్యార్థులకు న్యాయం చేయదా అని ప్రశ్నించారు. నీట్ ర్యాంకు వచ్చినా భారత్‌లో ఫీజులు అధికం కాబట్టే తమ పిల్లలను ఉక్రెయిన్‌కు పంపాల్సి వచ్చిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ పిల్లల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వమే వారి భవిష్యత్తును కూడా కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి!
Comments
Please login to add a commentAdd a comment