ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రోజురోజుకీ ఉగ్రరూపు దాలుస్తోంది. దేశంలోని పలు నగరాలపై రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో విరుచుకుపడుతోంది. పెద్దపెట్టున బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. రాజధాని కీవ్‌పై బాంబుల వర్షమే కురిపిస్తోంది. ఎక్కడ చూసినా చెలరేగుతున్న మంటలతో నగరం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలై 9 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా చల్లారడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంలో సైన్యంతో పాటు, సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.
కాగా ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనతో నేరుగా కలిసి చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పిలుపునిచ్చారు. అప్పుడే ఈ యుద్ధం ఆగిపోవడానికి మార్గం దొరుకుతుందని జెలెన్‌స్కీఅభిప్రాయపడ్డారు. ఆ సందర్భంగా పుతిన్‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ చెణుకులు విసిరారు.
చదవండి: రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్ నగరం
మీడియా కాన్ఫరెన్స్‌లో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. ‘‘మనిద్దరం కలిసి అన్ని విషయాలూ ఫేస్ టు ఫేస్ చర్చించుకుందాం. అయితే, పరస్పరం 30 మీటర్ల దూరంలో కూర్చుని మాత్రం కాదు. నేనేమీ కొరకను. మరింకెందుకు భయం?’’ అని కామెంట్ చేశారు. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో పుతిన్ చర్చల సందర్భంగా ఇద్దరూ పొడవైన టేబుల్‌కు చెరోవైపున కూర్చోవడాన్ని ఉద్దేశించి ఆయన ఇలా చురకలు వేశారు. అయితే రష్యా, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు బెలారస్ సరిహద్దుల్లో రెండోసారి చర్చలు కొనసాగిస్తున్న తరుణంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: Viral Video: ‘మోదీ జీ ప్లీజ్ సాయం చేయండి.. ఇక్కడే ఉంటే చచ్చిపోతాం’
Comments
Please login to add a commentAdd a comment