ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధంలో ప్రపంచ దేశాల పాలకులు లైట్ తిస్కున్నా..ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోరాట పటిమను చూసి ప్రజలు ముచ్చట పడుతున్నారు. అందుకే రష్యాను తీరును తప్పుబడుతూ జెలెన్ స్కీకి మద్దతు పలుకుతున్నారు. పనిలో పనిగా టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను సైతం ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఎలన్ మస్క్‌కు వరుస ట్వీట్‌లు చేస్తున్నారు. ముఖ్యంగా రష్యాలో టెస్లాతో పాటు ఇతర సంస్థల కార్యకాలాపాల్ని నిలిపివేయాలని కోరుతున్నారు. దయచేసి రష్యాలో అన్నింటిని డీయాక్టివేట్ చేయండి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ చేస్తున్న మారణం హోమం సరైంది కాదని మండిపడుతున్నారు. అయితే ఈ ట్వీట్‌లపై ఎలన్ మస్క్ స్పందించ లేదు. ఒకవేళ ఆయన రియాక్ట్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Can you turn off @Tesla in Russia as a sort of tech embargo?
— Fozzy Bear (@FozzyBearPDX) February 27, 2022
కాగా, ఎలన్ మస్క్ ఉక్రెయిన్ - రష్యా సంక్షోభంలో ప్రత్యక్షంగా కాక పోయినా పరోక్షంగా ఉక్రెయిన్ కోసం చేయాల్సిన వన్నీ చేస‍్తున్నారు. రష్యా దాడులు మొదలైన తర్వాత ఉక్రెయిన్‌లో కమ్యునికేషన్ వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. కరెంటు, విద్యుత్ సరఫరా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సేవలు చిన్నాభిన్నమయ్యాయి. దీంతో ఉక్రెయిన్లకు అండగా ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తున్నారు. చాలా మంది ఈ ఇంటర్నెట్ ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు.
చదవండి: ఉక్రెయిన్‌లో యుద్ధం, అండగా నిలుస్తున్న ఎలన్ మస్క్..ఎలా అంటే?
Comments
Please login to add a commentAdd a comment