రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ ఉప ప్రధాని మైఖైలో ఫెడోరోవ్ ట్వీట్‌కు ఎలన్ మస్క్ స్పందించారు. మీరు మార్స్పై రాకెట్లతో ప్రయోగాలు చేస్తున్న సమయంలో రష్యా ఉక్రెయిన్‌ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తుంది! మీ రాకెట్లు స్పేస్‌లో విజయవంతంగా ల్యాండ్ అవుతున్నప్పుడు రష్యా రాకెట్లు ఉక్రేనియన్ పౌరులపై దాడి చేస్తాయి! ఈ సమయంలో రష్యా సేనల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే సామర్ధ్యం ఉన్న స్టార్‌లింక్ స్టేషన్‌లను యాక్టీవ్ చేయాలని ట్వీట్ చేశారు. అంటే స్టార్‌లింక్ స్టేషన్‌ల సాయంతో రష్యా కు చెక్ పెట్టే సామర్ధ్యం ఉక్రెయిన్‌లలో ఉందని అర్ధం వచ్చేలా ట్వీట్ లో పేర్కొన్నారు.
అలా ఫెడోరోవ్ ట్వీట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎలన్ మస్క్ ఆ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు. ఉక్రెయిన్ లో స్టార్‌లింక్ సర్వీసులు యాక్టీవ్‌గా ఉన్నాయని ఎలన్ రిప్లయిలో తెలిపారు. అంతేకాదు మరిన్ని టెర్మినల్స్‌లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులోకి ఉంటాయని అన్నారు.
శాటిలైట్ ఇంటర్నెట్ కీలకం
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్లో శాటిలైట్ ఇంటర్నెట్ కీలకంగా మారింది. రష్యా సైనికులు వరుస బాంబు దాడులతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కమ్యునికేషన్ వ్యవస్థ నిలిచిపోవడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం, ప్రజలు శాటిలైట్ ఇంటర్నెట్ పై ఆధారపడింది. మరోవైపు దాడులతో రష్యా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో తమ ప్రాణాల్ని నిలుపుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలు బంకర్లలో తలదాచుకుంటూనే రష్యా సైన్యానికి ధీటుగా బదులిస్తున్నారు. యుద్ధంలో తగిలిన గాయాలతో రక్తం ఒడుతున్నా తమ దేశాన్ని పరాయి దేశ పాలకుల చేతుల్లోకి వెళ్లనిచ్చేది లేదని సవాలు విసురుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment