ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తుంది. సౌత్ ఈస్ట్రన్ ఉక్రెయిన్ సిటీ మారియుపోల్ టార్గెట్‌గా రష్యా సైన్యం షెల్లింగ్‌తో విరుచుకుపడుతోంది. మరోవైపు రష్యాపై ఆంక్షల భారం పెరగుతోంది. ఇప్పటి వరకు దేశాలే ఆంక్షలు ప్రకటించగా..ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు,పెట్టుబడి దారులు చేరిపోయారు. రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు, పుతిన్ తనకు ప్రధాన శత్రువుగా భావించే బిల్ బ్రోడర్ పుతిన్‌నుపై విరుచుకు పడ్డారు. రష్యాతో వాణిజ్యం చేసేది లేదని తెగేసే చెప్పారు. ఇప్పుడీ బిల్ బ్రోడర్ నిర్ణయం పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లవుతుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యా మరింత ఆర్ధికంగా నష్టపోయేలా చేస్తుంది. ఇప్పటికే అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. ముడి చమురుతోపాటు రష్యా నుంచి ఎలాంటి ఉత్పత్తుల్ని ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకోకుండా నిషేధించాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ స్విఫ్ట్ నుంచి రష్యాను అమెరికా, దాని మిత్ర దేశాల బ్యాంకులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా రష్యా వాణిజ్యంపై రష్యా అతిపెద్ద పెట్టుబడిదారుడు బిల్ బ్రోడర్ స్పదించారు.రష్యాలో మిగిలి ఉన్న కంపెనీలు "నాజీ జర్మనీలో వ్యాపారానాన్ని కొనసాగించడంతో సమానం" అని వ్యాఖ్యానించారు.
బ్రౌడర్ న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ, ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతఖర్చైనా సరే "ప్రతి వ్యాపారస్థుడికి రష్యా నుండి బయటపడే నైతిక బాధ్యత ఉంది. పుతిన్ తర్వాతి పాలనలో ప్రతి ఒక్కరూ తిరిగి రావొచ్చి. కాబట్టి రష్యాలో వ్యాపారం చేయడం ఇష్టం లేక, ఆ దేశంలో కార్యకలాపాల్ని నిలిపి వేసిన వ్యాపార వేత్తలకు రష్యాకు తిరిగి రావడం ఎలా అనే అంశంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం రష్యాలో వ్యాపారం చేయడం అంటే"నాజీ జర్మనీలో వ్యాపారానాన్ని కొనసాగించడంతో సమానం" అని వ్యాఖ్యానించారు. ఒక వేళ పుతిన్ అధికారం కొనసాగితే.. రష్యా నుంచి సంస్థలు 'వెనక్కి వెళ్లాలని' కోరుకోకూడదని ఆయన అన్నారు.
రష్యాకో దండం!
యేల్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం..ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఆ దేశం ఆర్ధికంగా నష్టపోయేలా చేస్తుంది. రష్యా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్న నేపథ్యంలో..రష్యాలోని వందల సంస్థలు కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి.యేల్ యూనివర్సిటీ రీసెర్చ్ సంస్థ ఇప్పటి వరకు 800 కంపెనీలు రష్యాకు గుడ్ బైచెప్పాయని తెలిపింది. మరికొన్ని కంపెనీలు పూర్తి స్థాయిలో రష్యా నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
చదవండి: 'హలో కమాన్ 'మైక్' నువ్వు సింగిలా!..అయితే నాతో మింగిల్ అవ్వు'!
Comments
Please login to add a commentAdd a comment