
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో వైమానిక దాడులను ఉధృతం చేయాలని రష్యా ఒకవైపు యోచిస్తుండగా, మరోవైపు అమెరికా సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. రష్యాను ఢీకొట్టడానికి గాను ఉక్రెయిన్ దళాలకు ఫైటర్ జెట్లు అందజేయడానికి నాటో దేశాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నాటో దేశాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం.
ఉక్రెయిన్‌కు Fighter Jets అందజేసి, సహకరించడానికి ఇప్పటిదాకా నాటో దేశాలేవీ ముందుకు రాలేదు. కేవలం ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేసిన విన్నపాలు సైతం పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లు పంపించాలని ఆయన పదేపదే కోరుతున్నా మిత్ర దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గగనతల శక్తిలో ఉక్రెయిన్ కంటే రష్యా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. ఉక్రెయిన్ వద్ద కేవలం 67 ఫైటర్ జెట్లు, 34 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి.
రష్యా అమ్ముల పొదిలో ఏకంగా 1,500 ఫైటర్ జెట్లు, 538 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఉక్రెయిన్‌కు ఏ దేశమైనా సహకరిస్తే ఆ దేశం నేరుగా తమపై యుద్ధం సాగిస్తున్నట్లుగానే పరిగణిస్తామని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌కు ఆర్మీని గానీ, వైమానిక దళాన్ని గానీ పంపించబోమని అమెరికా ఇప్పటికే తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment