కీవ్: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై కొద్ది నెలలుగా భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. ప్రధాన వనరులను ధ్వంసం చేస్తూ ఉక్రేనియన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరోమారు క్షిపణుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఒకేరోజు 120 మిసైల్స్‌ను ప్రయోగించింది. ఏ వైపు నుంచి బాంబులు పడతాయోనని అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. భారీ స్థాయిలో మిసైల్స్ ప్రయోగించినట్లు ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది.
‘డిసెంబర్ 29. భారీ స్థాయిలో మిసైల్స్‌తో దాడి జరిగింది. ఆకాశం, సముద్రం నుంచి శుత్రు దేశం ఉక్రెయిన్‌ను చుట్టుముట్టి మిసైల్స్‌తో విరుచుకుపడింది. ’అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది ఉక్రెయిన్ వైమానిక దళం. మరోవైపు.. 120 మిసైల్స్ ప్రయోగించినట్లు అధ్యక్షుడి సహాయకుడు మైఖైలో పోడోల్యాక్ తెలిపారు.
గురువారం ఉదయమే ఉక్రెయిన్ వ్యాప్తంగా రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాల్లో పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ క్రమంలోనే విద్యుత్తుకు అంతరాయం ఏర్పడొచ్చని, ప్రజలు నీటిని నిలువ చేసుకోవాలని కీవ్ మేయర్ విటాలి క్లిట్స్కో అప్రమత్తం చేశారు. అలాగే.. రెండో పెద్ద నగరం ఖార్కివ్‌లోనూ వరుస పేలుళ్లు జరిగాయి.
ఇదీ చదవండి: క్యాసినో హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం..
Comments
Please login to add a commentAdd a comment