
పెరిగిన పెట్రో ధరలు
పెట్రోల్‌పై రూ.1.06, డీజిల్‌పై రూ. 2.94 పెంపు
న్యూఢిల్లీ: శనివారం అర్ధ రాత్రి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.1.09, డీజిల్‌పై లీట రుకు రూ. 2.94 పెంచినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) తెలిపింది. డాలర్‌తో రూపాయి మారకవిలువలో మార్పుల వల్ల ధరలు పెరిగాయంది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 61.13 నుంచి రూ. 62.19, డీజిల్ రూ.48.01 నుంచి రూ. 50.95కి పెరిగింది. ఏప్రిల్ 16న స్వల్పంగా పెట్రో ధరలను తగ్గించిన విషయం తెలిసిందే.