సాక్షి, న్యూఢిల్లీ: చుక్కల్ని తాకుతున్న ఇంధన ధరలు వినియోగదారులకు చెమటలు పట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే గరిష్ఠ సాయికి చేరాయి. కాగా చమురు సంస్థలు మరోసారి ధరలను పెంచేశాయి. మంగళవారం లీటర్ పెట్రోల్, డీజల్‌పై మరో 25 పైసలు వడ్డించడంతో పెట్రోల్ ధర దేశరాజధాని ఢిల్లీలో 85 రూపాయలకు చేరింది. వారం వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలో రూపాయికిపైగా పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. జనవరి 6 నుండి ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ .1.49, రూ .1.51 పెరిగాయి.
ముంబైలో పెట్రోల్ ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి వద్ద లీటరు రూ .91.80 కు చేరుకోగా, డీజిల్ రేటు లీటరుకు రూ .82.13 కు చేరింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.20, డీజిల్ ధర 75.38
చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 87.85 వద్ద, డీజిల్ ధర రూ. 80.67
కోలకతాలో లీటరు పెట్రోలు ధర రూ. 86.63 వద్ద, డీజిల్ ధర రూ. 78.97
హైదరాబాద్‌లో లీటరుపెట్రోలు ధర రూ. 88.63 వద్ద, డీజిల్ ధర రూ. 82.26
అమరావతిలో లీటరు పెట్రోలు ధర 91.43, డీజిల్ ధర రూ. 84.58
Comments
Please login to add a commentAdd a comment