ఒక్కరోజు గ్యాపిచ్చిన చమురు కంపెనీలు మళ్లీ బాదుడు షురూ చేశాయి. పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 27 పైసలు పెంచి పెంపు దూకుడు ఇలానే కొనసాగుతుందనే సంకేతాలు ఇచ్చాయి. ఇక తాజా ధరల పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.97.22 ఉండగా డీజిల్ రూ.87.97 గా ఉంది. ముంబై లో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36గా ఉంటే డీజిల్ ధర రూ. 95.44 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.97.12 ఉండగా డీజిల్ ధర రూ.90.82 ఉంది.
ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో లీటర్ పెట్రోల్ రూ.100 అంతకంటే ఎక్కువగానే ఉంది. ఆదివారం తాజా ధరల పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన రాష్ట్ర రాజధానుల జాబితాలో పాట్నా చేరబోతోంది. ఇక తొలిసారి పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి రాష్ట్ర రాజధానుల్లో భోపాల్, ఆ తరువాత జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరులు ఉన్నాయి. ఈ ఏడాది మే4వ తేదీ నుంచి ఇప్పటివరకూ పెట్రో ధరలు పెంచడం 27వసారి. అంటే 48 రోజుల్లో చమురు ధరలు వరుసగా పెరుగుతూ పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు
ఆంధ్రప్రదేశ్ లో
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 ఉండగా డీజిల్ ధర రూ. 97.88గా ఉంది
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.89 ఉండగా.. డీజిల్ ధర రూ.97.14గా ఉంది
కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.26 ఉండగా.. డీజిల్ ధర రూ.97.52గా ఉంది.
గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 103.65 ఉండగా.. డీజిల్ రూ.97.88గా ఉంది.
తెలంగాణలో
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.04 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.89గా ఉంది.
రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.10 గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.46గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment