
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలను ఒక పైసా తగ్గించడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. పెట్రో ధరలను నామమాత్రంగా తగ్గించడం పరిణితిలేని చర్యగా అభివర్ణించారు. చమురు కంపెనీలు ఇంధన ధరలను ఒక పైసా తగ్గించడం పట్ల మోదీ సర్కార్ తీరును తప్పుపట్టారు. పెట్రో ధరలను ఒక పైసా తగ్గించడం మీ (ప్రధాని) సూచనే అయితే అది ఏమాత్రం పరిణితి లేని చర్య.
గతవారం తాను చేసిన ఫ్యూయల్ ఛాలెంజ్‌కు ఒక పైసా తగ్గింపు ఏమాత్రం సరిపోదని రాహుల్ వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒక పైసా మేర తగ్గించినట్టు బుధవారం ఉదయం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను ప్రధాని స్వీకరించిన క్రమంలో ఇంధన ధరలను తగ్గించాలని ఈనెల 24న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధానికి సవాల్ విసిరారు.
కాగా మే 14 నుంచి వరుసగా 16 రోజుల పాటు పెట్రో ధరలను పెంచుతూ వచ్చిన చమురు మార్కెటింగ్ కంపెనీలు తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను బుధవారం స్వల్పంగా తగ్గించాయి.గత 15 రోజుల్లో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 3.80, డీజిల్ ధరలు రూ 3.38 మేర భారమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment