సాక్షి, ముంబై: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు వరుసగా ఆరో రోజు కూడా కొనసాగుతోంది. ఈ ధరలతో సామాన్య ప్రజల జోబులకు చిల్లు పడుతున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజూ పెరగడంతో నిత్యావసర ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. గత మంగళవారం నుంచి పరుగు తీస్తున్న ధరలు ఆదివారం కూడా అదే స్థాయిలో పెరిగాయి. వివిధ నగరాల్లో పెట్రోల్ పై 25 నుంచి 50 పైసలు, డీజిల్‌పై 30 పైసల నుంచి రూ.50 పైసల మేర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
మహారాష్ట్రలోని పర్భని జిల్లాలో మాత్రం అప్పుడే పెట్రోల్ ధర సెంచరీ కొట్టేసింది. ఎక్స్ట్రా ప్రీమియం పెట్రోల్ ధర రూ.100 దాటినట్లు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు. సాధారణ పెట్రోల్ ధర రూ. 97.38గా ఉంది. అదే ముంబైలో పెట్రోల్ పై 28 పైసలు పెరగడంతో రూ.95.21కు చేరుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగి లీటర్ పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ ధర రూ.86.23 చేరుకున్నాయి. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు ఆధారంగా మారుతూ ఉంటాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment