న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేర అత్యధిక స్థాయిలను నమోదు చేయడం ఇదే తొలిసారి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.72.38గా రికార్డైందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల రోజువారీ జాబితాలో వెల్లడైంది. ఇది 2014 మార్చి నాటి గరిష్ట స్థాయి. అదేవిధంగా డీజిల్ ధర లీటరుకు రికార్డు స్థాయిలో రూ.63.20ను తాకింది. ముంబైలో ఈ రేట్లు మరింత అధికంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధరలు 80 మార్కును దాటగా.. డీజిల్ రూ.67.30 వద్ద అమ్ముడుపోతుంది. ముంబైలో స్థానిక విక్రయ పన్ను లేదా వ్యాట్ రేట్లు అధికంగా ఉండటంతో, పెట్రోల్, డీజిల్ ధరలు అక్కడ మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. డిసెంబర్ మధ్య నుంచి డీజిల్ ధరలు లీటరుకు రూ.4.86 జంప్ చేసినట్టు ఆయిల్ కంపెనీల డేటాలో వెల్లడైంది.
అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ఎక్కువగా పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆయిల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో వచ్చే వారంలో పార్లమెంట్‌కు సమర్పించనున్న 2018-19 కేంద్ర బడ్జెట్‌లో ఎక్సైజ్ డ్యూటీని కోత పెట్టాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ, ఆర్థిర మంత్రిత్వ శాఖను కోరుతోంది. ప్రీ-బడ్జెట్‌కు ముందు సమర్పించిన మెమోరాండంలో ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ముందు ఉంచినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే లెవీల్లో లీటరు పెట్రోల్‌పై రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఈ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించి, సాధారణ ప్రజలకు కొంత మేర అయినా ఉపశమనం కల్పించాలని అధికారులు తెలిపారు. అయితే గ్లోబల్‌గా ఆయిల్ ధరలు తగ్గుముఖంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లు ఎక్సైజ్ డ్యూటీలను పెంచింది. కేవలం ఒక్కసారి మాత్రమే ఈ డ్యూటీకు కోత పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment