Oil ministry
-
విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌పై సమీక్ష అవసరం
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపును సమీక్షించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరుతోంది. చమురు అన్వేషణ, గుర్తింపు, ఉత్పత్తికి సంబంధించిన కాంట్రాక్టుల్లో ఆర్థిక స్థిరత్వ సూత్రానికి రెండున్నర నెలల క్రితం ప్రవేశపెట్టిన ఈ పన్ను విధింపు విరుద్ధమని ఆర్థికశాఖకు ఆగస్టు 12న రాసిన ఒక లేఖలో చమురు మంత్రిత్వశాఖ అభిప్రాయపడిన విషయం తాజాగా వెల్లడైంది. చమురు మంత్రిత్వశాఖ లేఖ ప్రకారం.. ► ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్ట్ (పీఎస్సీ), రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్ట్ (ఆర్ఎస్సీ) కింద వేలంలో కంపెనీలకు లభించిన ఫీల్డ్‌లు లేదా బ్లాక్‌లకు కొత్త లెవీ నుండి మినహాయింపు ఇవ్వాలి. ► 1990ల నుండి కంపెనీలకు వివిధ కాంట్రాక్టు విధానాలలో చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి కోసం బ్లాక్‌లు లేదా ప్రాంతాలను కేటాయించడం జరుగుతోంది. ఇందుకు సంబంధించి రాయల్టీ అలాగే సెస్ విధింపు జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ముందుగా నిర్ణయించిన లాభాల శాతాన్ని కూడా పొందుతోంది. ► ఆయా కాంట్రాక్టుల విషయంలో లాభాలు పెరుగుతుంటే, ప్రభుత్వానికి కూడా అధిక లాభాల వాటా బదిలీ అయ్యే విధంగా అంతర్నిర్మిత యంత్రాంగ ప్రక్రియ అమలవుతోంది. ► ఇలాంటి పరిస్థితిలో దేశీయంగా ఉత్పత్తయిన ముడి చమురకు సంబంధించి కంపెనీలు అన్నింటినీ ఒకేగాటన కడుతూ, తిరిగి విండ్‌ఫాల్ ట్యాక్స్ విధింపు ఎంతమాత్రం సరికాదు లభించని శాఖల స్పందన.. కాగా, ఈ లేఖపై స్పందించాల్సిందిగా అటు చమురు మంత్రిత్వశాఖకు ఇటు ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపిన ఈమెయిల్స్‌కు ఎటువంటి స్పందనా రాలేదు. విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ అంటే.. జూలై 1 నుంచి దేశంలో విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు అమల్లోకి వచ్చింది. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు, ఏటీఎఫ్సహా ఇంధనాల ఎగుమతులపై విధించిన విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను రెండు వారాలకో సారి (15 రోజులకు) ప్రభుత్వం సమీక్షిస్తూ, తగిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. విదేశీ మారకం రేట్లు, అంతర్జాతీయంగా చమురు ధరలను బట్టి పక్షం రోజులకు ఒకసారి దీనిపై నిర్ణయం జరుగుతోంది. -
వినియోగదారులకు శుభవార్త, అదుపులోకి రానున్న సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు!
న్యూఢిల్లీ: పరిశ్రమలకు సరఫరా చేస్తున్న సహజవాయువును పట్టణ గ్యాస్, పైప్డ్ గ్యాస్ కోసం మళ్లించాలంటూ పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆదేశించింది. సీఎన్జీ, పట్టణ పంపిణీ గ్యాస్ ధరలు 70% మేర పెరిగిపోవడంతో, వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గృహాల్లో వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు వినియోగించే సీఎన్జీ డిమాండ్ తీర్చేందుకు వీలుగా, ఖరీదైన ఎల్ఎన్జీ దిగుమతితో లోటును అధిగమించాలని మూడు నెలల క్రితం పెట్రోలియం శాఖ ఆదేశించింది. ఇది ధరలు పెరిగేందుకు దారితీసింది. దీంతో దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్‌ను పట్టణాల్లో సరఫరాకే వినియోగించాలన్న పూర్వపు విధానానికి అనుకూలంగా పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గ్యాస్‌ను పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్‌కు, ముంబైలో గ్యాస్ పంపిణీలోని మహానగర్ గ్యాస్‌కు రోజువారీగా 17.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సీఎండీ) నుంచి 20.78 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ సరఫరా పెరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో సీఎన్జీ, పీఎన్జీ అవసరాలను 94% మేర తీర్చడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం 84% వరకు దేశీయ సరఫరా కాగా, మిగిలిన మొత్తానికి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. చదవండి👉భారత్‌కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్! -
గ్యాస్ వినియోగదారులకు మరో షాక్! వారికి గుది ‘బండ’
సాక్షి, ముంబై: వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచిన కేంద్రం ఇపుడు వినియోగదారులకు మరో షాక్ ఇవ్వనుంది. గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. చమురు మార్కెటింగ్ కంపెనీల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. అంటే డొమెస్టిక్ (14.2 కిలోలు) సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1450గా ఉంది. తాజా పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు ఇతర చార్జీల బాదుడు కూడా తప్పదు. ఫలితంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనే కస్టమర్లకు అదనపు భారం పడుతుంది. అయితే ఉజ్వల స్కీమ్ వినియోగదారులకు సవరించిన రేట్లు వర్తించవు. అలాగే డబుల్ సిలిండర్ కనెక్షన్ పొందే వారికి మరింత భారం తప్పదు. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించుకోవాలి. పెంచిన ధరలు రేపటి నుంచి (జూన్ 16) నుంచి అమలులోకి వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త కనెక్షన్‌కు రూ.900 నుంచి రూ.1,150కి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.1,450 చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఉంది. బహుళ కనెక్షన్లు ఉన్నవారు అదనపు కనెక్షన్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కనెక్షన్లన్నింటినీ బ్లాక్ చేస్తున్నాయి. అంతేకాదు అదనపు కనెక్షన్ సరెండర్ అయ్యే వరకు రీఫిల్‌లను జారీ చేయడం లేదు.అలాగే కనెక్షన్లు బ్లాక్ చేయబడిన కస్టమర్లు మరొక చమురు కంపెనీ నుండి తాజా కనెక్షన్‌ను పొందకుండా నిరోధించేలా కొత్త కనెక్షన్లను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
మార్కెట్లోకి కొత్త బంకులు.... పెట్రోలు ధర తగ్గేనా ?
న్యూఢిల్లీ: ఆటో ప్యూయల్ మార్కెట్లో కొత్త పోటీకి కేంద్రం తెర లేపింది. ఇప్పటి వరకు మార్కెట్లో గుత్తాధిపత్యం వహిస్తున్న ప్రభుత్వ కంపెనీలకు పోటీగా మరి కొన్ని సంస్థలను మార్కెట్లోకి ఆహ్వానించింది. కొత్త ప్లేయర్లు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు సాగించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీలకు తోడుగా మరో ఏడు కంపెనీలకు అనుమతులు జారీ చేసింది కేంద్రం. 2019లో మార్కెట్ ఫ్యూయల్ ట్రాన్స్‌పోర్టేషన్ నిబంధనలకు సంబంధించిన నిబంధనల సడలింపుల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చినట్టు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక పేర్కొంది. అనుమతి పొందినవి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్, ఇథనాల్ వంటి ఆటో ఫ్యూయల్స్ అమ్మేందుకు కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇండియన్ మోలాసిస్ కంపెనీ (చెన్నై బేస్డ్), అస్సాం గ్యాస్ కంపెనీ, ఆన్సైట్ ఎనర్జీ, ఎంకే ఆగ్రోటెక్, ఆర్‌బీఎంఎల్ సొల్యూషన్స్, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బల్క్, రిటైల్‌గా పెట్రోలు, డీజిల్‌ను అమ్మడానికి అనుమతి ఉంటుంది. 100 బంకులు ఏడాదికి రూ. 500 కోట్ల నెట్‌వర్త్ కలిగిన కంపెనీల నుంచి కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది. అనుమతులు సాధించిన కంపెనీలు ఐదేళ్లలో కనీసం వంద పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం బంకులను పూర్తిగా రిమోట్ ఏరియాల్లోనే ఏర్పాటు చేయాలనే నిబంధన కేంద్రం పొందు పరిచింది. వ్యాపారం జరిగేనా ఇంధన వ్యాపారానికి సంబంధించి కొత్తగా అనుమతులు సాధించిన కంపెనీల్లో ఒక్క రిలయన్స్ ఇండస్ట్ట్రీస్‌కి తప్ప మరే కంపెనీకి దేశవ్యాప్తంగా నెట్వర్క్ లేదు. అస్సాం గ్యాస్ కంపెనీకి మౌలిక వసతులు ఉన్నా అది కేవలం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైంది. మిగిలిన కంపెనీల్లో చాలా వరకు బల్క్ ఫ్యూయల్ సెల్లింగ్‌కే అనుకూలంగా ఉన్నాయి. ధర తగ్గేనా ప్రస్తుతం ఆటో ఫ్యూయల్ విభాగంలో పోటీ నామామత్రంగా ఉంది. హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్, భారత్ వంటి కంపెనీలు ఉన్నా ధరల్లో వత్యాసం లేదు. కొత్త ప్లేయర్లు మార్కెట్లోకి రావడం వల్ల ఫ్యూయల్ ధరలు ఏమైనా కిందికి దిగుతాయోమో చూడాలి. -
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు ఏ మాత్రం తగ్గకుండా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేర అత్యధిక స్థాయిలను నమోదు చేయడం ఇదే తొలిసారి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.72.38గా రికార్డైందని ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల రోజువారీ జాబితాలో వెల్లడైంది. ఇది 2014 మార్చి నాటి గరిష్ట స్థాయి. అదేవిధంగా డీజిల్ ధర లీటరుకు రికార్డు స్థాయిలో రూ.63.20ను తాకింది. ముంబైలో ఈ రేట్లు మరింత అధికంగా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధరలు 80 మార్కును దాటగా.. డీజిల్ రూ.67.30 వద్ద అమ్ముడుపోతుంది. ముంబైలో స్థానిక విక్రయ పన్ను లేదా వ్యాట్ రేట్లు అధికంగా ఉండటంతో, పెట్రోల్, డీజిల్ ధరలు అక్కడ మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. డిసెంబర్ మధ్య నుంచి డీజిల్ ధరలు లీటరుకు రూ.4.86 జంప్ చేసినట్టు ఆయిల్ కంపెనీల డేటాలో వెల్లడైంది. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు ఎక్కువగా పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆయిల్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో వచ్చే వారంలో పార్లమెంట్‌కు సమర్పించనున్న 2018-19 కేంద్ర బడ్జెట్లో ఎక్సైజ్ డ్యూటీని కోత పెట్టాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ, ఆర్థిర మంత్రిత్వ శాఖను కోరుతోంది. ప్రీ-బడ్జెట్‌కు ముందు సమర్పించిన మెమోరాండంలో ఈ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ముందు ఉంచినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధించే లెవీల్లో లీటరు పెట్రోల్‌పై రూ.19.48 ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీ ఉంది. ఈ ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించి, సాధారణ ప్రజలకు కొంత మేర అయినా ఉపశమనం కల్పించాలని అధికారులు తెలిపారు. అయితే గ్లోబల్‌గా ఆయిల్ ధరలు తగ్గుముఖంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం 2014 నవంబర్ నుంచి 2016 జనవరి వరకు తొమ్మిది సార్లు ఎక్సైజ్ డ్యూటీలను పెంచింది. కేవలం ఒక్కసారి మాత్రమే ఈ డ్యూటీకు కోత పెట్టింది. -
10% పెరిగిన ఇంధన డిమాండ్
న్యూఢిల్లీ: భారత ఇంధన డిమాండ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో 10 శాతం పెరిగింది. ఇంధన డిమాండ్ ఈ స్థాయిలో పెరగడం గత ఏడాది కాలంలో ఇదే మొదటిసారి. చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా.. భారత్.. గత నెలలో 16.25 మిలియన్ టన్నుల పెట్రోలియమ్ ఉత్పత్తులను వినియోగించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వినియోగం 14.78 మిలియన్ టన్నులుగా నమోదైంది. చమురు శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం... ♦ గత ఏడాది ఆగస్టు తర్వాత చమురు ఉత్పత్తుల వృద్ధి గత నెలలోనే భారీగా నమోదైంది. ఆగస్టు, 2016లో డిమాండ్ 18.2 శాతానికి పెరిగింది. ♦ ఈ ఏడాది ఆగస్టులో చమురు ఉత్పత్తులకు డిమాండ్ 6.1% తగ్గింది. 2003 ఏప్రిల్ నుంచి చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా ఈ ఆగస్టులో డీజిల్, పెట్రోల్ ఉత్పత్తులకు డిమాండ్ బాగా తగ్గింది. ♦ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) అంచనాల ప్రకారం, 2040 వరకూ చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుంది. అయితే ♦ ఏడాది ఎనిమిది నెలలకు గాను నాలుగు నెలల్లో ఆయిల్ డిమాండ్ పడిపోయింది. ♦ చమురు అవసరాల్లో దాదాపు 81 శాతం వరకూ మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ♦ ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజిల్ అమ్మకాలు 16.5 శాతం వృద్ధితో 6.08 మిలియన్ టన్నులు, పెట్రోల్ వినియోగం 18 శాతం వృద్ధితో 2.14 మిలియన్ టన్నులకు పెరిగాయి. -
ఫ్రీ ఎల్పీజీ స్కీమ్ వెబ్సైట్లతో జాగ్రత్త!
న్యూఢిల్లీ : ఉచిత ఎల్పీజీ స్కీమ్ పై వచ్చే నకిలీ వెబ్ సైట్లతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆయిల్ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీచేసింది. నకిలీ పోర్టల్స్ నుంచి వస్తున్న డీలర్స్ ప్రకటనలకు స్పందించవద్దని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన సూచించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజనతో లింక్ అయి, చాలా వెబ్ సైట్లు ఈ మధ్యన నకిలీవి పుట్టుకొచ్చాయని గుర్తించినట్టు పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ www.pmujjwalayojana.com ఇదేనని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అధికారిక వెబ్ సైట్ లో ఉచితంగా దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని, ఇంగ్లీష్, హిందీల్లో ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం ఈ దరఖాస్తులను నింపాల్సి ఉంటుందని తెలిపింది. www.ujwalayojana.org వెబ్ సైట్లో ఆర్జీజీఎల్వీ యోజన కింద ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను ప్రభుత్వం నియమించినట్టు ప్రకటన వస్తుందని, కానీ ఎలాంటి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ షిప్ ను పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ నియమించలేదని, ఇది అసలు అథారైజ్డ్ సంస్థ కాదే కాదని స్పష్టీకరించింది. దీని నుంచి వచ్చే ఎలాంటి ప్రకటనలను నమ్మవద్దని సూచించింది. నకిలీ వెబ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది. -
ఇకపై పెట్రోల్ డోర్ డెలివరీ..!
-
ఇకపై పెట్రోల్ డోర్ డెలివరీ..!
న్యూఢిల్లీ: మే 14నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ పంపుల మూత నిర్ణయానికి చెక్ చెప్పిన చమురు మంత్రిత్వ శాఖ మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై వినియోగదారులవద్దకే నేరుగా పెట్రోల్ డెలివరీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. వినియోగదారులు ప్రీ-బుకింగ్ చేస్తే హోం డెలివరీ చేస్తమాని, ఇంధన స్టేషన్లలో సుదీర్ఘ క్యూలను తగ్గించటానికి ఇదిసహాయపడుతుందని ట్వీట్ చేసింది. పెట్రోల్ స్టేషన్ల వద్ద సుదీర్ఘ క్యూలను నిరోధించే క్రమంలో ఇంటికే పెట్రోల్‌ను పంపించే యోచనలో ఉంది. ఈ మేరకు శుక్రవారం చమురు మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ముందస్తు బుకింగ్ చేసినట్లయితే పెట్రోలియం ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా ఇంటికే ప్రభుత్వం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వరుస ట్వీట్లలో ప్రకటించింది. పెద్ద క్యూలలో వేచి వుండడం వల్ల వృధా అవుతున్న వినియోగదారులు సమయం ఆదా అవుతుందని భావించింది. “Options being explored where petro products may be door delivered to consumers on pre booking” @dpradhanbjp (1/2) — Petroleum Ministry (@PetroleumMin) April 21, 2017 -
పెట్రోలియం డీలర్స్‌కి ఝలకిచ్చిన మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: త్వరలో ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేయాలన్న నిర్ణయానికి ఆయిల్ మంత్రిత్వ శాఖ నో చెప్పింది. పెట్రోలియం డీలర్స్‌కి నిర్ణయానికి మంత్రిత్వ శాఖ రెడ్ సిగ్నల్ వేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పెట్రోల్ పంపు ఆపరేటర్ల అసోసియేషన్ ఆదివారాలు మూసివేయాలని నిర్ణయంపై మంత్రిత్వ శాఖ ప్రతికూలంగా స్పందించింది. ఈ చర్య సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించింది. పెట్రోలియమ్ మినహాయింపులు లేదా పెట్రోల్ ఔట్ లెట్ల మూసివేసేందుకు అంగీకరించడం లేదని మంత్రిత్వశాఖ వరుస ట్వీట్లలో పేర్కొంది. ఇది ప్రజల అసౌకర్యానికి దారి తీస్తుందని ట్వీట్ చేసింది. అలాగే ఈ ట్వీట్లను రీ ట్వీట్ చేసిన చమురు శాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ కూడా ఇదే సందేశాన్నిచ్చారు. మేజర్ డీలర్ అసోసియేషన్లు ఈ నిర్ణయంలో భాగస్వాములు కాదని ట్వీట్ చేశారు. మరోవైపు పబ్లిక్ సెక్టార్ ఆయిల్ సంస్థలకు చెందిన 53,223 పెట్రోల్ పంపుల్లో 80 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న బంకుల యాజమాన్యాలు ఈ ప్రక్రియలో పాల్గొనడం లేదని ప్రకటించాయి. అయితే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలోని కొన్ని భాగాలు , బెంగళూకు, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలోని కొన్ని ప్రాంతాలు ఆదివారం పెట్రోల్ ఔట్ లెట్లను బంద్‌ను పాటించేందుకు అంగీకరించాయి. కాగా ఎనిమిది రాష్ట్రాల్లో మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేసేందుకు నిర్ణయించినట్టు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఇటీవల ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సేవ్ ఆయిల్ పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నగదు బదిలీతో మిగులు తక్కువే!
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ.1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలు ద్వారా ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లుగా ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని... వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ.35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ పథకం కారణంగా జరిగిన మిగులుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొనడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లు మాత్రమే డీబీటీఎల్ కారణంగా మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనం కారణంగా వచ్చిందేనని పేర్కొంది. -
చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలు...ఇక ప్రైవేట్ సంస్థల చేతికి
69 క్షేత్రాల వేలానికి కేంద్రం నిర్ణయం ♦ వీటిలో నిక్షేపాల విలువ రూ. 70,000 కోట్లు! ♦ కొత్తగా... ఆదాయాల్లో వాటాల విధానం న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా అప్పగించిన 69 చమురు, గ్యాస్ క్షేత్రాలను వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. వీటిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించి కొత్త ఫార్ములాను ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇప్పటిదాకా అమల్లో ఉన్న.. ‘లాభాల్లో వాటాల విధానం’ కాకుండా ఇకపై స్థూల ఆదాయాల్లో వాటాలివ్వాలనే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. మరోవైపు, 2006-2011 మధ్య కాలంలో పప్పు ధాన్యాల దిగుమతులపై నాఫెడ్, పీఈసీ, ఎస్టీసీ తదితర సంస్థలకు వాటిల్లిన నష్టానికి సంబంధించి రూ.113.40 కోట్లు రీయింబర్స్ చేసేందుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఇంధన క్షేత్రాల వేలానికి సంబంధించి.. 69 చిన్న క్షేత్రాల్లో ప్రస్తుత రేట్ల ప్రకారం దాదాపు రూ.70,000 కోట్ల విలువ చేసే 89 మిలియన్ టన్నుల మేర చమురు, గ్యాస్ నిక్షేపాలున్నాయని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో పాటించిన లాభాల్లో వాటాల విధానం కారణంగా ప్రైవేటు ఆపరేటర్లు చేసే ప్రతి వ్యయాన్నీ ప్రభుత్వం పట్టి, పట్టి చూడాల్సి వస్తుండటం... జాప్యానికి, వివాదాలకు దారి తీస్తోందని తెలియజేశారు. ఆదాయాల పంపకానికి సంబంధించి కొత్త విధానం వల్ల చమురు ధరలు కనిష్ట స్థాయికి పడిపోయినా, గరిష్ట స్థాయికి ఎగిసినా ప్రభుత్వానికి దక్కాల్సిన ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉంటాయని ప్రధాన్ వివరించారు. తదుపరి నిర్వహించే లెసైన్సింగ్ రౌండులో కూడా ఇదే విధానాన్ని పాటించే అవకాశాలున్నాయని చెప్పారాయన. మూడు నెలల్లో బిడ్ డాక్యుమెంటు.. వేలంలో ఈ క్షేత్రాలను దక్కించుకునే సంస్థలకు రేటు పరంగాను, మార్కెటింగ్ పరంగానూ పూర్తి స్వేచ్ఛ కల్పిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నియంత్రణ సమస్య లేకుండా ఆయా కంపెనీలు మార్కెట్ రేటుకు ఎవరికైనా విక్రయించుకోవచ్చన్నారు. బిడ్ డాక్యుమెంటు మరో మూడు నెలల్లో సిద్ధమవుతుందని, ఆ తర్వాత వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచడానికి, ఈ రంగంలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి క్యాబినెట్ నిర్ణయం దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ఇంధన అన్వేషణకు ఇదే సరైన సమయం.. చమురు ధరలు ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన తరుణంలో వేలంపై అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనపరుస్తాయా అన్న ప్రశ్నకు.. టెక్నాలజీ సామర్థ్యం గల చిన్న సంస్థలే లక్ష్యంగా వేలం నిర్వహిస్తామని ప్రధాన్ తెలిపారు. చమురు ధర కనిష్టంగా ఉన్నప్పుడు డ్రిల్లింగ్ రిగ్గు సర్వీసులు మొదలైనవి కూడా తక్కువకే లభిస్తాయి కనుక.. ఇంధన అన్వేషణ కార్యకలాపాలకు ఇదే సరైన సమయమన్నారు. ఈ 69 క్షేత్రాల నుంచి ఉత్పత్తి మొదలవడానికి కనీసం మూడేళ్లు పట్టొచ్చని అప్పటికి ధర లు మళ్లీ మెరుగుపడగలవని అంచనా వేస్తున్నట్లు ప్రధాన్ పేర్కొన్నారు. వేలం ప్రక్రియ ఇలా.. నామినేషన్ ప్రాతిపదికన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) వద్ద 110 చిన్న చమురు, గ్యాస్ క్షేత్రాలుండేవి. అయితే, భౌగోళిక సంక్లిష్టత, పరిమాణం రీత్యా లాభసాటిగా లేకపోవడం, ప్రభుత్వ నిర్దేశిత రేటు గిట్టుబాటు కాకపోవడం వంటి అంశాల కారణంగా ఉత్పత్తి కుదరకపోవడంతో 63 క్షేత్రాలను ప్రభుత్వానికి కంపెనీ తిరిగి అప్పగించేసింది. ఆయిల్ ఇండియా కూడా ఇదే కారణంగా 6 క్షేత్రాలను వాపసు చేసింది. వీటినే ప్రభుత్వం వేలం వేయబోతోంది. వీటిలో 36 ఆఫ్‌షోర్, 33 ఆన్‌షోర్ క్షేత్రాలున్నాయి. వేలంలో వాటిని దక్కించుకునే కొత్త ఆపరేటరు.. ఇప్పటికే ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వాటిపై చేసిన వ్యయాలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌షోర్ క్షేత్రాల ఆపరేటర్లు 3 సంవత్సరాల్లో, ఆఫ్‌షోర్ ఆపరేటర్లు నాలుగు సంవత్సరాల్లో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. ఆయా బ్లాకులపై రాయల్టీ కూడా కట్టాలి. చమురు సెస్సు ఉండదు. లాభాల్లో వాటాల పద్ధతి కాకుండా ప్రభుత్వానికి ఆదాయాల్లో లేదా చమురు, గ్యాస్‌లో ఎంత వాటాలు ఇస్తారన్నది ముందుగా బిడ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. గరిష్ట స్థాయిలో వాటాలు ఇవ్వజూపే సంస్థ.. సదరు క్షేత్రాన్ని దక్కించుకుంటుంది. -
ఓఎన్జీసీ ప్రయోజనాలు కాపాడుతాం
చమురు శాఖ అభయం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు, దేశీయంగా సబ్సిడీ భారంతో సతమతమవుతున్న ఓఎన్జీసీ సహా ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి కంపెనీలను ఆదుకుంటామని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికంలో సబ్సిడీల కారణంగా చమురు ఉత్పత్తి సంస్థలు నష్టపోతున్న మొత్తాన్ని భర్తీ చేసేందుకు మార్గాలపై ఆర్థిక శాఖతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వివరించారు. సబ్సిడీల్లో కేంద్రం, చమురు కంపెనీలు భరించాల్సిన వాటాల గురించి సంప్రతింపులు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో కిరోసిన్, ఎల్పీజీ, డీజిల్‌ను సబ్సిడీ రేట్లకు విక్రయించడం వల్ల ఇంధన రిటైలింగ్ సంస్థలకు రూ. 67,091 కోట్ల నష్టం వాటిల్లగా, అందులో 54 శాతాన్ని ఓఎన్జీసీ భరించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీపై భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు, ఇరాన్లో పెట్టుబడులున్న దేశీ కంపెనీలపై అమెరికా గనుక ఆంక్షలు విధించిన పక్షంలో వాటి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాన్ తెలిపారు. అయితే, ఏం చర్యలు తీసుకుంటామన్నది వివరించకుండా.. మీడియా ముఖంగా ఇలాంటివి చర్చించడం సరికాదని పేర్కొన్నారు. -
చమురు శాఖకు రిలయన్స్ మరో ఆర్బిట్రేషన్ నోటీస్
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో 814 చదరపు కిలోమీటర్ల(చ.కి.మీ) ప్రాంతాన్ని వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) సవాలు చేసింది. ఇందులో తాము కనుగొన్న 5 గ్యాస్ నిక్షేపాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటూ మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) నోటీసులను జారీ చేసింది. కేజీ-డీ56లో మొత్తం 7,645 చ.కి.మీ. ప్రాంతానికి గాను అన్వేషణ ఏరియాలో లేని 5,385 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కి ఇచ్చేయనున్నట్లు 2013లో ఆర్ఐఎల్ ప్రతిపాదించింది. అయితే, కేటాయింపుల గడువు పూర్తయినందున 6,199 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కివ్వాలని చమురు శాఖ అదే ఏడాది అక్టోబర్‌లో ఆదేశించింది. అయితే, ఈ అదనపు ఏరియాలో తాము 1 ట్రిలియన్ ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని ఆర్ఐఎల్ చెబుతోంది. -
గెయిల్ తప్పిదాలే కారణం
-
గెయిల్ తప్పిదాలే కారణం
‘నగరం’ పేలుడుపై స్పష్టం చేసిన విచారణ కమిటీ నివేదిక న్యూఢిల్లీ: తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో జూన్ 27న జరిగిన విస్ఫోటనానికి ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(గెయిల్) తప్పిదాలే కారణమని చమురు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తేల్చింది. ఈ ఘటనలో 22 మంది మృతి మరణించడం తెలిసిందే. దీనిపై విచారణకు చమురు మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి(రిఫైనరీస్) రాజేష్‌కుమార్ సింగ్ సారథ్యంలో ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించింది. వినియోగదారులకు డ్రై గ్యాస్ సరఫరా కోసం తాటిపాక-కొండపల్లి పైప్‌లైనును గెయిల్ నిర్మించింది. అయితే ఈ పైప్‌లైనులో నీటితో కూడిన, అధికంగా మండే స్వభావం కల హైడ్రోకార్బన్ల మిశ్రమంతో కూడిన సహజవాయువు సరఫరా అవుతుండడంతో పైపులైను తుప్పుపట్టిపోయి.. అది లీకేజీకి దారితీసిందని, తద్వారా వెలువడిన గ్యాస్ వాతావరణంలోకి దట్టంగా వ్యాపించి.. పేలుడుకు కారణమైందని నివేదిక వెల్లడించింది. ఈ పేలుడు వ్యవహారానికి వ్యక్తిగతంగా ఎవరు కారణమనేది నిర్ధారించడం కష్టసాధ్యమని తెలిపింది. అయితే అత్యధిక పీడనంతో సహజవాయువు సరఫరా జరిగే ఈ పైపులైన్లను పదేపదే మరమ్మతు చేయడంలో గెయిల్ సరైన విధానాలు పాటించకపోవడం ఈ పేలుడుకు దారితీసిన కారణాల్లో ఒకటని తేల్చింది. సహజవాయువుతోపాటు కార్బన్ డైఆకై ్సడ్, నీరు, సల్ఫర్ పైపులైన్లలో సరఫరా అవుతుండడంతో కాలక్రమంలో పైపులైను తుప్పుపట్టిందని తెలిపింది. సహజవాయువు నుంచి నీటిని, హైడ్రోకార్బన్ ద్రవాల మిశ్రమాన్ని తొలగించేందుకోసం పైపులైన్ ప్రారంభమయ్యే తాటిపాక వద్ద గ్యాస్ డీహైడ్రేషన్ యూనిట్(జీడీయూ)ను ఏర్పాటు చేస్తానన్న తన హామీని గెయిల్ నిలుపుకోలేదని తప్పుపట్టింది. అదే కనుక ఏర్పాటైనట్లయితే పైపులైను కోతకు గురికాకుండా నివారించడానికి, లీకేజీని నిరోధించడానికి వీలయ్యేదని తెలిపింది. ఇవీ సిఫార్సులు..: పైపులైన్ల నుంచి స్వచ్ఛమైన సహజవాయువు సరఫరా అయ్యేలా చూడాలి. ఇందుకుగాను అందులో ఉండే నీటిని, మండేస్వభావం కల హైడ్రోకార్బన్ ద్రవాల మిశ్రమాన్ని తొలగించేందుకు వీలుగా గ్యాస్ డీహైడ్రేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలి. పైపులైన్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. లీకేజీలను కనిపెట్టేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నిర్వహణపరమైన వైఫల్యాలపై వివిధ స్థాయిల్లో గెయిల్ అంతర్గత విచారణను తప్పక పూర్తి చేయాలి. లోపాలకు బాధ్యులెవరో గుర్తించాలి. జగన్ కేసులో మరో చార్జిషీట్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందూ ప్రాజెక్టుకోసం రాష్ట్ర హౌసింగ్ బోర్డుకు సంబంధించిన భూములను కేటాయింపు చేయడంపై ఈ చార్జిషీట్ సమర్పించింది. సీబీఐ ఎస్పీ చంద్రశేఖర్.. చార్జిషీట్ ప్రతిని మంగళవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగికి అందజేశారు. రెండు పెట్టెల్లో అనుబంధ పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఇందూ ప్రాజెక్టుకు భూకేటాయింపుల్లో క్విడ్‌ప్రోకో జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సీబీఐ 2013 సెప్టెంబర్ 17న 10వ చార్జిషీట్ దాఖలు చేయడం తెలిసిందే. తాజా చార్జిషీట్‌తో కలిపి ఈ కేసులో సీబీఐ ఇప్పటికి 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. 10వ చార్జిషీట్ దాఖలు చేసిన దాదాపు ఏడాది తర్వాత ఈ చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. ఇందులో నిందితులుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, ఎస్ఎన్ మొహంతి, ఐ.శ్యాంప్రసాద్‌రెడ్డి, ఇందూ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, వైవీ సుబ్బారెడ్డి, వీవీ కృష్ణప్రసాద్, ఛిడ్కో ప్రైవేట్ లిమిటెడ్, వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందూ ఈస్ట్రన్ ప్రొవిన్స్, జితేంద్ర విర్వానీ, ఎంబసీ రియల్టర్స్, ఇందూ రాయల్ హోం ప్రైవేట్ లిమిటెడ్, కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లను పేర్కొంది. సీబీఐ కోర్టులో హాజరైన జగన్: తన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి బాలయోగి ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను ఈ నెల 23కు జడ్జి వాయిదా వేశారు. కాగా వైఎస్ జగన్ బెంగళూరు వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది. మంగళవారం నుంచి డిసెంబర్ 31 వరకు ఇందుకు అనుమతినిస్తూ న్యాయమూర్తి బాలయోగి ఉత్తర్వులు జారీచేశారు. బెంగళూరు వెళ్లే ముందు కోర్టుకు సమాచారమివ్వాలని షరతు విధించారు. -
చమురు శాఖకు ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను వ్యయ రికవరీలో అడ్డుకోవాలన్న చమురు శాఖ యత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అనుకున్న ప్రకారం కేజీ బేసిన్లో గ్యాస్‌ను ఉత్పత్తి చేసి ఉంటే ప్రభుత్వానికి 11.53 కోట్ల డాలర్ల లాభం వచ్చి ఉండేదని చమురు శాఖ లెక్కగట్టింది. ఈ మేరకు రిలయన్స్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 11.5 కోట్ల డాలర్లను తగ్గించాలని గెయిల్, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీఎల్)లను చమురు శాఖ కోరింది. ఇదే విషయాన్ని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గత నెలలో పార్లమెంటులో వెల్లడించారు కూడా. అయితే, రిలయన్స్ నుంచి కొనుగోలు చేసిన ముడిచమురు, గ్యాస్‌లకు తాము చెల్లించాల్సిందేమీ లేదనీ, కనుక 11.5 కోట్ల డాలర్ల చెల్లింపులను నిలిపివేయడం సాధ్యంకాదనీ ఓఎన్జీసీ, సీపీసీఎల్ ఆశక్తతను వ్యక్తంచేశాయి. 2009 మార్చి నుంచి 2014 ఏప్రిల్ వరకు కేజీ డీ6 బ్లాకు నుంచి క్రూడ్‌ను తాము కొనుగోలు చేసినట్లు సీపీసీఎల్ పేర్కొంది. ఆ తర్వాత చమురు కొనుగోలు టెండరును ఆర్ఐఎల్ జామ్‌నగర్ రిఫైనరీస్ చేజిక్కించుకోవడంతో తాము రిలయన్స్‌కు చెల్లించాల్సిన బాకీలేవీ లేవని చమురు శాఖకు తెలిపింది. కేజీ డీ6లో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌లో రోజుకు 2.594 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను తమకు కేటాయించారని గెయిల్ పేర్కొంది. అయితే, ఆ బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోవడంతో గతేడాది జూన్ నాటికే తమకు సరఫరా ఆగిపోయిందని వివరించింది. గ్యాస్ కొనుగోలు ఒప్పందం గడువు కూడా గత మార్చి 31తో ముగిసిందని తెలిపింది. తాజా పరిణామాల నేపథ్యంలో చమురు శాఖ ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది జామ్‌నగర్ రిఫైనరీస్‌కు క్రూడ్ ఆయిల్ అమ్మకాన్ని ఆపేసి, దాన్ని సీపీసీఎల్ కొనేలా చేయడం. అయితే ఇందుకు కొంత కాలం పడుతుంది. రెండో మార్గం.. కేజీ డీ6లో ఉత్పత్తయ్యే గ్యాస్ అంతటినీ కొనుగోలు చేస్తున్న ఎరువుల కంపెనీలను 11.50 కోట్ల డాలర్ల చెల్లింపులను నిలిపివేయాలని కోరడం. అయితే, ఇది సంక్లిష్టమైన వ్యవహారమని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. -
వైదొలగుతూ విమర్శనాస్త్రాలు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ డీ6 వివాదానికి సంబంధించిన ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) ట్రిబ్యునల్‌కు ఆర్బిట్రేటర్‌గా సుప్రీం కోర్టు నియమించిన ఆస్ట్రేలియా జడ్జి మైకేల్ మెక్‌హ్యూ ఆ పదవి నుంచి తప్పుకునే ముందు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తన ప్రకటనలకు తప్పుడు భాష్యం చెప్పారని పేర్కొన్నారు. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకుగాను 237 కోట్ల డాలర్ల వ్యయ రికవరీని ప్రభుత్వం నిరాకరించింది. సర్కారు నిర్ణయం సరైనదేనా అని తేల్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు మూడో ఆర్బిట్రేటర్‌గా మెక్హ్యూను ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు నియమించింది. తనను సంప్రదించలేదంటూ ఈ పదవిని చేపట్టడానికి తొలుత నిరాకరించిన ఆయన కేజీ డీ6 భాగస్వాములు సంప్రదించడంతో మే 29న సుముఖత వ్యక్తంచేశారు. ఒకసారి నిరాకరించిన తర్వాత మళ్లీ ఆ పదవిని చేపట్టజాలరంటూ ప్రభుత్వం, దాని తరఫు న్యాయవాదులు వ్యాఖ్యానించడంతో... వైదొలగుతున్నానంటూ జూలై 20న మెక్‌హ్యూ ప్రకటించారు. అంతకుముందుగానే ప్రభుత్వ లాయర్లకు లేఖ రాశారు. ‘సుప్రీం కోర్టు ప్రతిపాదనకు విముఖత వెలిబుచ్చుతూ మే 25న ఈమెయిల్ పంపించాను. దాన్ని కోర్టు ఆమోదించేంత వరకూ నేను ఉపసంహరించుకున్నట్లు భావించరాదు. ఓ సైనికాధికారి రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించే వరకు రాజీనామా లేఖ ప్రభావం ఉండదు. కోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ వ్యవహారం కూడా ఇలానే ఉంటుంది..’ అని మెక్‌హ్యూ వ్యాఖ్యానించారు. -
సహజవాయువు ధర 6-6.5 డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరను 6-6.5 డాలర్లకు మాత్రమే పెంచాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)కు మాత్రం ప్రస్తుతానికి గ్యాస్ ధరను ఇప్పుడున్న 4.2 డాలర్లకే కట్టడి చేయాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా గ్యాస్ సరఫరాల్లో కొరతను(1.9 లక్షల ఘనపుటడుగులు-టీసీఎఫ్) పూడ్చుకునేవరకూ ఆర్ఐఎల్కు రేటు పెంపును వర్తింపజేయరాదనేది చమురు శాఖ ప్రతిపాదనగా వెల్లడించారు. ఒక్కో యూనిట్ గ్యాస్ రేటును ఇప్పుడున్న 4.2 డాలర్ల నుంచి రెట్టింపు స్థాయిలో 8.4-8.8 డాలర్లకు పెంచాలన్న రంగారాజన్ కమిటీ ఫార్ములాను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్ 1 నుంచి కొత్త రేటును అమలు చేయాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. మోడీ ప్రభుత్వం కొలువుదీరాక పెంపును అమలు చేయొచ్చని భావించగా.. ఇంత భారీగా గ్యాస్ రేటును పెంచితే విద్యుత్, ఎరువులు తదితర రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్న కారణంతో సెప్టెంబర్ చివరి వరకూ వాయిదా వేశారు. రంగరాజన్ కమిటీ ఫార్ములాలో మార్పుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా చమురు శాఖ అంతర్గతంగా జరిపిన చర్చల్లో రేటు పెంపును 6-6.5 శాతానికే పరిమితం చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. దీనివల్ల అటు చమురు కంపెనీలకూ ఇటు వినియోగదారులకూ ఊరట కల్పించవచ్చనేది పెట్రోలియం శాఖ యోచన. 1.9 టీసీఎఫ్‌ల గ్యాస్ కొరతను పూడ్చేవరకూ ఆర్ఐఎల్ పాతరేటునే(డీ1, డీ3 బ్లాకులకు) వర్తింపజేసి, తర్వాత జరిపే ఉత్పత్తి(దాదాపు 2.5 టీసీఎఫ్)కి కొత్త రేటును అమలు చేయాలని చమురు శాఖ భావిస్తోం ది. ఆర్ఐఎల్ కేజీ-డీ6 బ్లాక్‌లోని మిగతా క్షేత్రాలు, ఇతరచోట్ల ఉన్న బ్లాక్‌లలో జరిపే ఉత్పత్తికి మాత్రం ఇతర కంపెనీలకు మాదిరిగానే కొత్తరేటును వర్తింపజేసే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఓఎన్జీసీ అన్వేషణలకు తిరస్కరణ.. కేజీ బేసిన్‌లోని డీ5 బ్లాక్‌లో ఓఎన్జీసీ కనుగొన్న 11 చమురు, గ్యాస్ అన్వేషణలకు గాను మూడింటిని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) తిరస్కరించింది. ఇవి వాణిజ్యపరంగా లాభదాయకమైనవిగా గుర్తింపు(డీఓసీ) ఇచ్చేందుకు నిరాకరించింది. డీజీహెచ్ నిర్దేశించిన ప్రకారం వీటిలో ధ్రువీకరణ పరీక్షలను నిర్వహించకపోవడమే ఆమోదం తెలపకపోవడానికి కారణమని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. -
ఆ గ్యాస్ నిక్షేపాలను ఆర్‌ఐఎల్‌కే ఇవ్వండి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన కేజీ డీ6 బ్లాకులో కనుగొన్న మూడు గ్యాస్ బావుల అభివృద్ధి సాంకేతిక వివాదంతో నిలిచిపోయిన నేపథ్యంలో... గడువు సడలించి, ఉత్పత్తి చేసుకోవడానికి ఆర్ఐఎల్ను అనుమతించాలని చమురు శాఖ కేంద్ర మంత్రివర్గాన్ని కోరనుంది. ధీరూభాయ్ 29, 30, 31 అనే పేర్లు పెట్టిన ఈ బావుల్లో 145 కోట్ల డాలర్ల విలువైన నిక్షేపాలున్నట్లు అంచనా. వీటిలో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతించాలని కోరుతూ 2010లో ఆర్ఐఎల్ లాంఛనంగా చమురు శాఖకు దరఖాస్తు పంపింది. అయితే నిర్ణీత ధ్రువీకరణ పరీక్షలు నిర్వహించని కారణంగా ఆర్ఐఎల్ అభ్యర్థనను డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) తిరస్కరించింది. డ్రిల్ స్టెమ్ టెస్ట్ (డీఎస్టీ) నిర్వహణకు రిలయన్స్ అంగీకరించినప్పటికీ, గడువు ముగిసిపోయిందని డీజీహెచ్ పేర్కొంది. దాదాపు 34,500 కోట్ల ఘనపు అడుగుల మేర ఉన్న గ్యాస్ నిక్షేపాల వెలికితీతకు ఆర్ఐఎల్ను నిరాకరించడం, కొత్తగా బిడ్డింగ్ నిర్వహించడం వల్ల బావుల అభివృద్ధి ఆలస్యమవుతుందని చమురు శాఖ భావిస్తోంది. ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం)ను కోరితే ఉత్పత్తి మరింత జాప్యమవుతుందని యోచిస్తోంది. కనుక, ఉత్పత్తి పంపిణీ ఒప్పందం(పీఎస్సీ)లోని గడువులను సవరించి, ఆర్ఐఎల్కు అవకాశం ఇవ్వాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీని చమురు శాఖ కోరనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఎల్పీజీ, కిరోసిన్ ధరల పెంపు నిలుపుదల
న్యూఢిల్లీ: ఎల్పీజీ, కిరోసిన్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేయాలని కేంద్రం బుధవారం నిర్ణయించింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో స్థానిక లెవీల కారణంగా ఇంధన ధరలు పెరగడంతో ప్రజలపై ఒకేసారి ఎక్కువ భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ వంటి లెవీలు పెరగడంతో కేరళలో ఎల్పీజీ సిలిండరు రూ.4.50 మేర, కర్ణాటకలో రూ.3, మధ్యప్రదేశ్‌లో రూ.4.50, యూపీలో రూ.1 చొప్పున పెరిగింది. హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో కిరోసిన్ ధర 2 పైసలు, 8 పైసల చొప్పున పెరిగింది. మరోవైపు రాష్ట్ర పన్నులు తగ్గడంతో అస్సాంలో సిలిండర్ ధర రూ.9.50, బీహార్‌లో రూ.1.50, మహారాష్ట్రలో రూ.3 మేర తగ్గింది. నవీ ముంబై, మహారాష్ట్రలలో కిరోసిన్ ధరలో లీటరుకు 11 పైసల నుంచి రూ.1.32 దాకా తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో స్థానిక పన్నుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే వరకు పెంపును నిలుపుదల చేయాలని చమురు శాఖ ఆదేశాలు జారీచేసింది. -
గ్యాస్ ధర, సిలిండర్లు యథాతథం
చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాట్నా: గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలను పెంచే యోచనేదీ లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ప్రజలకు రాయితీపై సరఫరా చేసే వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుత రేట్లకే ఎల్పీజీని సరఫరా చేస్తామని చెప్పారు. వినియోగదారులపై అదనపు భారం మోపబోమని హామీ ఇచ్చారు. వంట గ్యాస్‌పై రాయితీ, సిలిండర్ల సంఖ్యను తమ ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందని శుక్రవారం ఆయన పాట్నాలో విలేకరులకు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఇది పెద్ద సమస్యని, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దేశంలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. -
గ్యాస్ ధర పెంచకుంటే పెట్టుబడులు నిలిచిపోతాయ్
న్యూఢిల్లీ: సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యం వల్ల కృష్ణ-గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6లో ప్రతిపాదిత రూ.24,000 కోట్ల పెట్టుబడులు నిలిచిపోతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. డీ34 క్షేత్రం అభివృద్ధికై ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్‌ను పూర్తి చేసినట్టు తెలిపింది. నవంబరు నుంచి పనులు ప్రారంభించి, 2017లో గ్యాస్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో కావాల్సిన పరికరాలకు టెండర్లను ఆహ్వానించినట్టు పేర్కొంది. ‘రాబోయే రోజుల్లో సహజ వాయువు ధరపై స్పష్టత లేదు. ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడి ప్రణాళికలు సంకటంలో పడ్డాయి. దీని వల్ల లక్ష్యం మరో ఏడాది ఆలస్యం అవుతుంది’ అని రిలయన్స్ వెల్లడించింది. సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌లు భారత ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు పెంచిన ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఐదేళ్లపాటు మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు 4.205 డాలర్లు చెల్లించాలన్న ఒప్పందం గడువు ఇప్పటికే ముగిసింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త రేటు ప్రకటనను వాయిదావేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది. -
దేశవ్యాప్తంగా గ్యాస్ పోర్టబిలిటీ
న్యూఢిల్లీ: సిలిండర్ల సరఫరాలో జాప్యం చేసే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, గ్యాస్ కంపెనీలను వినియోగదారులు మార్చుకునే సౌలభ్యాన్ని కల్పించే ఎల్పీజీ కనెక్షన్ పోర్టబిలిటీని కేంద్రం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ బుధవారం ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద 2013 అక్టోబర్ నుంచే 13 రాష్ట్రాల్లోని 24 జిల్లాల్లో ఈ పథకం అమల్లోకి వచ్చినా అందులో వినియోగదారులు కేవలం గ్యాస్ ఏజెన్సీలను మార్చుకునే సౌలభ్యాన్ని మాత్రమే కల్పించారు. తాజాగా దేశవ్యాప్తంగా 480 జిల్లాల్లో అందుబాటులోకి తెచ్చిన ఈ పథకంలో గ్యాస్ ఏజెన్సీలతోపాటు ఎల్పీజీ కంపెనీలను కూడా వినియోగదారులు మార్చుకునే వెసులుబాటు ఉంది. వినియోగదారుడికి ఎల్పీజీ కనెక్షన్ పోర్టబులిటీ అధికారంతో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ కంపెనీ తప్పనిసరిగా పనితీరు మెరుగుపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పెట్రోలియంశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కనెక్షన్ పోర్టబులిటీ కోసం వినియోగదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దేశంలో 8.2 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులున్నారు. -
ప్రీమియం ఇంధనాలపై పన్నులు తగ్గించండి
న్యూఢిల్లీ: ప్రీమియం పెట్రోల్, డీజిల్‌లపై సుంకాలు తగ్గించాలని చమురు శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరారు. అధిక మైలేజీ నిచ్చే ఈ ప్రీమియం ఇంధనాలపై సుంకాల కోత కారణంగా, ఈ ప్రీమియం ఇంధనాల వాడకం పెరిగి సాధారణ ఇంధనాల వినియోగం తగ్గుతుందని ఆయన వివరించారు. ఈ ప్రీమియం ఇంధనాలపై ప్రభుత్వం అధికంగా ఎక్సైజ్ సుంకాలను విధిస్తోంది. ఫలితంగా సాధారణ ఇంధనాల కన్నా వీటి ఖరీదు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ పోకడలకనుగుణంగా భారత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పెషలైజ్డ్ పెట్రోల్, డీజిల్ ఇంధనాలను అందిస్తున్నాయి. ప్రీమియం, సాధారణ ఇంధనాల ధరల మధ్య వ్యత్యాసం రూ.8-14 గా ఉంది. దాదాపు నెల రోజుల పాటు జరిగిన చమురు పరిరక్షణ ఉత్సవాల ముగింపు సందర్భంగా మొయిలీ ఈ విజ్నప్తిని చేశారు. 2009 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రీమియం పెట్రోల్, డీజిల్‌లపై కొత్తగా సుంకాలను విధించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ తరహా ఇంధనాలకు సబ్సిడీలనివ్వటాన్ని కూడా ప్రభుత్వం నిలిపేసింది. సాధారణ పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.20, ప్రీమియం పెట్రోల్‌పై రూ.7.50 చొప్పున ప్రభుత్వం సుంకాలను విధిస్తోంది. ఇక సాధారణ డీజిల్‌పై లీటర్‌కు రూ.1.46, ప్రీమియం డీజిల్‌పై రూ.3.75 చొప్పున ప్రభుత్వం సుంకాలను విధిస్తోంది. ప్రీమియం ఇంధనాలపై సుంకాల తగ్గింపుతో ప్రభుత్వ ఆదాయమేమీ గణనీయంగా పడిపోదని, వీటి విక్రయాలు ప్రస్తుతానికి స్వల్పంగా ఉ ండటమే దీనికి కారణమని మొయిలీ అన్నారు. -
రాత్రిపూట బంకులు మూసేయం
న్యూఢిల్లీ: పెట్రోలు డిమాండ్ తగ్గించేందుకు రాత్రివేళల్లో బంకులు మూసివేయాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తమ వద్ద అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ‘‘ఈ ప్రతిపాదన పెట్రోలి యం శాఖ చేయలేదు. ఇది మా ఆలోచన కానేకాదు. ప్రజలు, కొన్ని సంస్థల నుంచి ఈ సలహాలు వ చ్చాయి. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆయన వివరించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ పొదుపుపై తన మంత్రిత్వశాఖ పరిధిలోని పెట్రోలియం వినియోగం, పరిశోధన సంస్థ ఈనెల 16 నుంచి ఆరు వారాలపాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. రాత్రి 8 గంటల నుంచి పొద్దున 8 వరకు బంకులను మూసివేస్తే చమురు డిమాండ్ 3 శాతం మేర తగ్గుతుందని, దీంతో రూ.16 వేల కోట్లు ఆదా చేయవచ్చన్న ప్రతిపాదన పెట్రోలియం శాఖ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
డీజిల్‌పై త్వరలో రూ.3 వడ్డింపు!
న్యూఢిల్లీ: డీజిల్ ధరలు త్వరలోనే లీటరుకు రూ.3 వరకూ పెరగనున్నాయి. ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చేవారం ముగిసిన వెంటనే డీజిల్‌పై వడ్డనకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనం అవుతుండటంతో ప్రభుత్వంపై చమురు సబ్సిడీ భారం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో డీజిల్ ధరలను పెంచే అవకాశాలున్నాయి. అయితే ధరల పెంపుదలకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ప్రతిపాదన లేదని, కానీ రూపాయి పతనం కావడం మాత్రం ఆందోళనకరమేనని మంగళవారమిక్కడ పెట్రోలియం శాఖ మంత్రి ఎం.వీరప్ప మొయిలీ అన్నారు. ఇప్పటికైతే ధరల పెంపు లేదని, భవిష్యత్తులో సంగతి చెప్పలేనన్నారు. మంగళవారం ఒక డాలరుకు రూపాయి విలువ 66 నుంచి పతనమై 66.24 వద్ద ముగిసింది. దీంతో ప్రభుత్వ చమురు కంపెనీలు ముడిచమురు దిగుమతి కోసం మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా రిటైల్ ధరలు కూడా పెంచకపోతే ఆ మేరకు ప్రభుత్వమే లోటును భర్తీ చేయాల్సి ఉంటుంది. కాగా, నష్టాలు భర్తీ అయ్యేంతవరకూ ప్రతినెలా లీటరుపై 50 పైసల చొప్పున పెంచేందుకుగాను కంపెనీలకు గత జనవరిలో కేంద్రం అనుమతించిం ది. అయినా.. రూపాయి పతనం వల్ల ప్రస్తుతం లీటరు డీజిల్‌పై రూ.10.22 వరకూ నష్టం వస్తున్నట్లు అంచనా. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఒకేసారి భారీ మొత్తంలో ధరను పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. చివరిగా ఆగస్టు 1న 56 పైసలు పెంచడంతో ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.51.40కి చేరింది.