న్యూఢిల్లీ: పెట్రోలు డిమాండ్ తగ్గించేందుకు రాత్రివేళల్లో బంకులు మూసివేయాలన్న ప్రతిపాదనపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తమ వద్ద అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. ‘‘ఈ ప్రతిపాదన పెట్రోలి యం శాఖ చేయలేదు. ఇది మా ఆలోచన కానేకాదు. ప్రజలు, కొన్ని సంస్థల నుంచి ఈ సలహాలు వ చ్చాయి. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ఆయన వివరించారు. సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు.
పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ పొదుపుపై తన మంత్రిత్వశాఖ పరిధిలోని పెట్రోలియం వినియోగం, పరిశోధన సంస్థ ఈనెల 16 నుంచి ఆరు వారాలపాటు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేపడుతుందని చెప్పారు. రాత్రి 8 గంటల నుంచి పొద్దున 8 వరకు బంకులను మూసివేస్తే చమురు డిమాండ్ 3 శాతం మేర తగ్గుతుందని, దీంతో రూ.16 వేల కోట్లు ఆదా చేయవచ్చన్న ప్రతిపాదన పెట్రోలియం శాఖ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
రాత్రిపూట బంకులు మూసేయం
Published Tue, Sep 3 2013 6:05 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement