గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలను పెంచే యోచనేదీ లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
పాట్నా: గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలను పెంచే యోచనేదీ లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ప్రజలకు రాయితీపై సరఫరా చేసే వంటగ్యాస్ సిలిండర్ల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు. ప్రస్తుత రేట్లకే ఎల్పీజీని సరఫరా చేస్తామని చెప్పారు. వినియోగదారులపై అదనపు భారం మోపబోమని హామీ ఇచ్చారు.
వంట గ్యాస్‌పై రాయితీ, సిలిండర్ల సంఖ్యను తమ ప్రభుత్వం యథాతథంగా కొనసాగిస్తుందని శుక్రవారం ఆయన పాట్నాలో విలేకరులకు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ఇది పెద్ద సమస్యని, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దేశంలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.