సాక్షి, ముంబై: వంట గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచిన కేంద్రం ఇపుడు వినియోగదారులకు మరో షాక్ ఇవ్వనుంది. గ్యాస్ కొత్త కనెక్షన్లు తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంగళవారం ఆమోదం తెలిపింది.
చమురు మార్కెటింగ్ కంపెనీల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి.
అంటే డొమెస్టిక్ (14.2 కిలోలు) సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ. 1450గా ఉంది. తాజా పెంపుతో కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు రూ.2,500కు పైనే చెల్లించాలి. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు ఇతర చార్జీల బాదుడు కూడా తప్పదు. ఫలితంగా కొత్తగా గ్యాస్ కనెక్షన్ పొందాలనే కస్టమర్లకు అదనపు భారం పడుతుంది. అయితే ఉజ్వల స్కీమ్ వినియోగదారులకు సవరించిన రేట్లు వర్తించవు. అలాగే డబుల్ సిలిండర్ కనెక్షన్ పొందే వారికి మరింత భారం తప్పదు. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది. దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించుకోవాలి. పెంచిన ధరలు రేపటి నుంచి (జూన్ 16) నుంచి అమలులోకి వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త కనెక్షన్‌కు రూ.900 నుంచి రూ.1,150కి, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.200 నుంచి రూ.1,450 చెల్లించాల్సి ఉంటుంది.
సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో ఉంది. బహుళ కనెక్షన్లు ఉన్నవారు అదనపు కనెక్షన్లను సరెండర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కనెక్షన్‌లన్నింటినీ బ్లాక్ చేస్తున్నాయి. అంతేకాదు అదనపు కనెక్షన్ సరెండర్ అయ్యే వరకు రీఫిల్‌లను జారీ చేయడం లేదు.అలాగే కనెక్షన్లు బ్లాక్ చేయబడిన కస్టమర్లు మరొక చమురు కంపెనీ నుండి తాజా కనెక్షన్‌ను పొందకుండా నిరోధించేలా కొత్త కనెక్షన్‌లను నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment