కేజీ-డీ6 బ్లాక్‌లో 814 చదరపు కిలోమీటర్ల(చ.కి.మీ) ప్రాంతాన్ని వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) సవాలు చేసింది.
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో 814 చదరపు కిలోమీటర్ల(చ.కి.మీ) ప్రాంతాన్ని వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) సవాలు చేసింది. ఇందులో తాము కనుగొన్న 5 గ్యాస్ నిక్షేపాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటూ మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) నోటీసులను జారీ చేసింది. కేజీ-డీ56లో మొత్తం 7,645 చ.కి.మీ. ప్రాంతానికి గాను అన్వేషణ ఏరియాలో లేని 5,385 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కి ఇచ్చేయనున్నట్లు 2013లో ఆర్‌ఐఎల్ ప్రతిపాదించింది.
అయితే, కేటాయింపుల గడువు పూర్తయినందున 6,199 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కివ్వాలని చమురు శాఖ అదే ఏడాది అక్టోబర్‌లో ఆదేశించింది. అయితే, ఈ అదనపు ఏరియాలో తాము 1 ట్రిలియన్ ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని ఆర్‌ఐఎల్ చెబుతోంది.