Central Petroleum Ministry
-
హరిత హైడ్రోజన్ దిగ్గజంగా భారత్
హ్యూస్టన్: త్వరలోనే భారత్ హరిత హైడ్రోజన్ విభాగంలో లీడరుగా ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంధనాల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 నాటికి కుదించుకున్నామని పేర్కొన్నారు. జీవ ఇంధనా లు, హరిత హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, ప్రత్యా మ్నాయ వనరుల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి మొదలైన విభాగాల్లో అమెరికా–భారత్ కలిసి పని చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు అమెరికాలోని హ్యూస్టన్‌లో భారత కాన్సల్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. అమెరికన్ ఇంధ న కంపెనీలు, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యూఎస్ఐఎస్పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) క్షేత్రాల వేలానికి సంబంధించి అంతర్జాతీయ బిడ్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే 26 ఆఫ్‌షోర్ బ్లాకులకు కూడా బిడ్డింగ్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ హరిత ఇంధనానికి మళ్లాలన్న లక్ష్యం నుంచి అమె రికా, భారత్ పక్కకు తప్పుకోలేదని పురి చెప్పారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రభుత్వా లు ఇందుకు అవసరమైన విధానాలు, వాతావరణా న్ని మాత్రమే కల్పించగలవని ప్రైవేట్ రంగమే దీన్ని సాకారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోస్కో- ఆర్ఐఎన్ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో ఎంవోయూ కుదిరినట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. ప్లాంట్‌లో ఎవరి వాటా ఎంత ఉండాలన్న అంశం ఇంకా ఖరారు కాలేదని, అయితే ఎంవోయూ ప్రకారం 50 శాతం మేరకు తమకు వాటా ఉండాలని పోస్కో స్పష్టం చేసిందని వివరించారు. ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత ఉండాలన్నది, అది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు. కొండపల్లి - తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు.. విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తిరుపతి వరకు 450 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆసక్తి కనబరిచిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కొండపల్లి-తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ, విస్తరణ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ గెయిల్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ)కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ పైప్ లైన్ నిర్మాణం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు కోసం గ్యాస్ అనునిత్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టిన కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి వివరించారు. -
చమురు శాఖకు రిలయన్స్ మరో ఆర్బిట్రేషన్ నోటీస్
న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లో 814 చదరపు కిలోమీటర్ల(చ.కి.మీ) ప్రాంతాన్ని వెనక్కి తీసుకోవాలన్న కేంద్ర పెట్రోలియం శాఖ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) సవాలు చేసింది. ఇందులో తాము కనుగొన్న 5 గ్యాస్ నిక్షేపాలను కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంటూ మధ్యవర్తిత్వ(ఆర్బిట్రేషన్) నోటీసులను జారీ చేసింది. కేజీ-డీ56లో మొత్తం 7,645 చ.కి.మీ. ప్రాంతానికి గాను అన్వేషణ ఏరియాలో లేని 5,385 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కి ఇచ్చేయనున్నట్లు 2013లో ఆర్ఐఎల్ ప్రతిపాదించింది. అయితే, కేటాయింపుల గడువు పూర్తయినందున 6,199 చ.కి.మీ ప్రాంతాన్ని వెనక్కివ్వాలని చమురు శాఖ అదే ఏడాది అక్టోబర్‌లో ఆదేశించింది. అయితే, ఈ అదనపు ఏరియాలో తాము 1 ట్రిలియన్ ఘనపుటడుగుల(టీసీఎఫ్) గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని ఆర్ఐఎల్ చెబుతోంది.