హ్యూస్టన్: త్వరలోనే భారత్ హరిత హైడ్రోజన్ విభాగంలో లీడరుగా ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇంధనాల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని 2030 నుంచి 2025 నాటికి కుదించుకున్నామని పేర్కొన్నారు. జీవ ఇంధనా లు, హరిత హైడ్రోజన్, పెట్రోకెమికల్స్, ప్రత్యా మ్నాయ వనరుల నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి మొదలైన విభాగాల్లో అమెరికా–భారత్ కలిసి పని చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి నాలుగు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు అమెరికాలోని హ్యూస్టన్‌లో భారత కాన్సల్ జనరల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
అమెరికన్ ఇంధ న కంపెనీలు, అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ ప్రెసిడెంట్ ముకేశ్ అఘి తదితరులు ఇందులో పాల్గొన్నారు. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) క్షేత్రాల వేలానికి సంబంధించి అంతర్జాతీయ బిడ్డింగ్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే 26 ఆఫ్‌షోర్ బ్లాకులకు కూడా బిడ్డింగ్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ హరిత ఇంధనానికి మళ్లాలన్న లక్ష్యం నుంచి అమె రికా, భారత్ పక్కకు తప్పుకోలేదని పురి చెప్పారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ప్రభుత్వా లు ఇందుకు అవసరమైన విధానాలు, వాతావరణా న్ని మాత్రమే కల్పించగలవని ప్రైవేట్ రంగమే దీన్ని సాకారం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment