రిలయన్స్ బీపీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు | RIL, BP spend Rs 4500 crore to maintain gas output at KG-D6 | Sakshi
Sakshi News home page

రిలయన్స్ బీపీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు

Published Mon, Jul 25 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

రిలయన్స్ బీపీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు

రిలయన్స్ బీపీ రూ.4,500 కోట్ల పెట్టుబడులు

కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి కోసం
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నియంత్రణలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ కంపెనీ భాగస్వామి బ్రిటన్‌కు చెందిన బీపీ పీఎల్‌సీలు తూర్పు తీరంలోని కేజీ-డీ6 బ్లాక్‌పై రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.  ఏడేళ్ల నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్న ఈ బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి పడిపోయినప్పటికీ, గ్యాస్ ఉత్పత్తిని ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగించడానికి ఈ కంపెనీలు ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. కేజీ-డీ6 బ్లాక్‌లో దాదాపు 16 ప్రాంతాల్లో గ్యాస్ నిక్షేపాలు కనుగొన్నప్పటికీ ధీరూబాయ్-1, 3, గ్యాస్ క్షేత్రాల్లోనూ, ఎంఏ చమురు, గ్యాస్ క్షేత్రంలోనూ ఈ రెండు కంపెనీలు ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఈ క్షేత్రాల్లో 2009, ఏప్రిల్ నుంచి గ్యాస్ ఉత్పత్తి జరుగుతోంది. 2010 మార్చిలో రికార్డ్ స్థాయిలో రోజుకు 69.43 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తయింది. ఆ తర్వాత ఈ బావుల్లోకి నీరు, ఇసుక చేరడంతో ఉత్పత్తి మందగించింది. ఈ క్షేత్రాలు ప్రకృతి సహజంగానే క్షీణిస్తున్నప్పటికీ, ఈ క్షీణతను అడ్డుకోవడానికి, గ్యాస్ ఉత్పత్తిని పెంచడానికి ఈ రెండు కంపెనీలు  రూ.4,500 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
 
ఈ బ్లాక్‌లో ప్రస్తుతం 8.7 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. మరో రెండు బావుల్లో, ఎంఏ చమురు క్షేత్రంలోనూ డ్రిల్లింగ్ జరుగుతోందని, నీటిని తోడివేసి గ్యాస్ రికవరీ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. 2014, నవంబర్‌లో ఆమోదం పొందిన గ్యాస్ ధరల ఫార్ములా ప్రకారం (ఒక్కో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 3.06 డాలర్ల ధర) ధరను పొందడం కోసమే ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి గ్యాస్ ఉత్పత్తిని మెరుగుపరచాలని ఈ రెండు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.  ఈ ధరల ఫార్ములాను ఈ ఏడాది అక్టోబర్‌లో తగ్గించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement