10% పెరిగిన ఇంధన డిమాండ్‌ | 10% increase in fuel demand | Sakshi
Sakshi News home page

10% పెరిగిన ఇంధన డిమాండ్‌

Published Sat, Oct 21 2017 1:34 AM | Last Updated on Mon, Jul 29 2019 6:10 PM

10% increase in fuel demand - Sakshi

న్యూఢిల్లీ: భారత ఇంధన డిమాండ్‌ ఈ ఏడాది సెప్టెంబర్లో 10 శాతం పెరిగింది. ఇంధన డిమాండ్‌ ఈ స్థాయిలో పెరగడం గత ఏడాది కాలంలో ఇదే మొదటిసారి. చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా.. భారత్‌.. గత నెలలో 16.25 మిలియన్‌ టన్నుల పెట్రోలియమ్‌ ఉత్పత్తులను వినియోగించింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వినియోగం 14.78 మిలియన్‌ టన్నులుగా నమోదైంది.

చమురు శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం...
♦ గత ఏడాది ఆగస్టు తర్వాత చమురు ఉత్పత్తుల వృద్ధి గత నెలలోనే భారీగా నమోదైంది. ఆగస్టు, 2016లో డిమాండ్‌ 18.2 శాతానికి పెరిగింది.
♦  ఈ ఏడాది ఆగస్టులో చమురు ఉత్పత్తులకు డిమాండ్‌ 6.1% తగ్గింది. 2003 ఏప్రిల్‌ నుంచి చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. వివిధ ప్రాంతాల్లో వరదల కారణంగా ఈ ఆగస్టులో డీజిల్, పెట్రోల్‌ ఉత్పత్తులకు డిమాండ్‌  బాగా తగ్గింది.
♦ ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) అంచనాల ప్రకారం, 2040 వరకూ చమురు వినియోగంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ కొనసాగుతుంది. అయితే ♦  ఏడాది ఎనిమిది నెలలకు గాను  నాలుగు నెలల్లో ఆయిల్‌ డిమాండ్‌ పడిపోయింది.
♦  చమురు అవసరాల్లో దాదాపు 81 శాతం వరకూ మన దేశం దిగుమతి చేసుకుంటోంది.
♦ ఈ ఏడాది సెప్టెంబర్‌లో డీజిల్‌ అమ్మకాలు 16.5 శాతం వృద్ధితో 6.08 మిలియన్‌ టన్నులు, పెట్రోల్‌ వినియోగం 18 శాతం వృద్ధితో 2.14 మిలియన్‌ టన్నులకు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement