
నాలుగు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్‌లో గత పది, పదిహేను రోజుల్లోనే ముడి చమురు ధరలు 10 శాతం మేర తగ్గిపోతే భారత్‌లో మాత్రం పెట్రో ధరలు స్థిరంగా ఉండటం విశేషం. అయితే గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు చెక్ పెడుతూ.. ఇతర ప్రాంతాల్లో ధరల్లో తగ్గుదల కూడా కనిపించడం విశేషం. ఈ క్రమంలోనే ఆదివారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు.
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు నాలుగు మహానగరాలలో అంతటా స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.90.78, లీటరు డీజిల్ ధర రూ.81.10గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.19గా ఉంటే డీజిల్ రూ. 88.20గా ఉంది. కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 93.82గా ఉంటే డీజిల్ ధర రూ. 85.99 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.94.39, లీటరు డీజిల్ ధర రూ.88.45గా ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment