దేశంలో డీజిల్,పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం,శనివారం వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా మే 4 నుంచి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత చమరు ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయని మార‍్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 4నుంచి మే 27 మధ్యకాలంలో 14 సార్లు, జూన్ నెలలో 16సార్లు, జులై నెలలో(ఈరోజు వరకు) 8 సార్లు పెరిగాయి. కాగా,చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఇప్పుడు అదే అంశం పెట్రో ధరలపై పడినట్లు తెలుస్తోంది.
ఇక శనివారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది
న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది.
ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది.
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది.
విశాఖ పట్నంలో పెట్రోల్ ధర రూ.106.5 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.98.43గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment