
సాక్షి, న్యూఢిల్లీ : జైట్లీ బడ్జెట్ పలు వర్గాలను నిరాశపరిచినా పెరుగుతున్న పెట్రో ధరలతో కుదేలైన మధ్యతరగతికి మాత్రం కొంత ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి సర్కార్ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వం రెండు రూపాయల మేర తగ్గించింది.
అన్‌బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు ప్రభుత్వం రూ 6.48 నుంచి రూ 4.48కి తగ్గించింది. బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 7.66 నుంచి రూ 5.66కు తగ్గించింది. ఇక బ్రాండెడ్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 8.69కు తగ్గించింది. పెట్రో ఉత్పత్తుల ధరలు ఇటీవల పెరుగుతూ దేశవ్యాప్తంగా రికార్డు స్ధాయిలో లీటర్‌కు రూ 80కి చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంతో ఆ మేరకు వీటి ధరలు కొద్దిగా దిగివచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment