exice duty
-
వ్యవసాయం చేస్తూనే.. మూడు ఉద్యోగాల ఘనత తనది..
ఆదిలాబాద్: ఆయనది వ్యవసాయ కుటుంబం. అటు చదువుతూనే, ఇటు పొలం పనులు చేస్తూనే మూడు ఉద్యోగాలు సాధించాడు. అయినా అవి తనకు సరిపోదని సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు సారంగపూర్ మండలంలోని మలక్‌చించోలికి చెందిన సామ శ్రీనివాస్. ఆదివారం వెల్లడించిన ఎస్సై ఫలితాల్లో సత్తా చాటాడు. సామ హన్మంతు–పర్వవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన ప్రవీణ్, రెండోకు మారుడు నవీన్. మూడో కుమారుడు శ్రీనివాస్ చదువుతూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. మొదట వీఆర్వో రాగా, ప్రభుత్వం వేరే శాఖల్లో విలీనం చేయడంతో ఆయనకు ఫైర్ సర్వీసెస్‌లో ఉద్యోగం వచ్చింది. రెండోసారి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు. ఇది నచ్చక ఎస్సైగా ప్రిపేర్ అయి పరీక్ష రాస్తే సివిల్ ఎస్సైగా బాసర జోన్ సర్కిల్లో ఉద్యోగాన్ని సాధించాడు. -
పెట్రో ధరల తగ్గింపు: శరద్‌పవార్ స్పందన
పుణె: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించిన నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శక్రవారం స్పందించారు. ఆయన పుణెలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలకు బకాయిపడిన జీఎస్టీ నిధులు విడుదల చేస్తే, రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గిస్తాయని అన్నారు. చదవండి: Petrol and Diesel Price : వాహనదారులకు కేంద్రం శుభవార్త..! సరైన సమయంలో జీఎస్టీ నిధులు రాష్ట్రాలకు బదిలిచేస్తే ఇందన వ్యాట్ తగ్గింపుతో పాటు పలు సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడతాయని పేర్కొన్నారు. కేంద్ర సర్కారు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. -
పెరుగుతున్న పెట్రోలు ధర.. నిండుతున్న కేంద్ర ఖజానా
న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన ఎక్సైజ్ సుంకాలతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా సమకూరుతోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తులపై ఆదాయం 79 శాతం పెరిగినట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గల్లా పెట్టే గలగల కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వద్ద అందుబాటులోని సమాచారాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఎక్సైజ్ సుంకాల రూపంలో ఆదాయం రూ.1.71 లక్షల కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1.28 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. అంటే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33 శాతం అధికంగా సమకూరింది. ఇక కరోనా రావడానికి ముందు 2019లో ఇదే కాలంలో వచ్చిన ఆదాయం రూ.95,930 కోట్లుగానే ఉంది. ఎక్సైజ్ సుంకమే కీలకం గతేడాది కరోనా వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు గణనీయంగా పడిపోవడం తెలిసిందే. ఆ సమయంలో ఆదాయంలో లోటు సర్దుబాటు కోసం కేంద్ర సర్కారు పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను పెంచేసింది. ఆ తర్వాత పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గరిష్టాలకు చేరినప్పటికీ.. పూర్వపు సుంకాలనే కొనసాగిస్తుండడం గణనీయమైన ఆదాయానికి తోడ్పడుతోంది. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ వసూళ్లు రూ.3.89 లక్షల కోట్లు కాగా, 2019–20లో ఈ మొత్తం రూ.2.39 లక్షల కోట్లుగా ఉంది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, సహజ వాయువులపైనే విధిస్తున్నారు. చదవండి:పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల: సీఎన్జీపై బాదుడు -
పెట్రో భారాల నుంచి స్వల్ప ఊరట..
సాక్షి, న్యూఢిల్లీ : రికార్డు స్ధాయిలో పరుగులు పెట్టిన పెట్రో ఉత్పత్తుల ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వారం రోజులు పైగా వరుసగా తగ్గుతున్న పెట్రో ధరలు శుక్రవారం సైతం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 27 పైసలు తగ్గి రూ 85.71కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 80.85కు చేరగా, ముంబైల్ పెట్రోల్ లీటర్‌కు రూ 86.33కు దిగివచ్చింది. ఇక డీజిల్ లీటర్‌కు ఏడు పైసలు తగ్గి దేశ రాజధాని ఢిల్లీలో రూ 74.73 పలికింది. ముంబైలో డీజిల్ ధర లీటర్‌కు ఎనిమిది పైసలు తగ్గి రూ 78.33కు చేరింది. భగ్గుముంటున్న పెట్రో ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అక్టోబర్ 4న పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 1.50 మేర తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్డ్యూటీ తగ్గించం
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో వాటిపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించబోమని కేంద్రం తెలిపింది. ఈ విషయమై కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ దాన్ని సమీక్షిస్తే వెంటనే మీకు తెలియజేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు దేశరాజధానిలో యూరో–6 ప్రమాణాలతో శుద్ధిచేసిన పెట్రోల్, డీజిల్‌లను ఆవిష్కరించిన కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఇంధన ధరల్ని ప్రతిరోజూ సవరించే విధానంపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కేంద్రానికి అందుతున్న ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రాలకే తిరిగి చెల్లిస్తున్నామనీ, మిగతా 58 శాతం ఆదాయంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి పనుల్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలో చేర్చిఉంటే సామాన్యులకు ఊరట లభించిఉండేదన్నారు. -
పెట్రో షాక్ నుంచి రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : జైట్లీ బడ్జెట్ పలు వర్గాలను నిరాశపరిచినా పెరుగుతున్న పెట్రో ధరలతో కుదేలైన మధ్యతరగతికి మాత్రం కొంత ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల మోతతో సతమతమవుతున్న సామాన్యుడికి సర్కార్ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వం రెండు రూపాయల మేర తగ్గించింది. అన్‌బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు ప్రభుత్వం రూ 6.48 నుంచి రూ 4.48కి తగ్గించింది. బ్రాండెడ్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 7.66 నుంచి రూ 5.66కు తగ్గించింది. ఇక బ్రాండెడ్ డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ 8.69కు తగ్గించింది. పెట్రో ఉత్పత్తుల ధరలు ఇటీవల పెరుగుతూ దేశవ్యాప్తంగా రికార్డు స్ధాయిలో లీటర్‌కు రూ 80కి చేరిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఎక్సైజ్ డ్యూటీలను తగ్గించడంతో ఆ మేరకు వీటి ధరలు కొద్దిగా దిగివచ్చే అవకాశం ఉంది. -
ఏపీలో చీప్ లిక్కర్ కొరత
నాటుసారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నియంత్రించేందుకు చవక ధరలకు (చీప్ లిక్కర్) మద్యాన్ని టెట్రా ప్యాక్‌ల్లో అందిస్తామని ప్రభుత్వం చేసిన విధాన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అది చేయకపోవడంతో నాటుసారా, కల్తీ కల్లు, గుడుంబా లాంటివి తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీ మద్యం సేవించి కృష్ణా జిల్లాలో సోమవారం ఏడుగుగురు మృతి చెందగా, మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా తెరిచినా డిస్టిలరీలు మాత్రం ఉత్పత్తికి ముందుకు రాలేదు. చౌక మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గించినా తయారీకి ఉత్పత్తి కంపెనీలు ససేమిరా అంటున్నాయి. దీంతో రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఏర్పడింది. మార్కెట్లో చౌకమద్యం దొరక్క నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలు బాగా పెరిగాయి. గతంలో అన్ని జిల్లాల్లో కలుపుకొని రోజుకు 30 వేల లీటర్ల నాటుసారా అమ్ముడయ్యేది. ఇప్పుడు ఏపీలో సారా విక్రయాలు రోజుకు 50 వేల లీటర్ల వరకు జరుగుతున్నట్లు అంచనా. 20 శాతం చీప్ లిక్కర్ తయారు చేయాల్సిందే.. ఏపీలో మొత్తం 14 లైసెన్స్డ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ప్రూఫ్ లీటర్లు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తమ డిస్టిలరీల్లో 20 శాతం చీప్ లిక్కర్ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తామని కంపెనీల నిర్వాహకులు అంగీకార పత్రం ఇస్తారు. అయితే డిస్టిలరీలు కేవలం ప్రముఖ బ్రాండ్లను తయారు చేస్తూ చౌక మద్యాన్ని తయారు చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. హాలోగ్రామ్ అసలు సమస్యా... లూజు విక్రయాలను నిరోధించేందుకు 60 మిల్లీ లీటర్ల చీప్ లిక్కర్ బాటిల్స్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. 60 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.20కే అందించాలని నిర్ణయించింది. అయితే నిబ్ బాటిళ్ల తయారీకి హాలోగ్రామ్‌తో కూడిన లేబుల్ వేసేందుకు అదనంగా ఖర్చు కావడంతో వీటిని తయారు చేయలేమని, లీటరు బాటిల్ తయారు చేస్తామని తెగేసి చెబుతున్నాయి. డిస్టిలరీ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టెట్రా ప్యాక్‌లో చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించినా టెట్రా ప్యాక్ తయారీకి చైనా నుంచి మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉన్నందున ఉత్పత్తి కంపెనీలు వాటి జోలికెళ్లడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్టిలరీ కంపెనీలు మాత్రమే చౌకమద్యం ఉత్పత్తి చేయడం గమనార్హం.