ఆదిలాబాద్: ఆయనది వ్యవసాయ కుటుంబం. అటు చదువుతూనే, ఇటు పొలం పనులు చేస్తూనే మూడు ఉద్యోగాలు సాధించాడు. అయినా అవి తనకు సరిపోదని సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు సారంగపూర్ మండలంలోని మలక్‌చించోలికి చెందిన సామ శ్రీనివాస్. ఆదివారం వెల్లడించిన ఎస్సై ఫలితాల్లో సత్తా చాటాడు.
సామ హన్మంతు–పర్వవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన ప్రవీణ్, రెండోకు మారుడు నవీన్. మూడో కుమారుడు శ్రీనివాస్ చదువుతూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. మొదట వీఆర్వో రాగా, ప్రభుత్వం వేరే శాఖల్లో విలీనం చేయడంతో ఆయనకు ఫైర్ సర్వీసెస్‌లో ఉద్యోగం వచ్చింది. రెండోసారి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు. ఇది నచ్చక ఎస్సైగా ప్రిపేర్ అయి పరీక్ష రాస్తే సివిల్ ఎస్సైగా బాసర జోన్ సర్కిల్‌లో ఉద్యోగాన్ని సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment