sreenivas
-
నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం
సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ దుబాయ్‌లో తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఓ ఆరుగురి గురించి ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురిలో మలయాళ నటుడు నివిన్ పౌలీ ఒకరు. అయితే ఏ తేదీల్లో (గత డిసెంబరు 14 నుంచి 16) అయితే తనతో నివిన్ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆ మహిళ పేర్కొన్నారో అదే తేదీల్లో ఆయన ‘వర్షంగళుక్కు శేషమ్’ అనే మలయాళ సినిమా షూట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్రంలో నటించినపార్వతీ ఆర్. కృష్ణ తెలిపారు. అలాగే ఈ చిత్రదర్శకుడు వినీత్ శ్రీనివాసన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘ఆ మహిళ చెప్పిన తేదీలో కేరళలోని కొచ్చిలో ‘వర్షంగళుక్కు శేషమ్’ షూటింగ్లో ఉన్నారు నివిన్. అక్కడి న్యూక్లియస్ మాల్ లోపల, బయట కూడా చిత్రీకరణ జరిపాం. అలాగే మా సినిమా షూటింగ్ ముగించుకుని ‘ఫార్మా’ అనే వెబ్ సిరీస్ షూట్‌కి వెళ్లారు. ఇక నివిన్ మా టీమ్‌తోనే ఉన్నారనడానికి సీసీటీవీ ఫుటేజ్, మా యూనిట్లోనిపార్వతీ ఆర్. కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ సాబూ రామ్, మా నిర్మాత విశాఖ్ సుబ్రమణియం తదితరులు సాక్ష్యం’’ అని పేర్కొన్నారు వినీత్ శ్రీనివాసన్. ‘‘వర్షంగళుక్కు శేషమ్’లో నేనో చిన్నపాత్ర చేశాను. డిసెంబర్ 14న మా షూటింగ్‌కి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఆ రోజు నివిన్ కాంబినేషన్లో నేను కొన్ని సీన్స్‌లో నటించాను’’ అంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశారుపార్వతీ ఆర్. కృష్ణ. -
వ్యవసాయం చేస్తూనే.. మూడు ఉద్యోగాల ఘనత తనది..
ఆదిలాబాద్: ఆయనది వ్యవసాయ కుటుంబం. అటు చదువుతూనే, ఇటు పొలం పనులు చేస్తూనే మూడు ఉద్యోగాలు సాధించాడు. అయినా అవి తనకు సరిపోదని సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు సారంగపూర్ మండలంలోని మలక్‌చించోలికి చెందిన సామ శ్రీనివాస్. ఆదివారం వెల్లడించిన ఎస్సై ఫలితాల్లో సత్తా చాటాడు. సామ హన్మంతు–పర్వవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన ప్రవీణ్, రెండోకు మారుడు నవీన్. మూడో కుమారుడు శ్రీనివాస్ చదువుతూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. మొదట వీఆర్వో రాగా, ప్రభుత్వం వేరే శాఖల్లో విలీనం చేయడంతో ఆయనకు ఫైర్ సర్వీసెస్‌లో ఉద్యోగం వచ్చింది. రెండోసారి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు. ఇది నచ్చక ఎస్సైగా ప్రిపేర్ అయి పరీక్ష రాస్తే సివిల్ ఎస్సైగా బాసర జోన్ సర్కిల్లో ఉద్యోగాన్ని సాధించాడు. -
‘అల్లుడు అదుర్స్’ సక్సెస్ మీట్
-
శ్రీనివాస్‌కు రత్నశాస్త్ర శిరోమణి అవార్డు
యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన చింతకింది శ్రీనివాస్‌కు రత్నశాస్త్రం (జెమాలజి)లో రత్న శాస్త్ర శిరోమణి అవార్డు వచ్చింది. ఆదివారం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జరిగిన అఖిల భారత పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం 18వ వార్షిక మహాసభలో ఈ అవార్డును అందజేశారు. గత 20ఏళ్ల క్రితం ౖహె దరాబాద్‌కు వెళ్లి రత్నశాస్త్రంలో వివిధ రకాల నైపుణ్యత గల కోర్సులను అభ్యసించాడని, నవరత్న వ్యాపారం, టెస్టింగ్ ల్యాబ్ నడుపుతున్నారని శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణ తెలిపారు. అవార్డు గ్రహీత శ్రీనివాస్ తమిళనాడు నుంచి సాక్షితో ఫోన్లో మాట్లాడుతూ, ప్రతి మనిషి నవరత్నాలు నైపుణ్యం గలవని తెలుసుకోవాలని చెప్పారు. -
ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి
చిట్యాల: నల్లగొండ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నాంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్ శనివారం ఉదయం చిట్యాల మండలం నేరడ గ్రామ సమీపంలో రోడ్డు పక్కన శవమై కనిపించాడు. ఆయన నివాసం నల్లగొండలోని వీటీ కాలనీలో ఉంది. స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటికి చేరిన శ్రీనివాస్ మృతదేహం
ఆదిలాబాద్ : సౌదీఅరేబియాలో గతనెల 21న గుండెపోటుతో మృతి చెందిన బెడ్యారపు శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చేరింది. రెండు సంవత్సరాల క్రితం కూలీ పనుల కోసం శ్రీనివాస్ సౌదీ అరేబియా వెళ్లాడు. కాగా అక్కడ అతని యజమాని సరిగా జీతం చెల్లించకపోవడం, ఇంటి దగ్గర అప్పులు పెరిగిపోయాయి.దీంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అతను గుండెపోటుతో జనవరి 21న మరణించాడు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. (ఖానాపూర్)