న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో వాటిపై విధిస్తున్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించబోమని కేంద్రం తెలిపింది. ఈ విషయమై కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముక్ అధియా సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ దాన్ని సమీక్షిస్తే వెంటనే మీకు తెలియజేస్తాం’ అని వెల్లడించారు.
మరోవైపు దేశరాజధానిలో యూరో–6 ప్రమాణాలతో శుద్ధిచేసిన పెట్రోల్, డీజిల్‌లను ఆవిష్కరించిన కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఇంధన ధరల్ని ప్రతిరోజూ సవరించే విధానంపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. కేంద్రానికి అందుతున్న ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రాలకే తిరిగి చెల్లిస్తున్నామనీ, మిగతా 58 శాతం ఆదాయంతో దేశవ్యాప్తంగా అభివృద్ధి పనుల్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలో చేర్చిఉంటే సామాన్యులకు ఊరట లభించిఉండేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment