ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. టికెట్ల ధరలను పెంచాలంటే నిబంధనల ప్రకారం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లును ఆ చిత్ర నిర్మాతలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల 'భోళా శంకర్' టికెట్ల ధరలు పెంచేందకు అనుమతి లేనట్లు పేర్కొంది. 101 కోట్లతో సినిమాను నిర్మించినట్టు నిర్మాతలు పేర్కొన్నారు కానీ అందుకు అవసరమైన పత్రాలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది.
సినిమా నియంత్రణ చట్టం ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు నిర్మాతలు ఆధారాలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా డైరెక్టర్, హీరో, హీరోయిన్ల పారితోషికం కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చేయనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ తెలియజేసింది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే టికెట్ ధరలు పెంచుకొనే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది.
(ఇదీ చదవండి: Bhola Shankar: భోళాశంకర్ ఆపాలంటూ కేసు.. చంపుతామంటూ డిస్ట్రిబ్యూటర్‌కు బెదిరింపులు)
గతంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాకు టికెట్ ధరల పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని గుర్తుచేసింది. అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వానికి నిర్మాతలు అందించారని పేర్కొంది. ఇప్పుడు భోళా శంకర్ నిర్మాతలు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదు. కాబట్టే టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment