జంతుప్రేమికుల ఫిర్యాదుతో యువకుడి అరెస్టు
వేంపల్లె: ఇన్‌స్ట్రాగామ్‌లో లైక్‌ల కోసం ఓ యువకుడు పెంపుడు కుక్కలతో వేటకు వెళ్లి అడవిలో జంతువులను చంపి, ఆ వీడియోలను అప్‌లోడ్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని గమనించిన తెలంగాణ జంతు ప్రేమికులు ఆ యువకుడికి అదిరిపోయే షాక్ ఇచ్చారు. కట్‌చేస్తే వేంపల్లి ఫారెస్ట్ అధికారులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ ఘటన ఉమ్మడి కడప జిల్లా గాలివీడు మండలం వడ్డేపల్లెలో చోటుచేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలం, వడ్డేపల్లికి చెందిన బత్తల చిరంజీవి పెంపుడు కుక్కలతో సమీపంలోని కొండల్లోకి వెళ్లి, అడవి జంతువులను వేటాడి, వాటిని చంపి, లైకుల కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులు పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. అతను చేసే వీడియోలు వైరల్‌గా మారాయి.
వీటిని తెలంగాణ జంతు ప్రేమికులు గమనించి, వెంటనే కడప జిల్లా డీఎఫ్‌వో సందీప్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వేంపల్లె ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చి అతడిని అరెస్టు చేయాలని ఆదేశించారు. వేంపల్లె ఫారెస్టు అధికారి బాలసుబ్రమణ్యం తన సిబ్బందితో వెళ్లి బత్తల చిరంజీవిని అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment