ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్‌,డీజిల్‌ను ఆదా చేయండి | How To Save Fuel While Driving Details Here | Sakshi
Sakshi News home page

ఈ చిన్న చిన్న చిట్కాలతో పెట్రోల్‌,డీజిల్‌ను ఆదా చేయండి

Published Sat, Jul 24 2021 11:28 AM | Last Updated on Sat, Jul 24 2021 2:16 PM

How To Save Fuel While Driving Details Here - Sakshi

గత కొద్దిరోజులుగా చమురు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు.అయితే వాటి ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిట్కాలు పాటించి పెట్రోల్‌- డీజిల్‌ను సేవ్‌ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
స్పీడ్‌ డ్రైవింగ్‌ చేయకండి

మీ మోటారు వాహనాల‍్ని స్పీడ్‌గా డ్రైవ్‌ చేయడం,బ్రేకులు వేయడంవల్ల పెట్రోల్‌ లేదంటే డీజిల్‌ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా నడపడం వల్ల ఇంధనాన్ని సేవ​ చేసుకోవడమే కాదు. రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో డ్రైవింగ్‌ చేయడం వల్ల 33శాతం ఇంధనాన‍్ని ఆదా చేసుకోవచ్చు. 

మీ వేగాన్ని అదుపులో ఉంచుకోండి


మీకారు ఇంధన వినియోగం ఏరోడైనమిక్స్, రహదారులు, ఇంజిన్‌ సామర్ధ్యం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కారు వేగం పెరిగే కొద్దీ ఎదురుగా వీచే గాలిసామర్ధ‍్యం పెరిగిపోతుంది. దీంతో ఇంధనం అయిపోతుంది. ఇటీవల ఆటోమొబైల్‌ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వాహనాన్ని నడిపే పద్దతిని బట్టి అది పనిచేసే సామర్థ్యం గణనీయంగా పడిపోతుందని తేలింది. కాబట్టి మీరు 50- 60 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్‌ చేయడం ఉత్తమం.

ఇంధన సామర్ధ్యం ఎక్కువగా ఉండాలి


అది కారైనా కావొచ్చు, ద్విచక్రవాహనమైనా కావొచ్చు. అందులో ఇంధనం పూర్తి స్థాయిలో ఉండాలి. మనలో ఎక్కువమంది వాహనంలో తగినంత ఇంధన లేకపోయినా డ్రైవింగ్‌ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. మీ వాహనం పనితీరు మందగిస్తుంది.  

రెగ్యులర్ సర్వీసింగ్ అవసరం 


ఏదైనా వస‍్తువును వాడే కొద్ది దాని పనితీరు ఆగిపోతుంది. అలా కాకుండా దాని పనితీరు బాగుండాలంటే మరమ్మత‍్తులు అవసరం.వాహనాలు కూడా అంతే. సమయానికి వాహనాల్ని శుభ్రం చేయండి. ఇంజన్ , ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చెకింగ్‌ తో పాటు వాహనం కండీషన్‌ బాగుండేలా చూసుకోవాలి. 

మీ కారు అద్దాల్ని క్లోజ్‌ చేయండి


కారు అద్దాల్ని ఓపెన్‌ చేసి డ్రైవింగ్‌ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరిగిపోతుంది. ప్రయాణంలో కారు అద్దాల్ని ఓపెన్‌ చేయడం ద్వారా..కారు లోపలికి ప్రవేశించి మీ కారు మరింత వేగంగా వెళ్లేందుకు సాయం చేస్తుంది.దీంతో 10శాతం ఇంధన వినియోగం పెరిగిపోతుంది. 

ఏసీ వాడకం తగ్గించండి


డ్రైవింగ్‌ సమయాల్లో కారు ఏసీ వినియోగాన్ని తగ్గించండి.ప్రయాణంలో ఏసీ వినియోగించడం వల్ల ఇంజన్పై లోడ్‌ పెరిగి ఇంధన వినియోగం పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ వినియోగంపై పరిమితులు విధించండి. 

వాహనం టైర్లపై ఒత్తిడి పడకుండా చూడండి


కొంతమంది వాహనదారులు తమ వాహనాల్ని ఇష్టానుసారంగా వినియోగిస్తుంటారు. అవసరం లేకుండా బ్రేకులు వేస‍్తూ వాహనంపై ఒత్తిడిపడేలా చేస్తుంటారు. అలా కాకుండా వాహనాన్ని నెమ్మదిగా డ్రైవ్‌ చేస్తూ బ్రేక్‌ వినియోగాన్ని తగ్గిస్తే 20శాతం వరకు ఆదాచేసుకోవచ్చు. 

ఇంజన్  వినియోగాన‍్ని తగ్గించండి 


ప్రయాణంలో వాహనం ఇంజన్  వినియోగం ఎక్కువగా ఉంటే ఇంధన వినియోగం పెరిగిపోతుంది. అదే ప్రయాణంలో ఏమాత్రం చిన్న గ్యాప్‌ వచ్చినా ఇంజన్ ను ఆపేయండి. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇంజన్  ను ఆపేయడం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.ట్రాఫిక్‌లో 10శాతం కంటే ఎక్కువ సమయంలో ఇంజన్ ఆపేయడం ఉత్తమంది. దీని వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement