మోతెక్కుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీకి కోత పెడుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం మేర వ్యాట్ తగ్గించాలంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఇంధనాలపై 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. వ్యాట్ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా కిందకి దిగొచ్చాయి. వ్యాట్‌ను తాము 4 శాతం తగ్గించామని, ఈ మేరకు లీటరు పెట్రోల్ రూ.2.93, లీటరు డీజిల్ రూ.2.72 కిందకి దిగొచ్చాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పారు. గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర కూడా వ్యాట్‌ను తగ్గించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.2, లీటరు డీజిల్ ధరను రూ.1 తగ్గించినట్టు ప్రకటించింది.
వ్యాట్ నుంచి రాష్ట్రాలు ఎక్కువగా లబ్ది పొందుతుంటాయి. వ్యాట్ సేకరణతో పాటు 42 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వీరికి అందుతాయి. రాష్ట్రాలకు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలకు వినియోగిస్తోంది. కాగ, పెట్రోల్‌పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.21.48 నుంచి రూ.19.48కు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.17.33 నుంచి రూ.15.33కు తగ్గించింది. ఈ ప్రభావంతో లీటరు పెట్రోల్ ధర రూ.2.5, లీటరు డీజిల్ ధర రూ.2.25 తగ్గాయి.
Comments
Please login to add a commentAdd a comment