VAT cut
-
మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటులో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడింది. నేడు(సోమవారం) సీఎం షిండే బల నిరూపణలో సైతం పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజా ఆకర్షణ చర్యల్లో భాగంగా.. ఇంధన ధరలను తగ్గించనున్నట్టు తెలిపారు. కొత్త కేబినెట్ సమావేశం తర్వాత పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించనున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై కేబినెట్ తర్వలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే, గత ఏడాది నవంబర్‌లో, కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5, రూ. 10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించాయి. ఇక, మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వ్యాట్‌ను మరింత తగ్గించాయి. అయితే, ప్రజలకు ఉపశమన చర్యగా ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలన్న ప్రధాని సూచనను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తిరస్కరించాయి. కాగా, మహారాష్ట్రలో అప్పుడున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్ వ్యాట్‌ను తగ్గించలేదు. తాజాగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు -
పెట్రోలు ధర రూ.5 లు తగ్గింపు
ఒకవైపు అంతర్జాతీయంగా చమురుధరలు మళ్లీ పరుగు అందుకోగా పంజాబ్ ప్రభుత్వం వాహన దారులకు శుభవార్త అందించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ సమర్పించిన బడ్జెట్లో పెట్రో ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్రోలు ధర రూ.5, డీజిల్ ధర రూ.1 తగ్గనుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా పన్నుల వడ్డన ఏమీలేకుండానే రూ. 1,58,493 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలపై బడ్జెట్ ప్రాథమికంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. -
పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ కోత: ధరలు కిందకి
మరో బీజేపీ పాలిత రాష్ట్రం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించింది. గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ అనంతరం మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ల్పై వ్యాట్ తగ్గిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెట్రోల్‌పై రిటైల్ వ్యాట్‌ను 3 శాతం, డీజిల్‌పై రిటైల్ వ్యాట్‌ను 5 శాతం తగ్గిస్తున్నట్టు మధ్య ప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. ఈ తగ్గించిన వ్యాట్ ప్రకారం కొత్త ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లను కొంత నిరోధించడానికి ఎక్సైజ్ డ్యూటి వీటిపై లీటరు రూ.2 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు అనంతరం రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను 5 శాతం మేర తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల సీఎంలను ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో కోతపెడుతున్నాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో మూడు నెలలుగా భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నుంచి వినియోగదారులకు కొంత ఊరట లభించింది. రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తూ ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నాయి. -
వ్యాట్‌తో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయ్
మోతెక్కుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీకి కోత పెడుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌పై 5 శాతం మేర వ్యాట్ తగ్గించాలంటూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఇంధనాలపై 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరలపై వ్యాట్‌ను తగ్గించిన తొలి రాష్ట్రం కూడా ఇదే. వ్యాట్ తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా కిందకి దిగొచ్చాయి. వ్యాట్‌ను తాము 4 శాతం తగ్గించామని, ఈ మేరకు లీటరు పెట్రోల్ రూ.2.93, లీటరు డీజిల్ రూ.2.72 కిందకి దిగొచ్చాయని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని చెప్పారు. గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర కూడా వ్యాట్‌ను తగ్గించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.2, లీటరు డీజిల్ ధరను రూ.1 తగ్గించినట్టు ప్రకటించింది. వ్యాట్ నుంచి రాష్ట్రాలు ఎక్కువగా లబ్ది పొందుతుంటాయి. వ్యాట్ సేకరణతో పాటు 42 శాతం ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్లు వీరికి అందుతాయి. రాష్ట్రాలకు ఇవ్వగా మిగిలిన మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల్లో అమలుచేస్తున్న పథకాలకు వినియోగిస్తోంది. కాగ, పెట్రోల్‌పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.21.48 నుంచి రూ.19.48కు, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.17.33 నుంచి రూ.15.33కు తగ్గించింది. ఈ ప్రభావంతో లీటరు పెట్రోల్ ధర రూ.2.5, లీటరు డీజిల్ ధర రూ.2.25 తగ్గాయి. -
మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్
హైదరాబాద్: సెల్ ఫోన్ వినియోగదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొబైల్ ఫోన్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గిస్తూ టీఆర్ఎస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. వ్యాట్ ను 14 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో సెల్ ఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. పాత పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. మొబైల్ ఫోన్ ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిపే వినియోగదారులకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఊరట కలిగించనుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ సంస్థలు వ్యాట్ తగ్గించాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయం మొబైల్ తయారీ కంపెనీలకు ప్రోత్సాహాన్ని ఇవ్వనుంది. ప్రభుత్వ నిర్ణయంపై సెల్ ఫోన్ కంపెనీలు, డీలర్లు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.