ఒకవైపు అంతర్జాతీయంగా చమురుధరలు మళ్లీ పరుగు అందుకోగా పంజాబ్ ప్రభుత్వం వాహన దారులకు శుభవార్త అందించింది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికమంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ సమర్పించిన బడ్జెట్‌లో పెట్రో ధరలపై వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్రోలు ధర రూ.5, డీజిల్ ధర రూ.1 తగ్గనుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.
కొత్తగా పన్నుల వడ్డన ఏమీలేకుండానే రూ. 1,58,493 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ, ఆరోగ్యం, విద్య, గ్రామీణ, పట్టణ మౌలిక సదుపాయాలపై బడ్జెట్ ప్రాథమికంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment