ఇస్లామాబాద్: పెట్రోల్ అమ్మకాలపై పాకిస్తాన్ ప్రభుత్వం మార్జిన్ పెంచని కారణంగా జులై 22 నుండి జులై 24 వరకు రెండు రోజులు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం.
పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్లో లీటరు పెట్రోల్ రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్.
గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5%(రూ.12) మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%(రూ.6) మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం.
ఈ మేరకు శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపారు సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్.
ఇది కూడా చదవండి: తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే..
Comments
Please login to add a commentAdd a comment