సామాన్యుడిపై మరో భారం | Another burden on the common man | Sakshi
Sakshi News home page

సామాన్యుడిపై మరో భారం

Published Tue, Jul 1 2014 4:10 AM | Last Updated on Wed, Aug 15 2018 2:51 PM

సామాన్యుడిపై మరో భారం - Sakshi

సామాన్యుడిపై మరో భారం

- పెట్రోల్‌పై రూ.1.69 పెంపు.
- డీజిల్‌పై 50 పైసల బాదుడు
- జిల్లా ప్రజలపై ఏటా రూ.36.34 కోట్ల భారం
- నిత్యావసరాలపై చూపనున్న ప్రభావం

సాక్షి, అనంతపురం/ అనంతపురం కలెక్టరేట్ :  రైలు చార్జీల తర్వాత పెట్రో ధర పెంపుతో సామాన్యులపై మరో భారం పడింది. లీటరు పెట్రోలుపై రూ.1.69, డీజిలుపై 50 పైసలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం లీటరు పెట్రోల్ రూ.77.57 ఉండగా పెరిగిన ధరతో రూ.79.26 కు చేరుకుంది.

ఇక లీటరు డీజిల్ రూ.62.37 నుంచి రూ.62.87కు చేరుకుంది. పెట్రో ధరల పెంపు కారణంగా జిల్లా ప్రజలపై ఏటా రూ.36.34కోట్ల భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన రైలు చార్జీలతో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల ప్రభావం పరోక్షంగా నిత్యవసరాలపై చూపనుంది. పెట్రో ధరల పెంపుపై సామాన్యులు భగ్గుమన్నారు. జిల్లాలో 225 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రోజుకు 2.50 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది.

లీటరు పెట్రోల్‌పై రూ.1.69 పైసలు పెరగడంతో రోజుకు రూ.4,22,500, నెలకు రూ.1,26,75,000, ఏడాదికి రూ.15.21 కోట్లు ప్రజలపై అదనపు భారం పడనుంది. ఇక జిల్లాలో రోజుకు 10.64లక్షల డీజిల్ వినియోగం జరుగుతోంది. ఈ మేరకు లీటరుపై 50 పైసలు పెరగడంతో రోజుకు రూ.5.32 లక్షలు భారం పడనుండగా నెలకు రూ.1,59,60,000, ఏడాదికి రూ.19.15 కోట్ల భారం పడనుంది. .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement