
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆయా కేంద్రాల్లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించాలని ఈనెల 8న జరిగిన టీపీసీసీ నూతన కార్యవర్గం తొలిసమావేశంలో నిర్ణయించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్మల్‌లో సైకిల్, ఎడ్లబండ్ల ర్యాలీల్లో పాల్గొని అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాగా, ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క నేతృత్వంలో పలువురు వికలాంగులు జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయనను కలసి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment