
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్కై రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరగడమే కానీ తగ్గడం కనిపించడం లేదు. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సుమారు 50 పైసలు మేర పైకి ఎగిశాయి. మొత్తంగా గత నెల నుంచి పెట్రోల్‌పై లీటరుకు మూడు రూపాయలు, డీజిల్‌పై లీటరుకు నాలుగు రూపాయలు ధర పెరిగింది. ఇలా వాతపెడుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో మీ జేబులు ఖాళీ అవుతుంటే, వెంటనే బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులను వాడడంటూ ఆఫర్ చేస్తున్నాయి. మీ క్రెడిట్ కార్డుల వాడకం ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చని చెబుతున్నాయి. అన్ని ప్రైవేట్, ప్రభుత్వం రంగ బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై ఇంధన సర్‌ఛార్జ్‌ను మాఫీ చేస్తున్నాయి. అంతేకాక రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకుని, ఇంధనం కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నాయి.
కొటక్ మహింద్రా:
కొటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు...
రూ.500 నుంచి రూ.3000 మధ్యలో లావాదేవీలకు కొటక్ రాయల్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుదారులకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మాఫీ లభిస్తుంది. గరిష్ట మాఫీని ఏడాదిలో రూ.3500 పొందేలా పరిమితం చేసింది ఈ బ్యాంక్.
సిటీ బ్యాంక్ :
సిటీ బ్యాంక్ రివార్డ్స్ క్రెడిట్ కార్డు...
మీ క్రెడిట్ కార్డు ద్వారా రూ.125 విలువైన ప్రతి కొనుగోలుపై ఒక రివార్డు పాయింట్‌ను పొందవచ్చు. అప్పీరల్ లేదా డిపార్ట్‌మెంట్ స్టోర్లలో చేసే కొనుగోళ్లపై పది రెట్ల రివార్డు పాయింట్లను పొందవచ్చు. ఈ రివార్డు పాయింట్లను దేశవ్యాప్తంగా ఉన్న 800కు పైగా ఇండియన్ ఆయిల్ అవుట్‌లెట్లలో ఇంధన బిల్లులు చెల్లించడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క రివార్డు పాయింట్ విలువ 0.25 పైసలు.
ఇండియన్ ఆయిల్ సిటీ ప్లాటినం కార్డు...
దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక ఇండియన్ ఆయిల్ అవుట్‌లెట్లలో 150 రూపాయల విలువైన ఇంధన కొనుగోళ్లపై 4 టర్బో పాయింట్లను పొందవచ్చు. ఈ టర్బో పాయింట్లను ఉచిత ఇంధనం పొందడానికి ఉపయోగించుకోవచ్చు. ఒక్క టర్బో పాయింట్ ఉచిత ఇంధన విలువ రూపాయి. షాపింగ్, డైనింగ్ వంటి వాటిపై టర్బో పాయింట్లను పొందవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ :
హెచ్‌డీఎఫ్‌సీ మనీబ్యాక్ క్రెడిట్ కార్డు...
ఇంధన కొనుగోళ్లుపై ప్రతి నెలా గరిష్టంగా 250 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా :
బీపీసీఎల్ ఎస్‌బీఐ కార్డు...
మీరు జాయినింగ్ ఫీజు చెల్లించిన తర్వాత, రూ.500 విలువైన రివార్డు పాయింట్లు క్రెడిట్ అవుతాయి. వీటిని భారత్ పెట్రోలియయం అవుట్‌లెట్లలో ఇంధన బిల్లు చెల్లింపులకు వాడుకోవచ్చు. అంతేకాక బీపీ అవుట్‌లెట్ వద్ద ప్రతి ఫ్యూయల్ కొనుగోళ్లపై 4.25 శాతం వాల్యు బ్యాక్ ఆఫర్లను ఎస్‌బీఐ ఇస్తోంది. 4000 రూపాయల వరకు ఉన్న ప్రతి లావాదేవీపై, 1 శాతం సర్‌ఛార్జ్ మాఫీతో పాటు 3.25 శాతం వాల్యు బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు.
సింప్లీ క్లిక్ ఎస్‌బీఐ కార్డు అండ్ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డు....
రూ.500 నుంచి రూ.3000 మధ్యలో ఉన్న లావాదేవీలపై 1 శాతం సర్‌ఛార్జ్ మాఫీ వినియోగదారులకు లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై గరిష్టంగా నెలకు 100 రూపాయల వరకు మాఫీనీ పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా...
తన అన్ని క్రెడిట్ కార్డులపై జీరో ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment