
'కారు, బైకున్న వారు భరిస్తారు.. పెంపు కరెక్టే'
తిరువనంతపురం : పెట్రోల్ ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫాన్స్ ఈ అంశంపై మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం అంతా కూడా పేదల సంక్షేమం కోసమే ఉపయోగించనున్నామని చెప్పారు. 'ప్రభుత్వం ముందుగా అనుకునే తీసుకున్న నిర్ణయం. ఎవరైతే భరించగల పన్ను చెల్లించగల ప్రజలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరికి కారు, బైక్ ఉందో వారే పెట్రోల్ కొనుగోలు చేస్తారు.
అలాంటి వ్యక్తులు సాధారణంగానే ఆకలితో అలమటిస్తున్నవారు కాదు. మేం పన్నులు విధిస్తుంది పేదల జీవితాలను తీర్చిదిద్ది వారికి గౌరవమైన జీవితాన్ని ఇచ్చేందుకు. వారికి ఒక ఇళ్లు వస్తుంది. మరుగుదొడ్డు వస్తాయి.. కనీస అవసరాలకు కావాల్సిన వన్నీ తీరుతాయి. ఈ మార్గంలో వస్తున్న డబ్బంతా కూడా ప్రభుత్వం దోచుకుంటున్న సొమ్ముకాదు.. ఎవరు చెల్లించగలరో వారికే పన్నులు విధిస్తున్నాం' అంటూ అటు పెట్రోల్ ధరల పెంపును, పన్నుల విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు.