
విజయనగరం: ఓ పక్క అందుకోలేని పెట్రోల్ ధరలు.. మరో పక్క నిర్వహణ భారం.. వెరసి ద్విచక్ర వాహనాలు నడపడానికే భయపడాల్సిన రోజులు.. దీంతో పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన తరుణంలో ఎలక్ట్రికల్ వాహనాలు రంగప్రవేశం చేశాయి.
శబ్ద, వాయు కాలుష్యం లేకపోవడంతో పాటు ఒకసారి చార్జ్ చేస్తే సుమారు 60,70 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉండడంతో పట్టణ ప్రజలు ఎలక్ట్రికల్ వాహనాల వినియోగంపై మక్కువ కనబరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో పదుల సంఖ్యలో ఎలక్ట్రికల్ వాహనాల ఏజెన్సీలు ఏర్పాటు కావడంతో ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.