
సాక్షి,న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రెండు రూపాయల మేర తగ్గించింది. నూతన ఎక్సైజ్ డ్యూటీ బుధవారం నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. సెప్టెంబర్‌లో ముడిచమురు ధరలు ఏకంగా 12 శాతం మేర పెరిగాయి.
భారత వినియోగదారులు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పెట్రో ధరలను చెల్లించాల్సి రావడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులూ పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలు తెస్తున్నాయి. ఇక పెట్రో ఉత్పత్తులపై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర దిగిరానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment