‘భీమ్‌’తో రూ.361 కోట్ల లావాదేవీలు | BHIM app users have spent Rs 361 cr so far: Government | Sakshi
Sakshi News home page

‘భీమ్‌’తో రూ.361 కోట్ల లావాదేవీలు

Published Thu, Feb 9 2017 2:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

‘భీమ్‌’తో రూ.361 కోట్ల లావాదేవీలు

‘భీమ్‌’తో రూ.361 కోట్ల లావాదేవీలు

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భీమ్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు రూ.361 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు కేంద్రం బుధవారం లోక్‌సభలో వెల్లడించింది.  
ఉద్యోగుల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించడం లేదా వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీచేయడానికి వీలు కల్పించే వేతనాల చెల్లింపు(సవరణ) బిల్లు–2017కు పార్లమెంట్‌లో ఆమోదం లభించింది.  
వ్యాధులను నయంచేయడంలో పంచగవ్య (ఆవు మూత్రం, పేడ, పాలు, నెయ్యి, పెరుగుతో తయారయ్యే మిశ్రమం) పాత్రను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దిగుబడి నష్టం, తెగుళ్ల దాడులు, ధరల పతనంతో ఆదాయంలో తగ్గుదల నుంచి రైతులను ఆదుకునేందుకు తోట పంటలకు ఆదాయ బీమా పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement