
న్యూఢిల్లీ: ప్రజలు భీమ్ యాప్ లేదా యూపీఐ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేలా ప్రోత్సహించడానికి రైల్వే శాఖ నెలవారీ లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించింది. ఇందులో విజేతలుగా నిలిచే ఐదుగురికి మొత్తం ప్రయాణ చార్జీలను తిరిగి చెల్లిస్తారు. భీమ్ యాప్ లేదా ఠీఠీఠీ.జీటఛ్టిఛి.ఛిౌ.జీn వెబ్‌సైట్‌లో యూపీఐ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ఈ పథకాన్ని గత నెలలో ప్రవేశపెట్టింది. ఇది ఆరు నెలలు అమల్లో ఉంటుంది. ప్రతి నెల మొదటి వారంలో కంప్యూటరైజ్డ్ డ్రా ద్వారా అంతకు ముందు నెలకు సంబంధించిన ఐదుగురు విజేతలను ప్రకటిస్తారు. ప్రయాణికుడు తాను ప్రయాణించిన నెలలోనే ఈ పథకం కింద లక్కీ డ్రాకు అర్హుడు.
Comments
Please login to add a commentAdd a comment