
15 ఏళ్లు దాటితే ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: 15 ఏళ్ల వయస్సు దాటిన వారికి ఆధార్ అప్‌డేట్ తప్పనిసరని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ప్రాంతీయ ప్రధాన ఉపసంచాలకులు ఎంవీఎస్ రామిరెడ్డి తెలిపారు. 15 ఏళ్ల లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారు తిరిగి తమ ఆధార్‌లను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల వయస్సు లోపు ఆధార్ నమోదు చేసుకున్న వారికి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించాలన్నారు.
సామాజిక పెన్షన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకుల పంపిణీ ప్రక్రియను ఆధార్‌తో అనుసంధానం చేసిన కారణంగా బయోమెట్రిక్ సరిపోలక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. వృద్ధుల బయోమెట్రిక్‌కు బదులు ఐరిష్‌ను పరిగణన లోకి తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిం చేందుకు త్వరలో భీమ్ యాప్‌ను లాంఛనంగా ప్రారంభిస్తామని తెలిపారు.