ఉల్లి లొల్లి
నగరంలో భారీ కొరత
మహారాష్ట్ర నుంచి సాధారణ దిగుమతి
సిండికేట్ వ్యాపారంతో చాలని పరిస్థితి
ప్రైవేట్ మార్కెట్‌లో రూ.30పై మాటే
రైతుబజార్లలో లేనేలేవు
విజయవాడ : నగరంలో ఉల్లిపాయల కొరత తారస్థారుుకి చేరింది. విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌లో దిగుమతులు తగ్గడంతో రైతుబజార్లలో ఉల్లి విక్రయూలు కనుమరుగయ్యూరుు. కర్నూలులో పంట ముగిసి మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇక్కడి వ్యాపారులు సిండికేట్ అరుు్య కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధర అమాంతం పెంచేశారు. దీంతో ప్రైవేట్ మార్కెట్‌లో కేజీ రూ.30పైనే అమ్ముతున్నారు. వారంలో కొరత మరింత పెరిగే అవకాశం ఉంది.
సాధారణంగా రోజూ విజయవాడ మార్కెట్‌కు దాదాపు వంద లారీల ఉల్లిపాయలు దిగుమతి అవుతుంటారుు. ఒక్కో లారీలో పది టన్నుల ఉల్లిపాయలు ఉంటాయి. ప్రస్తుతం కర్నూలులో ఉల్లిపాయల పంట ముగియడంతో నగరంలో భారీ కొరత ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర సరుకుపై ఆధార పడాల్సి వస్తోంది. దూరప్రాంతం నుంచి సరుకు దిగుమతి కావటంతో ధర ఒక్కసారిగా పెరిగింది. వారం రోజులుగా విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు 50 లారీల సరుకు మాత్రమే వస్తోంది. ఇందులో 25 లారీలు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, మిగిలిన 25 లారీలు నగర మార్కెట్‌కు తరలిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అరుు్య వీటిని కూడా ప్రజలకు కాకుండా చేస్తున్నారు.
వ్యాపారుల సిండికేట్
మొదట్లో మహారాష్ట్రలోని నాందేడ్, అహ్మద్‌నగర్ నుంచి ఉల్లిపాయలు దిగుమతి అయ్యూరుు. అరుుతే, అక్కడ కూడా వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేలర్స్ సోలాపూర్ ఉల్లిపాయలను తెప్పిస్తున్నారు. ఇంతా కష్టపడి తెప్పించే ఉల్లిపాయలను వ్యాపారులు సిండికేట్‌గా మారి విక్రరుుస్తున్నారు. సాధారణంగా నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా రోజుకు పది లారీల ఉల్లిపాయల విక్రయాలు మాత్రమే జరుగుతుంటాయి. అలాగే, జిల్లాలోని రైతుబజార్లలో 43 టన్నులు, బహిరంగ మార్కెట్‌కు మరో 60 టన్నులు కేటారుుస్తారు.
ఈ నేపథ్యంలో రోజూ మార్కెట్‌కు వచ్చే 25 లారీల ఉల్లిపాయల్లో పది లారీలు పోగా, మిగిలిన వాటిని వ్యాపారులు నిల్వ ఉంచేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఉల్లి కొరత ఏర్పడటంతో నిల్వ ఉన్న వాటిని బయటకు తీసి అధిక ధరలకు విక్రరుుస్తున్నారని తెలిసింది.
రైతుబజార్లలో కనుమరుగు
వారం రోజులుగా నగరంలోని స్వరాజ్యమైదానంతో పాటు జిల్లాలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు నిలిచిపోయూరుు. మెక్కుబడిగా అక్కడక్కడ మాత్రమే విక్రరుుస్తున్నారు. వీటికి మార్కెటింగ్ శాఖ అధికారులు కేజీ రూ.17గా ధర నిర్ణయించారు. అరుుతే, కొరత కారణంగా విజయవాడ మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులే కేజీ రూ.22కు కొంటున్నారు. రిటైల్ వ్యాపారులు రవాణా, ఇతర ఖర్చులు కలుపుకొని రూ.26కు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో రైతుబజార్‌లో మార్కెటింగ్ అధికారులు నిర్ణరుుంచిన రూ.17కు అమ్మడానికి వ్యాపారులు ఇష్టపడట్లేదు. అలా చేస్తే తమకు నష్టమని కొందరు ఉల్లిపాయలు అమ్మడమే మానేశారు. మరికొందరు మాత్రం నాసిరకం సరుకు అమ్ముతున్నారు.
ప్రజల్లో ఆందోళన
ఉల్లిపాయల ధరలు పెరగటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపారులు మాయాజాలం చేసి రేట్లు పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉల్లిపాయలు దొరక్క అవస్థలు పడుతున్నారు. మార్కెటింగ్ అధికారులు జోక్యం చేసుకుని రైతుబజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు.
4.