Wholesale market
-
25 ఎకరాలు.. 318 షాపులు
గీసుకొండ: వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో రాష్ట్రంలోనే మొదటి మెగా గేటెడ్ హోల్‌సేల్ మార్కెట్ రూపుదిద్దుకుంది. ఆదివారం ఈ మార్కెట్ క్లాంప్లెక్స్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుసలుగా నిర్మించిన ఇక్కడి మార్కెట్‌ను చూస్తుంటే తాను అమెరికాలో చూసిన ఓ షాపింగ్ సముదా యం గుర్తుకు వస్తోందన్నారు. స్థానిక గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో 25 ఎకరాల్లో అన్ని వసతులతో 318 షాపుల సముదాయాన్ని నిర్మించారు. నగరంలోని హోల్‌సేల్ ట్రేడర్స్ కమర్షియల్ వెల్ఫేర్ సొసైటీ రూ.300 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వ సహాయం లేకుండా వ్యాపారులే సొంతంగా ఈ మెగా గేటెడ్ మార్కెట్‌ను నిర్మించుకోవడం విశేషం. -
వంట నూనెల ధరలు తగ్గుముఖం... హోల్‌సేల్ మార్కెట్లో రేట్లు ఇలా..
గత ఏడాది కాలంగా సలసల మండిపోతున్న వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం సుంకాలు తగ్గించడంతో హోల్‌సేల్ మార్కెట్లో వివిధ రకాల వంటనూనెల ధరలు కొద్ది మేరకు తగ్గాయి. ఈ మేరకు వివిధ నూనెలకు సంబంధించి ధరల తగ్గింపు వివరాలను కేంద్రం వెల్లడించింది. హోల్‌సేల్ మార్కెట్లో వివిధ వంట నూనెల ధరల తగ్గింపు వివరాలు ఇలా ఉన్నాయి.. - హోల్‌సేల్ మార్కెట్లో పామ్ ఆయిల్ ధరలు 2.5 శాతం తగ్గాయి. గత వారం టన్ను పామాయిల్ ధర రూ. 12,666 ఉండగా ప్రస్తుతం రూ. 12,349కి చేరుకుంది. - సీసమ్ ఆయిల్ 2.08 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 23,500లకు చేరుకుంది - కొబ్బరి నూనె ధరలు 1.72 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 17,100లుగా ఉంది - సన్‌ఫ్లవర్ నూనె ధరలు 1.30 శాతం తగ్గి టన్ను ధర రూ. 15,965లకు చేరుకుంది. అంతకు ముందు ఈ ధర రూ.16,176 - పల్లి నూనె ధరలు 1.28 శాతం తగ్గి హోల్ సేల్ మార్కెట్లో టన్ను నూనె ధర 16,839గా ట్రేడ్ అవుతోంది - వనస్పతి నూనె ధరలు 1 శాతం తగ్గి రూ. 12,508కి చేరుకుంది. - ఆవాల నూనె ధరలు సైతం 1 శాతం తగ్గి టన్ను ఆయిల్ ధర రూ. 16,573 వద్ద ట్రేడవుతోంది. గతేడాది కంటే.. వంట నూనె ధరల్లో తగ్గుదల నమోదైనా గతేడాది ఇదే సమయానికి నమోదైన ధరలతో పోల్చితే ఇంకా అధికంగానే ఉన్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గిపోవడంతో నూనె ధరల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలంటూ వ్యాపారులను కేంద్రం ఆదేశించింది. చదవండి : వంట నూనె : పదకొండేళ్ల తర్వాత.. -
వూహాన్ మార్కెట్లో డబ్ల్యూహెచ్ఓ బృందం
బీజింగ్/వూహాన్: కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం ఆదివారం చైనాలోని వూహాన్లో ఉన్న హూనన్ సీఫుడ్ మార్కెట్‌ను పటిష్టమైన భద్రత మధ్య సందర్శించింది. 2019లో కరోనా వైరస్ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు/పాంగోలిన్స్ నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న వాదన ఉంది. అయితే, దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు. తాము ఈరోజు ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శించామని నిపుణుల బృందం తెలియజేసింది. కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు పేర్కొంది. 2019 డిసెంబర్లో వూహాన్లో కరోనా కేసులు బయటపడిన తర్వాత ఈ మార్కెట్‌ను మూసివేసి, శుభ్రం చేశారు. -
ఉల్లి రైతు 'ధర'హాసం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అధిక వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేల్ మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. ముఖ్యంగా నాణ్యమైన ఉల్లికి గిరాకీ మరింత పెరిగింది. సోమ, మంగళవారాల్లో కర్నూలు మార్కెట్లో నాణ్యమైన ఉల్లికి క్వింటాలుకు రూ.3,830 ధర పలికింది. తాడేపల్లిగూడెంలోనూ ఇదే పరిస్థితి. రెండు మార్కెట్లలోనూ సగటు ధర రూ.2,000 వరకు ఉంది. ఈ ధర రూ.1,100 స్థాయి నుంచి రూ.2,000కు పెరగడంతో.. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్, రబీల్లో 40 వేల హెక్టార్ల వరకు ఉల్లి సాగవుతోంది. ఒక్క కర్నూలులోనే 32 వేల హెక్టార్లలో ఉల్లి సాగవుతోంది. సాగుకు పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటే ఖరీఫ్‌లో ఎకరాకు 6 నుంచి 8 టన్నులు, రబీలో 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా. అయితే ఆగస్టు నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో.. ఎకరాకు రెండు నుంచి 3 టన్నుల వరకు దిగుబడి తగ్గిందని చెబుతున్నారు. గతేడాది మాదిరే సాగు విస్తీర్ణంలో పెద్దగా వ్యత్యాసం లేకపోయినా దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. రిటైల్ మార్కెట్లో నాణ్యమైన ఉల్లి కిలో రూ.45 నుంచి రూ.50 దాకా పలుకుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతినడంతో అక్కడినుంచి దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రంలోని ఉల్లికి «అధిక ధర లభిస్తోంది. కాగా గతేడాది బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగి వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడడం తెలిసిందే. అటువంటి పరిస్థితులు ఈ ఏడాది తలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ కారణంగా ఉల్లి ధర కిలో ఇప్పటికి రిటైల్ మార్కెట్లో రూ.50లోపే ఉంది. ఎగుమతులపై నిషేధం విధించకపోయుంటే ఇప్పటికే కిలో రూ.100 పలికేదని అధికారులు చెబుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పడితే డిసెంబర్లో కొత్త పంట మార్కెట్‌కు వచ్చి ధర తగ్గుతుందని, వర్షాలు ఇలానే కొనసాగితే ధర మరింత పెరిగే అవకాశం లేకపోలేదని వారంటున్నారు. -
హోల్‌సేల్ మార్కెట్ కుదేలు
న్యూఢిల్లీ: దేశం మొత్తం లాక్డౌన్లో ఉండడం, కొన్ని ఆహార ఉత్పత్తులు మినహా దాదాపు అన్ని విభాగాల్లో అసలు వినియోగ డిమాండ్ లేకపోవడం వంటి అంశాలతో మేలో హోల్‌సేల్ మార్కెట్ క్షీణతలోకి జారింది. ఇందుకు సంబంధించిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్ 3.21% క్షీణించింది (2019 మే నెలలో ఈ బాస్కెట్ ధర మొత్తంతో పోల్చి). దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటారు. వ్యవస్థలో అసలు వినియోగ డిమాండ్‌లేని పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. నాలుగున్నర సంవత్సరాల్లో ఇలాంటి స్థితి ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ నెలకొనలేదు. సూచీలోని మూడు ప్రధాన విభాగాలకు సంబంధించి వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే.. ► ప్రైమరీ ఆర్టికల్స్: ఆహార, ఆహారేతర విభాగాలతో కూడిన ఈ సెక్టార్లో –2.92 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అయితే ఇందులో 1.13% ఆహార ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఆహారేతర విభాగం విషయంలో మా త్రం మైనస్ 3.53% ప్రతి ద్రవ్యోల్బణం ఉంది. ► ఫ్యూయెల్ అండ్ పవర్: ఈ విభాగంలో ఏకంగా ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 19.83%గా ఉంది. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న ఈ తయారీ రంగంలో మైనస్ 0.42 శాతం ప్రతి ద్రవ్యోల్బణం నమోదయ్యింది. ఒక్క ఆహార ఉత్పత్తులను చూస్తే... మొత్తం సూచీలో 1.13% ద్రవ్యోల్బణం నమోదయితే, పప్పు దినుసుల ధరలు 11.91% (2019 మేతో పోల్చి) ఎగశాయి. ఆలూ ధరలు 52.25 శాతం ఎగశాయి. అయితే కూరగాయలు మొత్తంగా ధరల రేటు మైనస్12.48% తగ్గింది. -
చికెన్ ముక్క.. రోగం పక్కా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంచిన నాసిరకం కోడి మాంసం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. ఆగస్టు 26వ తేదీన నెల్లూరులోని చికెన్ స్టాళ్లను ప్రజారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేయగా.. దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోడి లివర్, కందనకాయ, కోడి వెనుక భాగం, కాళ్ల భాగాలను పూర్తిగా తినడానికి వినియోగించరు. కొన్నేళ్ల క్రితం వరకు వాటిని డంపింగ్ యార్డుకు తరలించేవారు. ఇప్పుడు ఆయా భాగాలను పొరుగు రాష్ట్రాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి తొలుత చెన్నై హోల్‌సేల్ మార్కెట్‌కు, అక్కడి నుంచి మినీ ఆటోల ద్వారా నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు పనికిరాని కోడి మాంసాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చెన్నై మార్కెట్లో కిలో రూ.50కి కొనుగోలు చేసి, ఏపీలోని పలు ప్రాంతాల్లో రూ.120 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కోయంబత్తూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేరేసరికి కనీసం మూడు రోజుల సమయం పడుతుండటంతో చికెన్ పాడైపోతోంది. దానిని స్థానిక వ్యాపారులు ఇక్కడ సిద్ధం చేసిన చికెన్‌లో కలిపి వినియోగదారులకు అంట గడుతున్నారు. నెల్లూరు నగరంలో మూడు చికెన్ స్టాళ్లు ఈ అక్రమ దందాకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి ఏపీకి నిత్యం 8 టన్నుల దాకా నాసిరకం చికెన్ వస్తున్నట్లు సమాచారం. ఇలాంటి చికెన్‌ను ప్రధానంగా బార్లు, రెస్టారెంట్లు, రోడ్ల వెంబడి ఉండే చికెన్ పకోడి బండ్లకు, ధాబాలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలాగటం ఆడుతున్నారు. వాస్తవానికి కోడిని కోసిన తర్వాత మూడు గంటలు దాటితే ఆ మాంసంలో ఎలాంటి పోషక విలువలు ఉండవు. అలాంటి చికెన్ తింటే రోగాలు తప్పవు. 24 గంటల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసి చికెన్ తిన్నా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందుకే వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. -
టమాటా ధర పైపైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ టమాటా రూ.35 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.8కే లభించిన టమాటా ఇప్పుడు రైతుబజార్లోనే రూ.30కి చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.20 పలికిన టమాటా శుక్రవారం బహిరంగ మార్కెట్లో రూ.32–35ల చొప్పున అమ్మారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చేరడం, ఏపీలోని మదనపల్లి ద్వారా దిగుమతులు తగ్గడం, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అరకొర సరఫరా అవుతుండటంతో ఆ ప్రభావం ధరలపై పడుతోంది. తగ్గిన సరఫరా.. రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలోని వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో లక్ష ఎకరాల్లో టమాటా సాగు జరుగుతున్నా 15 శాతం అవసరాలనే తీరుస్తున్నాయి. దీంతో దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్ర మార్కెట్‌కు రోజూ 400 టన్నుల మేర దిగుమతి అవుతోంది. స్థానికంగా 50 టన్నులు వస్తుండగా, మిగతా 350 టన్నుల మేర పొరుగు రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతోంది. ఎక్కువగా చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతోంది. అయితే ప్రస్తుత సీజన్లో అక్కడ సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఏపీ అధికారుల లెక్కల ప్రకారం ఒక్క మదనపల్లి మండల పరిధిలోనే గతేడాది 1,970 హెక్టార్లలో ఉన్న సాగు ఈ ఏడాది 502 హెక్టార్లకు పడిపోయింది. నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల పరిధిలోనూ సగానికి విస్తీర్ణం తగ్గింది. దీనికి తోడు చలి తీవ్రత కారణంగా మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో బూడిద తెగులు సోకడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో మదనపల్లిలోనే టమాటాకు మంచి రేటు లభిస్తోంది. అక్కడే కిలో రూ.30 పలుకుతోంది. దీంతో రాష్ట్రానికి దిగుమతి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని కోలార్, చింతమణి ప్రాంతాల నుంచి టమాటా రాష్ట్రానికి వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగు మతి చేసుకుంటుండటంతో.. డిమాండ్ పెరిగి, తెలంగాణకు టమాటా సరఫరా తగ్గిపోయింది. నిన్న మొన్నటి వరకు బోయిన్పల్లి మార్కెట్‌కే 2,500 క్విం టాళ్ల మేర టమాటా సరఫరా కాగా, శుక్రవారం 1,380 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. గత వారం హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.5 నుంచి రూ.6 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.30 వరకు పలుకుతోంది. దీన్ని మార్కెట్లో వ్యాపారులు రూ.2 నుంచి రూ.5 వరకు కలిపి రూ.35 వరకు అమ్ముతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మున్ముందు ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గతేడాది ఇదే రోజున టమాటా కిలో ధర 6 రూపాయలు పలికింది. మిగతా కూరగాయల్లోనూ అంతే చీక్యాప్సికం, వంకాయ, కాకర, బెండ, దొండ ధరల్లోనూ పెరుగుదల ఉంది. వీటి ధర రెండింతల మేర పెరిగింది. క్యాప్సికం ధర ప్రస్తుతం కిలో రూ.35 నుంచి రూ.40 మధ్య పలుకుతోంది. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ నుంచి దిగుమతులు తగ్గాయి. అనంతపురం నుంచి ఎక్కువగా దిగుమతి అయ్యే వంకాయకు డిమాండ్ పెరగడంతో దీని ధర కిలో రూ.40కి చేరింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.30 నుంచి రూ.45కి చేరింది. బెండ రూ.40, దొండ రూ.35కి చేరింది. -
భారత మార్కెట్లోకి థాయ్ రిటైల్ సంస్థ
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌కి చెందిన రిటైలింగ్ సంస్థ సియామ్ మాక్రో పీసీఎల్... తాజాగా భారత హోల్‌సేల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చే అయిదేళ్లలో భారత క్యాష్ అండ్ క్యారీ విభాగంలో రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సిరిపోర్ణ్ డెక్‌సింఘా తెలిపారు. లాట్స్ హోల్‌సేల్ సొల్యూషన్స్ పేరిట ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారామె.ఈ ఏడాది ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో తొలుత రెండు స్టోర్లు ఏర్పాటు చేస్తామని, ప్రధానంగా ఉత్తరాదిపై దృష్టి సారించి వచ్చే మూడేళ్లలో 15 హోల్‌సేల్ స్టోర్లను ఏర్పాటు చేస్తామని డెక్ సింఘా తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆమె తెలియజేశారు. భారత మార్కెట్ తమకు చాలా కీలకమన్నారు. 50 బిలియన్ డాలర్ల భారీ దిగ్గజం కెరోయిన్ పాక్ ఫండ్ (సీపీ) గ్రూప్‌లో సియామ్ మాక్రో పీసీఎల్ భాగంగా ఉంది. 100% ఆటోమేటిక్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంలో సియామ్ మాక్రో భారత్‌లో ఇన్వెస్ట్ చేస్తోం ది. థాయ్‌లాండ్‌తో పాటు కంబోడియాలో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. బ్యాంకాక్ కేంద్రంగా పనిచేస్తున్న సీపీ గ్రూప్‌నకు అగ్రి బిజినెస్, టెలికం, ప్లాస్టిక్స్, ఆటోమోటివ్, ఫార్మాస్యూటికల్ తదితర వ్యాపారాలు కూడా ఉన్నాయి. తమ స్టోర్స్ కోసం ప్రధానంగా స్థానిక మార్కెట్ల నుంచే సోర్సింగ్ (కొనుగోళ్లు) జరపనున్నట్లు లాట్స్ హోల్‌సేల్ సొల్యూషన్స్ ఎండీ తనిత్ చెరవనంత్ తెలిపారు. కిరాణా షాపులు, వ్యాపార సంస్థల కోసం ఆన్లైన్లో కూడ విక్రయించనున్న ట్లు, షాపు దగ్గరికే డెలివరీ సర్వీసులు కూడా అం దించనున్నట్లు చెప్పారు. కిరాణా షాపులకు రుణ సదుపాయంతో ఉత్పత్తులు అందించేలా ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. -
పప్పులు ఉడకవు
► చుక్కల్లో పప్పు దినుసుల ధరలు కంది పప్పు కిలో రూ.150 ► పల్లి నూనె లీటర్ రూ.110 ► అదే బాటలో ఇతర పప్పుదినుసులు, వంట నూనె ఆసిఫాబాద్ : ఇక ఇంట్లో పప్పులూ ఉడకని పరిస్థితి నెలకొంది. పప్పు దినుసుల ధరలు చుక్కలనంటడమే అందుకు కారణం. జిల్లాలో పక్షం రోజుల్లోనే హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ధరలు పెరిగాయి. వారం రోజుల క్రితం హోల్‌సేల్ మార్కెట్లో క్వింటాల్ కందిపప్పు రూ.13,500 ఉండగా, పెరిగిన ధరలతో ప్రస్తుతం రూ.14,500కు చేరింది. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో కంది పప్పు రూ.150కి విక్రయిస్తున్నారు. యేటా కందుల సీజన్ ప్రారంభంలో కంది పప్పు ధర తగ్గేది. ఈ యేడాది ప్రారంభంలో కొంత తగ్గినా, నెలరోజుల్లోనే పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. కిలో మినపప్పు రూ.145 ఉండగా.. రూ.165, శనగపప్పు రూ.53 ఉండగా.. రూ.66కు పెరిగాయి. దీంతోపాటు మార్కెట్లో పల్లి నూనె సైతం లీటర్‌కు రూ.20 పెరిగింది. వారం రోజుల క్రితం లీటర్ పల్లి నూనె రూ.90 ఉండగా.. పెరిగిన ధరలతో రూ.110కి చేరింది. పామాయిల్ సైతం లీటర్‌కు రూ.10 పెరిగింది. పెరుగుతున్న పప్పుల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో పప్పు దినుసుల సాగు ఏటేటా తగ్గడంతోనే పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారుు. వరి, పప్పుదినుసులకు మద్దతు ధర లభించకపోవడంతో గత పదేళ్లుగా రైతులు పత్తి సాగుపై మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర కేవలం పత్తికి మాత్రమే అమలవుతుండగా, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరలతో రైతులకు ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు పత్తి పంటవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ యేడాది ఖరీఫ్‌లో జిల్లాలో 5.40 వేల హెక్టార్లలో పత్తి, 92 వేల హెక్టార్లలో సోయా, 45 వేల హెక్టార్లలో కంది, 60 వేల హెక్టార్లలో వరి, 15 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ప్రతి యేటా జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గుతోంది. వర్షాభావంతో సాగు ఖర్చులు పెరగడంతోపాటు దిగుబడి తగ్గడంతో పప్పు దినుసుల కొరత ఏర్పడింది. దీంతో ప్రతి యేటా పప్పు దినుసులు ఇత ర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పెరిగిన నిత్యావసర వస్తువులు,పప్పుదినుసుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భార మయ్యాయి. ప్రభుత్వం పప్పుల ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు -
రైతు బజార్లలో ఉల్లి విక్రయాలు
మార్కెటింగ్‌శాఖకు మంత్రి హరీశ్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధరలు గణనీయంగా తగ్గడంతో వినియోగదారులు, రైతులకు ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రైతు బజార్లలో రైతులే నేరుగా ఉల్లిని విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర సగటున రూ. 20 ఉండగా హోల్‌సేల్ మార్కెట్లో రైతులకు కిలో రూ. 8కు మించి రేటు దక్కడం లేదు. రైతు బజార్లలో కిలోకు రూ. 11కు తక్కువ కాకుండా రైతులు ఉల్లిని అమ్ముకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఉల్లి విక్రయాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు సాగు అధికంగా ఉన్న మండలాల్లో మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు పర్యటిస్తారు. -
కందిపప్పు డబుల్ సెంచరీ!
దసరా వేళ.. ఘుమఘుమలు లేనట్టే! సామాన్యుడు దసరా పూట గారె ముక్కకు సైతం నోచుకోలేక పోతున్నాడు. కనీసం బూరె తినే పరిస్థితి లేకుండా పోయింది. చుక్కలనంటుతున్న పప్పుల ధరలను చూస్తుంటే.. గారె, బూరెలే కాదు.. పండుగ పూట ఏ ఒక్క పిండివంట కూడా వండు కోలేని దుస్థితిలో సామాన్య, మధ్యతరగతి ్రపజలు అల్లాడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు ఉల్లిధరలు కంటనీరు తెప్పిస్తే.. ఇప్పుడు పప్పులు.. వంట నూనెల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.చరిత్రలో ముందెన్నడూ లేనీ స్థాయిలో కందిపప్పు ధర ఏకంగా డబుల్ సెంచరీ దాటింది. ప్రస్తుతం మార్కెట్లో నాసిరకం పప్పు రూ.180లుంటే..నాణ్యమైన పప్పు ఏకంగా 210కి చేరింది. గతేడాది ఇదే సమయానికి కిలోకందిపప్పు రూ.80లు పలికింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్ లోనే 50 కేజీల కందిపప్పు బస్తా రూ.10వేలు పలుకుతోంది. దీంతో ప్రస్తుతం ఏకంగా రెండున్నర రెట్లు పెరగడం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక మినపప్పు అయితే ఏకంగా రూ.190 పలుకుతుంది. గతేడాది ఇదే సీజన్లో మినపప్పు రూ.70ల లోపే ఉండేది. కానీ ప్రస్తుతం కందిపప్పు ధర సరసన చేరేందుకు మినపప్పు కూడా ఉరకలేస్తోంది. దీంతో బూరెలు కాదు కదా..కనీసం ఉదయం అల్పాహారంగాతీసుకునే ఇడ్లీముక్కకూడా తినే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఆయిల్ ధరలు కూడా ఏమాత్రం తీసిపోని రీతిలో ఎగబాకు తున్నాయి. నిన్నమొన్నటివరకు లీటర్ రూ.70 ఉన్న సన్ ఫ్లవర్ ఆయిల్ నాలుగైదు రోజుల్లోనే రూ.85కు చేరింది. జీతాలపై ఆధారపడి జీవనం సాగించే ఈ బడ్జెట్ బతుకులు రోజురోజుకు చుక్కలనంటుతున్న పప్పుల ధరలతో బిత్తరపోతున్నారు. వ్యాపారులు సైతం పప్పుల ధర చెప్పేందుకు భయపడుతున్నారు. నాగ్‌పూర్ పప్పు మార్కెట్లో కానరావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట తొమ్మిది సరుకులను ప్రభూత్వం అందజేసింది. రంజాన్పురస్కరించుకుని ముస్లిం సోదరులకు చంద్రన్న రంజాన్ తోపా అందజేశారు. కానీ హిందువులకు రెండో పెద్దపండుగగా భావించే దసరా పండుగ రోజుల్లో ఎలాంటి కానుకలను ప్రభుత్వం ప్రకటించలేదు. పైగా కనీసం డిపోల ద్వారా పంపిణీ చేసే కందిపప్పు సరఫరా కూడా పునరుద్ధరిస్తానుకుంటే అదీలేదు. దీంతోఈ ఏడాది దసరా పర్వదినాన సామాన్య, మధ్యతరగతి ఇళ్లల్లో ఘుమఘుమలు లేనట్టే. -
స్వల్పంగా తగ్గిన ఉల్లి ధర
* హోల్‌సేల్ మార్కెట్లో ధరలు తగ్గుముఖం * రూ.7.25 కోట్లతో సబ్సిడీ ఉల్లి సేకరణ సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ ఎగబాకి చుక్కలను తాకిన ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో ప్రధాన మార్కెట్ అయిన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో శనివారం కిలో గరిష్టంగా రూ. 67 పలికిన ఉల్లి ధర మంగళవారం రూ. 60కి తగ్గింది. కర్నూలు, కర్ణాటక ఉల్లి రకాలు రెండు రోజుల వ్యవధిలోనే కిలోకు రూ. 10 చొప్పున తగ్గినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ లాసల్గావ్ (మహారాష్ట్ర) నుంచి రాష్ట్రానికి ఉల్లి దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఉత్తర భారతదేశంలో ఉల్లికి డిమాండ్ పెరగడంతో మహారాష్ట్ర రైతులు, వ్యాపారులు అటువైపు దృష్టి సారించారు. గతంలో రోజుకు మహారాష్ట్ర నుంచి 5వేలకు పైగా ఉల్లి బస్తాలు రాగా, ప్రస్తుతం రెండు వేల బస్తాలకు మించి రావడం లేదు. ఇదే సమయంలో కర్ణాటక, కర్నూలు నుంచి ఉల్లి నిల్వలు పెద్దమొత్తంలో రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్లో ధరలు కిలోకు రూ. 10 మేర తగ్గడంతో రైతులు అమ్మకాలపై వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నా రు. మార్కెట్‌కు సరుకు చేరుకున్నా లావాదేవీలు ఆశించిన స్థాయిలో లేవని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలకు ఉల్లి ఎగుమతి ధరలు భారీ గా పెంచడం, విదేశాల నుంచి 10 వేల టన్నుల ఉల్లి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించడం, నల్లబజారుకు తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం, సబ్సిడీ ధరలపై విక్రయాలు వంటి కారణాలతో ఉల్లి హోల్‌సేల్ మార్కెట్లలో పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటే.. ధరలు అదుపులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 88 సబ్సిడీ విక్రయ కేంద్రాలకు సరఫరా చేసేందుకు రూ. 7.25 కోట్లతో 1737.29 టన్నుల ఉల్లిని సేకరించింది. విక్రయాల ద్వారా తిరిగి రూ. 3.47 కోట్లు వచ్చినట్లు మార్కెటింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. -
ఉల్లి వెక్కిరిస్తోంది
♦ మార్కెట్లో తగ్గిపోతున్న నిల్వలు ♦ అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి సాక్షి, ముంబై : నగరంలో ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలులు వీయడంతో ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పంట దిగుబడి తగ్గింది. ఫలితంగా జూన్‌లో అదుపులో ఉన్న ధరలు జూలైలో పెరగడం ప్రారంభమైంది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)కి ముంబై ప్రజలకు కోసం ప్రతి రోజు 125 ట్రక్కుల ఉల్లి వస్తుండగా ప్రస్తుతం వంద వరకు మాత్రమే వస్తున్నాయి. దీంతో నగరంలో ఉల్లి కొరత ఏర్పడింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ. 35-37 పలుకుతన్న ఉల్లి కొనుగోలుదారుల చెంతుకు వచ్చేసరికి రూ. 50 అవుతోంది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ధర రూ. 90-100కి పెరగడం ఖాయమని వ్యాపారులు చెబుతున్నా రు. మరోవైపు దా దర్, వాషి ఏపీఎంసీ మార్కెట్లలో వ్యాపారులు నాసిరకం ఉల్లిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో నాసిక్ జిల్లాలోని నిఫాడ్, లాసల్గావ్ ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా పండుతుంది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలకు కూడా రైళ్లలో ఎగుమతి అవుతుంది. అయితే ప్రస్తుతం రైతుల వద్ద నిల్వలు అయిపోవడం, అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గడం వల్ల ఉల్లికోసం ఇతర రాష్ట్రాలపై ఆదారపడాల్సిన పరిస్థితి వచ్చింది. -
ఉల్లి.. ధర పేలి
తాడేపల్లిగూడెం : వంటింట్లో మరోసారి ఉల్లి బాంబు పేలుతోంది. డిమాండ్‌కు తగినట్టుగా సరఫరా లేకపోవడంతో శుక్రవారం ఒక్కసారిగా ధరలు పెరిగాయి. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం క్వింటాల్ రూ.2,300 పలికిన ఉల్లి ధర శుక్రవారం అమాంతం రూ.3,300కు ఎగబాకింది. గుత్త మార్కెట్లోనే కిలోకు రూ.10 పెరగటంతో వ్యాపారులు ఠారెత్తిపోయారు. ఒకేసారి కిలోకు రూ.10 పెరగటం గడచిన పదేళ్లలో ఎప్పుడూ లేదు. రిటైల్ మార్కెట్లో నాణ్యత గల ఉల్లిపాయల ధర కిలో రూ.40 దాటింది. ఒక్కసారిగా ధర పెరగడంతో చిల్లర బేరం తగ్గిం ది. శుక్రవారం తాడేపల్లిగూడెం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి రెండు లారీలు, కర్నూలు నుంచి 15 లారీల ఉల్లిపాయలు మాత్రమే వచ్చాయి. సాధారణంగా ఈ సీజన్లో కర్నూలు నుంచి 200-300 లారీల ఉల్లిపాయలు వచ్చేవి. అనూహ్యంగా దిగుమతులు తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నా యని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉల్లి అవసరాలను తీర్చే మహా రాష్ట్ర మార్కెట్ నుంచి సరఫరా తగ్గిపోయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడి ఉల్లి పంటకు వైరస్ సోకింది. మరోవైపు రైతులు గోదాములలో నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్లకు తీసుకురావడం లేదు. నాఫెడ్‌తో ఒప్పం దం చేసుకున్న కొన్ని కంపెనీలు ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెలలో ఉల్లి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నాసిరకం ఉల్లికి డిమాండ్ కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కర్నూలు ఉల్లి సాధారణంగా క్వింటాల్ రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం వీటిధర క్వింటాల్ రూ.2,700కు చేరుకుంది. -
ధరదడలు
- వంట నూనెలకు డాలర్ సెగ - పప్పులకు పన్నుల పొగ తాడేపల్లిగూడెం : నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వంట నూనెలకు డాలర్ సెగ తగిలింది. పన్ను విధింపుతో పప్పుల ధరలకు రెక్కలొచ్చాయి. హోల్‌సేల్ మార్కెట్లో 10 కిలోల సన్‌ఫ్లవర్ నూనె ధర రూ.660 ఉండగా, డాలర్ దెబ్బతో రూ.745కు చేరుకుంది. పామాయిల్ ధర 10 కిలోలు రూ.510 నుంచి రూ.525కు చేరుకుంది. కాటన్ సీడ్ ఆయిల్ ధర పరుగు పెడుతోంది. కొత్త పంట దెబ్బతినడంతో మార్కెట్లో వేరుశనగ నూనె ధరలకు రెక్కలు వచ్చాయి. 10 కిలోల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.590నుంచి రూ.630కి పెరిగింది. పచ్చళ్ల సీజన్ మొదలు కాగా, కర్నూలు, తాడిపత్రి, ఆదోని ప్రాంతాల నుంచి అవసరమైన స్థాయిలో వేరుశనగ నూనె రావడం లేదు. వచ్చిన నూనెలో నాణ్యత పడిపోయింది. ఈ నూనె ధర 10 కిలోలు రూ.970కి చేరుకుంది. రైస్‌బ్రాన్ ఆయిల్ మాత్రం 10 కిలోలు రూ.610 వద్ద స్థిరంగా ఉంది. హోల్‌సేల్ మార్కెట్లో ఈ ధరలు పలుకుతుండగా, వీటికి రవాణా ఖర్చులు, వ్యాపారుల లాభం శాతాన్ని కలుపుకుని స్థానిక పరిస్థితుల ఆధారంగా రిటైల్ మార్కెట్లో ఈ ధరలు మరింత ఎక్కువగానే ఉన్నాయి. ఒక్కసారిగా నూనెల ధరలు పెరగడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పన్నుల పొగ పప్పుల ధరలకు పన్నులు పొగ పెడుతున్నాయి. నిత్యం సామాన్యులు ఉపయోగించే కందిపప్పు ధర చుక్కలను చూపిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలోకు రూ.15 పెరిగింది. కందిపప్పు ఇక్కడి మార్కెట్లకు ఎక్కువగా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వస్తోంది. ఇప్పటివరకూ జీరో శాతం ట్యాక్స్‌తో పప్పులు ఇక్కడకు మార్కెట్లకు వచ్చేవి. ఇప్పుడు పన్నులు విధించడంతో ఆ భారం ధరలపై పడింది. దీంతో రిటైల్ మార్కెట్లలో కందిపప్పు ధర ఒక్కసారిగా పెరిగింది. గతంలో గుత్త మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.90 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.105కు చేరుకుంది. రిటైల్‌గా మార్కెట్లో కిలో రూ.120కు విక్రయిస్తున్నారు. మినపప్పు కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలో రూ.70 నుంచి రూ.75 రూపాయలకు గుత్త మార్కెట్లో దొరికే మినపప్పు రూ.92కు చేరుకుంది. శనగపప్పు మాత్రం గుత్త మార్కెట్లో కిలో రూ.65 వద్ద స్థిరంగా ఉంది. -
సుగర్స్‌కు చేదు
ఘోరంగా పడిపోయిన పంచదార ధర క్వింటా రూ.2600లు సంక్రాంతి నెలలోనూ పెరగని ధర,అమ్మకాలు నష్టాల్లో చక్కెర మిల్లులు మార్కెట్లో పంచదార ధరలు ఘోరంగా పడిపోవడంతో సహకార చక్కెర మిల్లుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉత్పత్తి వ్యయం కంటే క్వింటా పంచదార ధర తక్కువగా ఉండటంతో నష్టాల బాట పడుతున్నాయి. ఈ వారంలో ధర మరీ ఘోరంగా క్వింటా రూ.2600లకు పడిపోయింది. సంక్రాంతి నెలలో అమ్మకాలు పెరిగి ధర బాగుంటుందని ఆశించిన యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. ఫ్యాక్టరీల్లో పేరుకుపోయిన నిల్వలను ఎలా అమ్ముకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నాయి. చోడవరం: హోల్‌సేల్ మార్కెట్లో పంచదార ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నా యి. ఆరు నెలల కిం దట క్వింటా పంచదార రూ. 3100లు ఉండేది. ఒక దశ లో రూ.2900వద్ద రెండు నెల లపాటు నిలకడగా ఉన్నప్పటికీ, సుగర్స్‌కు చేదు అనంతరం రూ.2700లు, ప్రస్తుతం 2600కు పడిపోయింది. దీనికి తోడు ఇతర రాష్ట్రాల్లో లేని వ్యాట్ రాష్ర్టంలో ఉండటంతో అదనంగా క్వింటాకు రూ.150వరకు చెల్లించాల్సి రావడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు ఇక్కడి పంచదారను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఇక్కడి హోల్‌సేల్ వ్యాపారులు నిర్ణయించిన ధరకే సుగర్స్ యాజమాన్యాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా ఏటేటా పంచదార తయారీ వ్యయం పెరుగుతోంది. పంటకు మద్దతు ధర లేదని రైతులూ గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది కేంద్రప్రభుత్వం టన్నుకు రూ.2280గా మద్దతు ధరను నిర్ణయించింది. దానికి అదనంగా రూ.60 నుంచి రూ.80లు కలిపి చెల్లించేందుకు ఫ్యాక్టరీలు నిర్ణయించాయి. ఇప్పటికే ఏటికొప్పాక రూ.2356లు, తాండవ రూ.2350లుగా మద్దతు ధరను ప్రకటించాయి. పూర్తిగా నష్టాల్లో ఉన్న తుమ్మపాలతోపాటు లాభాల్లో ఉన్న గోవాడ ఫ్యాక్టరీ కూడా మద్దతు ధరను ప్రకటించలేదు. ఏది ఏమైనా కేంద్రం నిర్దేశించిన ధరకు తగ్గకుండానే రైతులకు చెల్లించాల్సి ఉంది. మద్దతు ధరతోపాటు అదనంగా రూ.100 నుంచి రూ.150వరకు ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇవ్వాలి. అన్నీ కపులుకుంటే క్వింటా పంచదార తయారీకి కనీసం రూ.3వేల నుంచి 3100 వర కు ఖర్చవుతోంది. రైతుకిచ్చే మద్దతు ధరతోపాటు ఉత్పత్తి ఖర్చు క్వింటాకు రూ. 600-700వరకు అదనంగా ఉంటోంది. మార్కెట్లో ప్రస్తుతం ధర కేవలం రూ.2600లు మాత్రమే ఉండటంతో అదనంగా రూ.500 వరకు ఫ్యాక్టరీలు భరించాల్సి వస్తున్నది. అసలే హుద్‌హుద్ ధాటికి తీవ్రంగా నష్టపోయిన మిల్లులకు ఇది పెనుభారమవుతోంది. ఏటా మంచి రికవరీతో ముందుండే ఏటికొప్పాక ఫ్యాక్టరీలో ఇటీవల అగ్నిప్రమాదంతో అది కూడా నష్టాలబారిన పడింది. ఇప్పటికీ మిల్లుల్లో పాత పంచదార పేరుకుపోయి ఉంది. గోవాడ ఫ్యాక్టరీలో లక్షా90వేల క్వింటాళ్లు, ఏటికొప్పాకలో 60, తాండవలో 50క్వింటాళ్లు నిల్వలున్నాయి. దీనికి ఈ సీజన్లో ఉత్పత్తయిన కొత్త పంచదార కూడా తోడవుతోంది. ఈ నిల్వలను ఎలా అమ్ముకోవాలో తెలియక యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలను అధ్యయనం చేసి వెళ్లిన కమిటీ రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏమీ స్పందించలేదు. వ్యాట్‌ను ఎత్తేయడంతోపాటు తుఫాన్ నష్టపరిహారంగా ప్రభుత్వం ఎంతో కొంత ఇస్తే తప్పా సహకార చక్కెర మిల్లుల మనుగడ ప్రశ్నార్థకంలో పడే ప్రమాదముందని పాలకవర్గాలు, యాజమాన్యాలు, రైతులు అంటున్నారు. ఫ్యాక్టరీలను పరిరక్షించి చెరకు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. -
ఉల్లి లొల్లి
నగరంలో భారీ కొరత మహారాష్ట్ర నుంచి సాధారణ దిగుమతి సిండికేట్ వ్యాపారంతో చాలని పరిస్థితి ప్రైవేట్ మార్కెట్లో రూ.30పై మాటే రైతుబజార్లలో లేనేలేవు విజయవాడ : నగరంలో ఉల్లిపాయల కొరత తారస్థారుుకి చేరింది. విజయవాడ హోల్‌సేల్ మార్కెట్లో దిగుమతులు తగ్గడంతో రైతుబజార్లలో ఉల్లి విక్రయూలు కనుమరుగయ్యూరుు. కర్నూలులో పంట ముగిసి మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నా.. ఇక్కడి వ్యాపారులు సిండికేట్ అరుు్య కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ధర అమాంతం పెంచేశారు. దీంతో ప్రైవేట్ మార్కెట్లో కేజీ రూ.30పైనే అమ్ముతున్నారు. వారంలో కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా రోజూ విజయవాడ మార్కెట్‌కు దాదాపు వంద లారీల ఉల్లిపాయలు దిగుమతి అవుతుంటారుు. ఒక్కో లారీలో పది టన్నుల ఉల్లిపాయలు ఉంటాయి. ప్రస్తుతం కర్నూలులో ఉల్లిపాయల పంట ముగియడంతో నగరంలో భారీ కొరత ఏర్పడింది. దీంతో మహారాష్ట్ర సరుకుపై ఆధార పడాల్సి వస్తోంది. దూరప్రాంతం నుంచి సరుకు దిగుమతి కావటంతో ధర ఒక్కసారిగా పెరిగింది. వారం రోజులుగా విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌కు రోజుకు 50 లారీల సరుకు మాత్రమే వస్తోంది. ఇందులో 25 లారీలు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, మిగిలిన 25 లారీలు నగర మార్కెట్‌కు తరలిస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అరుు్య వీటిని కూడా ప్రజలకు కాకుండా చేస్తున్నారు. వ్యాపారుల సిండికేట్ మొదట్లో మహారాష్ట్రలోని నాందేడ్, అహ్మద్‌నగర్ నుంచి ఉల్లిపాయలు దిగుమతి అయ్యూరుు. అరుుతే, అక్కడ కూడా వర్షాలకు పంట దెబ్బతినడంతో హోల్‌సేలర్స్ సోలాపూర్ ఉల్లిపాయలను తెప్పిస్తున్నారు. ఇంతా కష్టపడి తెప్పించే ఉల్లిపాయలను వ్యాపారులు సిండికేట్‌గా మారి విక్రరుుస్తున్నారు. సాధారణంగా నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా రోజుకు పది లారీల ఉల్లిపాయల విక్రయాలు మాత్రమే జరుగుతుంటాయి. అలాగే, జిల్లాలోని రైతుబజార్లలో 43 టన్నులు, బహిరంగ మార్కెట్‌కు మరో 60 టన్నులు కేటారుుస్తారు. ఈ నేపథ్యంలో రోజూ మార్కెట్‌కు వచ్చే 25 లారీల ఉల్లిపాయల్లో పది లారీలు పోగా, మిగిలిన వాటిని వ్యాపారులు నిల్వ ఉంచేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ఉల్లి కొరత ఏర్పడటంతో నిల్వ ఉన్న వాటిని బయటకు తీసి అధిక ధరలకు విక్రరుుస్తున్నారని తెలిసింది. రైతుబజార్లలో కనుమరుగు వారం రోజులుగా నగరంలోని స్వరాజ్యమైదానంతో పాటు జిల్లాలోని అన్ని రైతుబజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు నిలిచిపోయూరుు. మెక్కుబడిగా అక్కడక్కడ మాత్రమే విక్రరుుస్తున్నారు. వీటికి మార్కెటింగ్ శాఖ అధికారులు కేజీ రూ.17గా ధర నిర్ణయించారు. అరుుతే, కొరత కారణంగా విజయవాడ మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులే కేజీ రూ.22కు కొంటున్నారు. రిటైల్ వ్యాపారులు రవాణా, ఇతర ఖర్చులు కలుపుకొని రూ.26కు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో రైతుబజార్లో మార్కెటింగ్ అధికారులు నిర్ణరుుంచిన రూ.17కు అమ్మడానికి వ్యాపారులు ఇష్టపడట్లేదు. అలా చేస్తే తమకు నష్టమని కొందరు ఉల్లిపాయలు అమ్మడమే మానేశారు. మరికొందరు మాత్రం నాసిరకం సరుకు అమ్ముతున్నారు. ప్రజల్లో ఆందోళన ఉల్లిపాయల ధరలు పెరగటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యాపారులు మాయాజాలం చేసి రేట్లు పెంచుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉల్లిపాయలు దొరక్క అవస్థలు పడుతున్నారు. మార్కెటింగ్ అధికారులు జోక్యం చేసుకుని రైతుబజార్లలో ఉల్లిపాయల అమ్మకాలు జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు. 4. -
ఘాటెక్కిన ఉల్లి
* కిలో రూ.15 నుంచి రూ.25కు పెరుగుదల * పెద్దగా మార్పుల్లేని కూరగాయల ధరలు తాడేపల్లిగూడెం : ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. గత వారంతో పోలిస్తే కిలో రిటైల్‌గా రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తాడేపల్లిగూడెం హోల్‌సేల్ మార్కెట్లో ఆదివారం మహారాష్ట్ర ఉల్లి క్వింటాల్ రూ. 2,400 పలికింది. నాణ్యత తక్కువగా ఉన్న ఉల్లి అయితే రూ. 1,800 వరకు పలికింది. రిటైల్‌గా నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయించారు. గత వారం నాణ్యత కలిగిన ఉల్లి క్వింటాల్ రూ.2,000 పలకగా నాణ్యత తక్కువగా ఉన్నవి రూ.1,400 చేసి విక్రయించారు. ఆదివారం కేవలం 15 లారీల సరుకు మాత్రమే గూడెం హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చింది. ఉల్లి ధర ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెరిగిన బీరకాయల ధర మార్కెట్లో బీర కాయలు ధర ఒక్కసారిగా పెరిగింది. గూడెం హోల్‌సేల్ మార్కెట్లో పది కిలోల ధర రూ.250 పలికింది. గత వారం రూ.110 కావడం గమనార్హం. వంకాయలు తక్కువ ధరకే లభ్యమయ్యాయి. తెల్ల వంకాయలు పది కిలోలు రూ.100 పలకగా రిటైల్ మార్కెట్లో కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయించారు. నల్ల వంకాయలు పది కిలోలు రూ.60 పలికాయి. బెండ, దొండకాయల ధరలు స్వల్పంగా పెరిగాయి. బెండ కాయలు పది కిలోలు రూ.220 పలకగా దొండకాయలు రూ.150 చేసి విక్రయించారు. చిక్కుళ్లు పది కిలోలు రూ.200 లకు విక్రయించగా, పొట్టి చిక్కుళ్లు పది కిలోలు రూ. 400 చేసి విక్రయించారు. క్యారెట్ పది కిలోలు రూ.180, బీట్ రూట్ రూ.250, క్యాప్సికం, బీన్ రూ.450 పలికాయి. క్యాబేజీ పది కిలోలు రూ.80 నుంచి రూ.100 వరకు పలికాయి. దోసకాయలు కూడా ఇదే ధర పలికాయి. కంద పది కిలోలు రూ.130 వద్ద స్థిరంగా ఉండగా, పెండ్లం రూ.250 చేసి విక్రయించారు. టమోటాలు చిత్తూరు రకం 25 కిలోల ట్రే రూ.250కి చేసి అమ్మగా నాటు రకం రూ.80 పలికాయి. బంగాళా దుంపలు పది కిలోలు రూ.110 చేసి అమ్మకాలు సాగించారు. -
తగ్గిన కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: వాతావరణం అనుకూలించడంతో ప్రస్తుతం కొన్ని కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా టమాటా ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈసారి వర్షాలు ఆలస్యంగా కురవడం అదేవిధంగా ఇతర కారణాల వల్ల గత రెండు నెలలుగా కూరగాయల ధరలలో హెచ్చుతగ్గులు వస్తూనే ఉన్నాయి. వర్షాలు ఆలస్యంగా కురిసినప్పటికీ సంతృప్తి కరంగా కురవడంతో గత నెలలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రానికి (ఏపీఎంసీ) కూరగాయల సరఫరా కూడా పెరిగింది. దీంతో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ సందర్భంగా సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ.. రోజుకు 500 నుంచి 600 ట్రక్కుల కూరగాయలు ఈ మార్కెట్‌కు సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఇది చాలా ఎక్కువన్నారు. గతంలో రోజుకు కేవలం 350- 400 ట్రక్కుల కూరగాయలు మాత్రమే సరఫరా అయ్యేవని తెలిపారు. ఇప్పుడు సరఫరా పెరగడంతో టమాటాల ధరలు గణనీయంగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో టమాటా ధర కిలోకు రూ.8 నుంచి 10 వరకు పలుకుతోంది. కాగా, మరికొన్ని వారాల వరకు కూరగాయల ధరల్లో తగ్గుదల కనిపిస్తుందని కూరగాయల వ్యాపారి రామ్‌దాస్ పవాలే తెలిపారు. కాగా, క్యారెట్, క్యాబేజీ, దొండకాయలు, పచ్చి బఠాణీ, పచ్చి మిరప ధరలు కూడా గణనీయంగా తగ్గగా గోరుచిక్కుడు, గోబి పువ్వు, బెండకాయల ధరలు స్థిరంగా ఉన్నాయి. -
టమా‘ఠా’
భగ్గుమంటున్న ధరలు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.60-70 నగరానికి దిగుమతులు తగ్గిన ఫలితం సాక్షి, సిటీబ్యూరో: నగర వాసులకు టమాటా బాంబులా కన్పిస్తోంది. స్థానికంగా దిగుబడులు లేకపోవడం.. అనుకున్న స్థాయిలో దిగుమతి కాకపోవడంతో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రోజురోజుకూ వీటి ధరలు పైకి ఎగబాకుతున్నాయి. సామాన్యుడు మాత్రం వీటిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరల కారణంగా టమాటా కాస్త టమోతగా మారింది. నగర మార్కెట్లో టమాటా ధరలు మోతమోగిస్తున్నాయి. హోల్‌సేల్ మార్కెట్లోనే శనివారం టమాటా కిలో ధర రూ.52, రైతు బజార్లలో రూ.55 పలికింది. రిటైల్ మార్కెట్లో దాని ధర మరింత ఎక్కువగా ఉంది. గిరాకీని బట్టి కేజీ టమాటాను రూ.60 నుంచి 70 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లవద్దకు వచ్చే తోపుడుబండ్ల వ్యాపారులు కిలో రూ.80 చొప్పున అమ్ముతున్నారు. సరుకు నాణ్యత, గిరాకీని బట్టి వ్యాపారులు ధర నిర్ణయిస్తూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ధరలు పెరగడంతో వంటింట్లో టమాటాకు స్థానం లేకుండా పోయింది. దీని ధర ప్రభావం మిగతా కూరగాయలపైనా పడింది. ముఖ్యంగా పచ్చి మిర్చి ధర ఎగబాకుతోంది. మిగతా కూరగాయల్లోనూ శనివారం కిలోకు రూ.2-3 పెరుగుదల కన్పించింది. ఫ్రెంచి బీన్స్, క్యారెట్, చిక్కుడు, బీర, బెండ, కాప్సికమ్ కిలో ధర రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. వంకాయ, దొండ, దోస, సొర, కాకర, క్యాబేజీ, గోరుచిక్కుడు, బీట్రూట్, పొట్ల, కంద వంటివన్నీ కేజీ రూ.20-36 మధ్యలో లభిస్తున్నాయి. తగ్గిన సరఫరా.. శివార్లలో పండిన మిర్చి, టమాటా దిగుబడులు పూర్తికావడంతో దిగుమతులపైనే నగర మార్కెట్ ఆధారపడాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి టమాటా, అనంతపూర్, బెల్గామ్ల నుంచి పచ్చి మిర్చి నగరానికి సరఫరా అవుతోంది. ఇప్పుడు అక్కడే మంచి ధరలు లభిస్తుండటంతో హైదరాబాద్‌కు తక్కువ మొత్తంలో సరుకు దిగుమతి అవుతోంది. నగర డిమాండ్‌కు తగినంతగా సరుకు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నగర అవసరాలకు నిత్యం 350-400 టన్నుల టమాటా దిగుమతయ్యేది. శనివారం బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్‌కు మదనపల్లి నుంచి కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే సరఫరా అయింది. రోజుకు 80-100 టన్నులు దిగుమతి అయ్యే పచ్చిమిర్చి శనివారం కేవలం 230 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతులు గణనీయంగా పడిపోవడంతో ప్రధానంగా మిర్చి, టమాటాకు నగరంలో కొరత ఏర్పడిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొరతే ధరలు పెరగడానికి దారితీసినట్టు వారు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించి ఉత్పత్తి పుష్కలంగా ఉన్న కూరగాయల ధరలను కూడా పెంచేసి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ప్రత్యామ్నాయాన్ని ఆలోచించాలి.. కూరగాయల ధరలు పెరిగినప్పుడు గృహిణులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి. టమాటా, పచ్చిమిర్చిల స్థానే చింతపండు, ఇమ్లీ పౌడర్, ఎండు మిర్చి, కారం పౌడర్‌ను వినియోగించడం శ్రేయస్కరం. స్థానికంగా సాగవుతున్న కొత్తపంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుంది. అప్పటివరకు కూరగాయల ధరలు అస్థిరంగా ఉంటాయి. ప్రస్తుతం టమాటా, మిర్చి అధికంగా ఉత్పత్తి అవుతున్న ప్రాంతాల నుంచి నగరానికి దిగుమతి చేసుకునేందుకు మార్కెటింగ్ శాఖ చర్యలు చేపడుతోంది. ఉన్నంతలో ధరల నియంత్రణకు గట్టిగా కృషి చేస్తున్నాం. - వై.జె.పద్మహర్ష, సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ -
టమోటా ధరపై గందరగోళం!
గుడివాడ : టమోటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎలాగైనా ధరలను అదుపు చేయాలని జిల్లా అధికారులు భావించారు. అధికారులు చెప్పినట్లు చేస్తే తాము నష్టపోతామని రైతులు రైతుబజారుల్లో టమోటా విక్రయాలను నిలిపివేశారు. ధరల నియంత్రణకు టమోటా, వంకాయ, బెండకాయ, ఉల్లిపాయలను అన్ని రైతు బజారుల్లో ఒకే ధరకు విక్రయించాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి ఆదేశాలు జారీచేశారు. ఆయా ధరలను అధికారులే నిర్ణయిస్తారు. ఈ క్రమంలో సోమవారం టమోటా కిలో ధర రూ.35గా ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మన జిల్లాలో టమోటా పంట లేదని, తాము హోల్‌సేల్ మార్కెట్లో ఎక్కువకు కొనుగోలు చేసి తక్కువ ధరకు ఎలా విక్రయించగలమని ప్రశ్నించారు. రైతుబజార్లలో విక్రయాలు నిలిపివేశారు. గుడివాడలో మంగళవారం రైతుబజారు బయట టమోటాలను కిలో రూ.41కు విక్రయించారు. అధికారులు స్పందించి బుధవారం టమోటా కిలో రూ.41గా నిర్ణయించడంతో రైతుబజారుల్లో యథావిధిగా విక్రయాలు కొనసాగించారు. -
కత్తిపీట మీద సామే
- మండుతున్న కూరగాయల రేట్లు - ఉష్ణోగ్రత కారణంగా తగ్గిన దిగుబడి - ఉల్లిపాయల ధరా అదే దారిలో.. అమలాపురం, న్యూస్‌లైన్ : తగలబడుతున్న కారడవి నుంచి వీస్తున్నట్టు గాలి పగలూ, రాత్రీ సెగలు కక్కుతోంది. నీడ పట్టున ఇంట్లోనే ఉన్నా.. పగబట్టినట్టు వాతావరణం హింసిస్తోంది. ఇక.. కూరో, వేపుడో వండుతూ వంటిళ్లలో మండే స్టౌల ముందుండే ఇల్లాళ్ల అవస్థ చెప్పనక్కరలేదు. అక్కడున్నంతసేపూవారికి చిత్రహింసగానే ఉంటోంది. ఉల్లి ఘాటుకు మండుతున్న కంట్లోనే నలుసు పడ్డట్టు- ఇప్పుడా అవస్థకు భగ్గుమంటున్న కూరగాయల ధరలు తోడయ్యాయి. ముఖ్యంగా దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాల మహిళలు వంటింటి బడ్జెట్‌ను నిర్వహించలేక సతమతమవుతున్నారు. కిలో కూరగాయలు కొనే వారికి అర కిలోతోనో, పావుకిలోతోనో సరిపెట్టుకోక తప్ప డం లేదు. దాంతో ఇంటిల్లిపాదికీ కడుపారా తినేందుకు కూర వండి పెట్టడం ఆ ఇల్లాళ్లకు ‘కత్తిపీట మీద సాము’గా మారింది. ఇంట వండిన కూర రుచిగా ఉన్నప్పుడు మారు వడ్డించమనడం ఎవరికైనా ఉన్న అలవాటే. అలా అడిగిన వారికి అడిగినంత కూర వడ్డించడం ఇప్పుడు ఇల్లాళ్లకు శక్తికి మించిన పనిగా పరిణమించింది. జిల్లాలో వారం, పదిరోజులుగా మడికి హోల్‌సేల్ మార్కెట్లో, చిల్లర వ్యాపారాల్లో కూరగాయల ధరలు రోహిణీ కార్తెలో ఉష్ణోగ్రతలాగే దినదినాభివృద్ధి చెందుతున్నాయి. బీర, క్యారెట్, బీట్రూట్ వంటి వాటి ధరలు ఇప్పటికే సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. వీటి ధర కేజీ రూ.40 నుంచి రూ.42 వరకు ఉంది. కొన్ని చోట్ల బీర ధర రూ.45 కూడా దాటింది. టమాటా, బెండకాయలు కేజీ రూ.32 నుంచి రూ.35, క్యాబేజీ, వంకాయలు రూ.24 వరకు, బంగాళదుంప, దొండకాయ రూ.20 చొప్పున అమ్ముతున్నారు. ఇక.. నగల తయారీలో బంగారానికి రాగి కలవడం ఎంత తప్పనిసరో.. ఏ కూర వండాలన్నా అంతే తప్పనిసరైన ఉల్లిపాయలు కూడా ‘మేము మాత్రం తక్కువ తిన్నామా’ అన్నట్టు ధర విషయంలో మిడిసిపడుతున్నాయి. వాటి నాణ్యతను బట్టి రూ.20 నుంచి 24 వరకు పలుకుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 సెంటీగ్రేడ్ డిగ్రీలకు పైబడి ఉండడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిందని, దానికి తోడు మండే ఎండల్లో కూరగాయల కోతకు వచ్చేందుకు కూలీలే జంకుతుండడంతో ఎక్కువ కూలి ఇచ్చి కోయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. కాగా మడికి హోల్‌సేల్ మార్కెట్‌కు ప్రస్తుతం.. ఎప్పుడూ వచ్చే కూరగాయల్లో 60 శాతమే వస్తున్నాయని అక్కడి వ్యాపారులు చెపుతున్నారు. తొలకరి వర్షాలు పడి, ఉష్ణోగ్రతలు త గ్గి కాయగూరల దిగుబడి ఎంతోకొంత పెరిగే వరకూ ధరలు దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు. అంటే.. మరికొన్ని రోజులు కూడా రెండుపూటలా నోరారా తినడం అంటే సామాన్యుల జేబుకు మించిన భారం కాక తప్పదన్న మాట. -
కూర‘గారాలు’
=దిగొచ్చిన ధరలు =రా.. రమ్మంటున్న రైతుబజార్లు =ఇబ్బడిముబ్బడిగా కూరగాయల దిగుబడి =రూ.100లకే నిండుతోన్న చేతి సంచి సాక్షి, సిటీబ్యూరో : నగరంలో చాలారోజుల తర్వాత సగటు కుటుంబం తృప్తిగా భోజనం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి వరకు ఠారెత్తించిన టమోట , పచ్చిమిర్చి వంటి కూరగాయల ధరలు దిగిరావడం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఊరట నిచ్చింది. రూ.100లు వెచ్చిస్తే చేతిసంచి నిండిపోతుండటంతో గృహిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు టమోట అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకొన్న వారు ఇప్పుడు ఏకంగా 4, 5 కిలోలు కొనుగోలు చేస్తున్నారు. గ్రేటర్ చుట్టుపక్క ప్రాంతాల్లో కూరగాయల దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో సరకు రైతుబజార్లను ముంచెత్తుతోంది. బహిరంగ మార్కెట్లు సైతం అన్నిరకాల కూరగాయలతో కళకళలాడుతున్నాయి. ప్రత్యేకించి కొత్త పంట దిగుబడి విపరీతంగా పెరగడంతో టమోట ధర సింగిల్ డిజిట్ కు దిగి వచ్చింది. సీజన్ ఊపందుకోవడంతో చిక్కుడు, వంగ, క్యాబేజీ, కీర, దోస, వంటి కూరగాయల దిగుబడులు అధికమై వాటి ధర సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. సోమవారం హోల్‌సేల్ మార్కెట్లో టమోట ధర కేజీ రూ.4లకు దిగివచ్చింది. దీనికి మరో రూ.2 అదనంగా వేసి రైతుబజార్లలో టమోట ధర కేజీ రూ.6లుగా నిర్ణయించారు. అయితే రైతులు బోర్డుపై రాసిన ధరకంటే ఇంకా తగ్గించి మరీ అమ్ముతున్నారు. టమోట దిగుబడి ఎక్కువకావడంతో ఏరోజు సరుకు ఆరోజే అమ్ముకొనేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ఉదయం ఉన్న ధరను సాయంత్రానికల్లా తగ్గించి 2 కేజీల టమోట కేవలం రూ.10లకే విక్రయించి చేతులు దులుపుకొంటున్నారు. అలాగే వంకాయ, చిక్కుడు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోస వంటి కూరగాయలు కూడా రైతుబజార్లో బోర్డుపై రాసిన ధరల కంటే రూ.2లు తగ్గించి రైతులు విక్రయిస్తున్నారు. ఆకుకూరల ధరలు కూడా టమోట బాటలోనే కిందికి దిగివచ్చాయి. చిన్న కట్ట రూ.10లు ధర పలికిన కొత్తిమీర, తోటకూర, పాలకూర, గంగవాయల్కూర, గోంగూర, బచ్చలకూర, చుక్కకూర వంటివి రూ.10లకే 10-12 కట్టలు లభిస్తున్నాయి. దక్కిన కాడికే...: టమోట నిల్వ ఉంచలేని పరిస్థితిలో చాలామంది రైతులు హోల్‌సేల్ రేట్లకే అమ్మి సొమ్ము చేసుకొంటున్నారు. రైతుబ జార్లో కూరగాయల ధరలు అనూహ్యంగా దిగివస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్లో చిల్లర వ్యాపారులు కూడా ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, మీరాలంమండీ, మాదన్నపేట్ హోల్‌సేల్ మార్కెట్లకు సోమవారం 324 లారీల టమోట దిగుమతైనట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. నగంలోని రైతుబజార్లు, హోల్‌సేల్ మార్కెట్లు, మాల్స్, రిటైల్ మార్కెట్‌కు అన్నింటికీ కలిపి మొత్తం 40వేల క్వింటాళ్లకు పైగా అన్నిరకాల కూరగాయలు సరఫరా అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.