25 ఎకరాలు.. 318 షాపులు  | Mega Gated Wholesale Market In Warangal | Sakshi
Sakshi News home page

25 ఎకరాలు.. 318 షాపులు 

Published Mon, Feb 21 2022 3:34 AM | Last Updated on Mon, Feb 21 2022 8:14 AM

Mega Gated Wholesale Market In Warangal - Sakshi

మెగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఓ భాగం   

గీసుకొండ: వరంగల్‌ జిల్లా గ్రేటర్‌ వరంగల్‌ నగర పరిధిలో రాష్ట్రంలోనే మొదటి మెగా గేటెడ్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌ రూపుదిద్దుకుంది. ఆదివారం ఈ మార్కెట్‌ క్లాంప్లెక్స్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుసలుగా నిర్మించిన ఇక్కడి మార్కెట్‌ను చూస్తుంటే తాను అమెరికాలో చూసిన ఓ షాపింగ్‌ సముదా యం గుర్తుకు వస్తోందన్నారు.

స్థానిక గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో 25 ఎకరాల్లో అన్ని వసతులతో 318 షాపుల సముదాయాన్ని నిర్మించారు. నగరంలోని హోల్‌సేల్‌ ట్రేడర్స్‌ కమర్షియల్‌ వెల్ఫేర్‌ సొసైటీ రూ.300 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టింది. ప్రభుత్వ సహాయం లేకుండా వ్యాపారులే సొంతంగా ఈ మెగా గేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించుకోవడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement