payment app
-
వీటిని తెగవాడుతున్నారు..!
ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్‌తో చెల్లింపులు సాగిస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కచ్చితంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. చిటికెలో ట్రాన్సాక్షన్ పూర్తి చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన క్రమంలో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాద్ పార్లమెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. యూపీఐ పేమెంట్లు పెరగడంతో గతేడాది చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 7.8 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2017-18 ఏడాదిలో యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లుగా ఉండగా.. అది 2022-23కు ఏకంగా 8,357 కోట్లకు చేరినట్లు చెప్పారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యాపరంగా వార్షిక వృద్ధి 147 శాతంగా ఉందని పేర్కొన్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 2017-18లో దాదాపు రూ.1 లక్ష కోట్లుగా ఉండగా.. అది 168 శాతం పెరిగి 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో డిసెంబర్ 11 వరకు యూపీఐ మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 8,572 కోట్లుగా తెలిపారు. 2022-23లో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూపీఐ లావాదేవీలే 62 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ.. చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 2021-22లో 9.9 శాతంగా ఉండగా.. 2022-23లో 7.8 శాతానికి తగ్గిందన్నారు. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డులను తమతో తీసుకెళ్లకుండానే చిన్న విక్రయ కేంద్రాల్లోనైనా చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉండగా.. గత తొమ్మిదేళ్లలో 57 బ్యాంకులను మూసివేసినట్లు మంత్రి చెప్పారు. మూడు బ్యాంకులు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంకులను పునరుద్ధరించినట్లు చెప్పారు. -
ఫోన్ పే వాడుతున్నారా .. అయితే ఈ శుభవార్త మీకే
-
వామ్మో రూ. 84 లక్షల కోట్లా? ఎదురులేని ఫోన్‌పే!
యూపీఐ చెల్లింపుల్లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అరుదైన ఘనత సాధించింది. వార్షిక మొత్తం చెల్లింపు విలువ రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 84 లక్షల కోట్లు) సాధించినట్లు ఫోన్‌పే తెలిపింది. దేశంలోని టైర్ 2, 3, 4 నగరాలే కాకుండా దాదాపు అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ మూడున్నర కోట్ల మందికిపైగా ఆఫ్‌లైన్ వ్యాపారులను డిజిటలైజ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే! టోటల్ పేమెంట్ వ్యాల్యూ(టీపీవీ) రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఫోన్‌పే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి ఆఫర్లతో దేశంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌కు ఆమోదం? యూపీఐ చెల్లింపు విభాగంలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండటంతోనే తమకు ఈ ఘనత సాధ్యమైందని కంపెనీ తెలిపింది. మరోవైపు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు పేర్కొంది. -
డబ్బులెందుకు.. ఫోన్ ఉంటే చాలు..
సాక్షి, అమరావతి: బడ్డీ కొట్టులో రూపాయి చాక్లెట్ కొన్నా.. ఇంట్లోనే కూర్చొని టికెట్లు బుక్ చేయాలన్నా.. గ్యాస్, కరెంట్ తదితర బిల్లులు చెల్లించాలన్నా.. అన్నింటికీ ప్రజలు ఇప్పుడు ‘యూపీఐ’ యాప్‌లనే ఆశ్రయిస్తున్నారు. చివరకు భిక్షాటనలోనూ యూపీఐ క్యూఆర్ కోడ్లనే ఉపయోగించేస్తున్నారు. అన్నింటికీ పేమెంట్ యాప్‌లతోనే చెల్లింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా గత రెండు, మూడేళ్ల నుంచి జనం చేతుల్లో క్యాష్ తక్కువైపోయి.. స్కానింగ్ ఎక్కువైపోయింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ) ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు వాడే ఒక వాహకం. దీని ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చాలా సులవుగా, వేగంగా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం పేమెంట్ యాప్‌ల ద్వారా రోజుకు రూ.లక్ష వరకు బదిలీ చేసే అవకాశముండటంతో.. దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ప్రజలు బ్యాంకులకు వెళ్లి.. గంటల పాటు వేచి చూసే శ్రమ కూడా తప్పింది. సమయం కూడా ఆదా అవుతోంది. వేగంగా వృద్ధి.. ‘డేటా డాట్ ఏఐ’ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న యాప్స్‌లో ఫోన్ పే, పేటీఎం, గూగుల్‌పే మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్, పేమెంట్, పర్సనల్ లోన్స్ ఎంతో వేగంగా వృద్ధి చెందాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇక టాప్–10 డౌన్లోడెడ్ యాప్స్‌లో నాలుగు, ఆ తర్వాతి స్థానాల్లో బజాజ్ ఫిన్ సర్వ్, యోనో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వరల్డ్, క్రెడిట్ బీ, ధని, నవీ, గ్రో యాప్స్ ఉన్నాయి. ఆదమరిస్తే అంతే.. డిజిటల్ పేమెంట్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. ముప్పు కూడా అదే స్థాయిలో ఉంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయే ప్రమాదముంది. యూపీఐ పేమెంట్స్‌పై అవగాహన లేకపోవడం, తమకు వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మడం వల్ల చాలామంది మోసపోతున్నారు. లాటరీ తగిలిందని.. మీ ఖాతా వివరాలు అప్డేట్ చేయాలి ఓటీపీ చెప్పండని, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే అదృష్టం వరిస్తుందని.. ఇప్పుడు కొత్తగా మా వీడియోలను చూస్తే చాలు, సోషల్ మీడియాలో లైక్ కొడితే చాలు డబ్బులిస్తామంటూ అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి.. వన్‌టైమ్ పాస్వర్డ్(ఓటీపీ), యూపీఐ పిన్ నంబర్లు తెలుసుకొని డబ్బులు లాగేస్తున్నారు. ఇలా మోసపోకుండా ఉండాలంటే.. పాస్‌వర్డ్‌లను తరచుగా మారుస్తుండాలి. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను తెరవకూడదు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయకూడదు. ఎవరికీ ఎలాంటి సందర్భంలోనూ ఓటీపీ చెప్పకూడదు. ఇలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మోసాల నుంచి తప్పించుకోవచ్చు. -
ఇంటర్నెట్ లేకుండానే UPI పెమెంట్స్
-
పేటీఎం తరహాలో ‘పేసీఎం’.. క్యూఆర్ కోడ్‌తో నేరుగా..!
బెంగళూరు: కర్ణాటక అధికార పార్టీ బీజేపీపై సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ. యూపీఐ పేమెంట్ యాప్ పేటీఎం తరహాలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ముఖచిత్రం, క్యూఆర్ కోడ్‌తో ‘పేసీఎం’ పోస్టర్లను బెంగళూరు మొత్తం ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. వినియోగదారులు నేరుగా ‘40 శాతం సర్కార్’ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌ను కాంగ్రెస్ ప్రారంభించింది. కొద్ది రోజులుగా బీజేపీ పాలనలో 40 శాతం కమిషన్ తప్పనిసరిగా మారిందనే ఆరోపణలు వచ్చాయి. 40 శాతం కమిషన్‌ను ఎత్తిచూపేలా ఈ వెబ్సైట్, పోస్టర్లను డిజైన్ చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని ఎండగట్టేందుకు గత వారమే ప్రచారం మొదలు పెట్టింది కాంగ్రెస్. 40percentsarkara.com ద్వారా ప్రభుత్వ అవినీతిని నివేదించాలని, వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని ప్రజలకు సూచిస్తోంది. రాష్ట్ర పరిపాలన విభాగం 40శాతం కమిషన్‌తో నడుస్తోందని, దోపిడీదారులతో నిండిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కొద్ది రోజుల క్రితమే ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నోరు విప్పే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రను నియంత్రించండి’.. కేరళ హైకోర్టులో పిటిషన్ -
బ్యాంకుకు వెళ్లిన సాగర్‌కు మతి పోయినంతపనైంది.. భద్రం బ్రదరూ! ఇంతకూ ఏమైంది?
సాగర్‌కు రెండు క్రెడిట్ కార్డులున్నాయి. పరిమితి కూడా ఎక్కువ. దేనికైనా వీటినే వాడుతూ ఉంటాడు. క్రెడిట్ స్కోరుకు ఢోకా లేకుండా బిల్లు కరెక్టుగా చెల్లిస్తుంటాడు. కానీ ఈ మధ్య ఓ లోన్కోసం వెళితే... తన క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందన్నారు. రిపోర్టు చూసి అదిరిపడ్డాడు సాగర్. ఎందుకంటే తన పేరిట 5 క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో కొన్నింటికి బకాయిలున్నాయి. మరికొన్నిటి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దానివల్లే క్రెడిట్ స్కోరు తగ్గింది. బ్యాంకుకు వెళ్లి ఇదేంటని అడిగిన సాగర్‌కి... విషయం తెలిసి మతి పోయినంతపనైంది. ఇంతకీ ఏంటది? సాధారణంగా షాపింగ్‌కో, ఆన్లైన్ పేమెంట్లకో క్రెడిట్ కార్డు వాడటం సాగర్‌కు అలవాటు. కానీ ఈ మధ్య ఆన్లైన్లో అత్యంత సౌకర్యంగా ఉండటంతో ఇన్స్టంట్ లోన్/పేమెంట్ యాప్‌లను ఎడాపెడా వాడటం మొదలెట్టాడు. తరువాత చెల్లింవచ్చు కదా (పోస్ట్ పెయిడ్) అనే ఉద్దేశంతో చాలా యాప్‌లలో కొంత మొత్తం చొప్పున వాడేశాడు. వాటిలో కొన్నింటి గడువు తేదీ వారం రోజులే!. మరికొన్నింటికి 10 రోజులు– 15 రోజులు ఇలా బిల్లింగ్ సైకిల్స్ ఉన్నాయి. అంత తక్కువ వ్యవధి కావటంతో వాటిని తిరిగి చెల్లించటంలో కిరణ్ అంత శ్రద్ధ పెట్టలేకపోయాడు. ఇవిగో... ఇవే సిబిల్ రిపోర్టులో కొంప ముంచాయి. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్ వేరువేరు కస్టమర్లను ఆకట్టుకోవటానికి కొన్ని... వ్యాపారాన్ని పెంచుకోవటానికి కొన్ని. కారణమేదైనా ఇపుడు చాలా కంపెనీలు పోస్ట్‌పెయిడ్ మొదలెట్టేశాయి. అంటే... ‘ఇప్పుడు కొను–తరువాత చెల్లించు’ (బీఎన్‌పీఎల్) అన్నమాట. షాపింగ్ యాప్‌లతో పాటు సర్వీసులందించే యాప్‌లు కూడా వీటిని అందిస్తున్నాయి. ఉదాహరణకు క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’నే తీసుకుంటే... క్యాబ్ బుక్ చేసిన వెంటనే చెల్లించాల్సిన పనిలేదు. కొంత మొత్తం పరిమితికి లోబడి... ఓలా పోస్ట్ పెయిడ్ సేవలందిస్తోంది. ఆ మొత్తం వరకూ సర్వీసులు వాడుకోవచ్చు. ఈలోపు బిల్లింగ్ తేదీ వస్తే బిల్లు అందుతుంది. చెల్లిస్తే సరి. మరిచిపోతే కాస్త జరిమానాలూ ఉంటాయి. ఓలాతో పాటు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి కూడా కొంత పరిమితి వరకూ ‘పే లేటర్’ సేవలందిస్తున్నాయి. ఇదంతా పోస్ట్‌పెయిడ్ వ్యవహారం. లోన్‌యాప్స్ కూడా ఇంచుమించుగా... మారుతున్న కాలానికి తగ్గట్టుగా క్రెడిట్ కార్డుల్లానే ఆన్లైన్ లోన్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. కార్డులు లేకున్నా, వాలెట్లలో డబ్బులు లేకున్నా సరే... ఈ యాప్స్‌తో అప్పటికప్పుడు ఈజీగా పే చేసేయొచ్చు. లేజీ పే, సింపుల్, బుల్లెట్, పేటీఎం పోస్ట్‌పెయిడ్, ఫ్రీచార్చ్ పే లేటర్, మొబిక్విక్ జిప్ పేలేటర్, పే లేటర్ బై ఐసీఐసీఐ... ఇవన్నీ అలాంటివే. ఆన్లైన్లో కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీసుకో దీనిద్వారా తక్షణం చెల్లించేయొచ్చు. బిల్లులు కూడా. వీటన్నిటినీ కూడా క్రెడిట్కార్డుల్లానే భావించాల్సి ఉంటుంది. అందించేవన్నీ ఆర్థిక సేవల కంపెనీలే కాబట్టి... సిబిల్ జాబితాలో వీటిని కూడా క్రెడిట్ కార్డుల్లానే చూడాల్సి వస్తుంది. చిన్నచిన్న పేమెంట్లే కనక వీటి చెల్లింపు గడువు కూడా తక్కువే. జరిమానాలూ ఎక్కువే. ఉదాహరణకు 100 రూపాయల బిల్లు గనక చెల్లించకపోతే... మరో 100 ఫైన్ కట్టాల్సి రావచ్చు. ఎందుకంటే చాలా సంస్థలు కనీస ఫైన్ మొత్తాన్ని ఈ రకంగా నిర్ధారిస్తున్నాయి. శాతంలోనైతే ఇది 100. చాలామందికి రూ.100 అనేది చిన్న మొత్తంగానే కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య ఉండదు. కాకపోతే వీటిని విస్మరిస్తే సిబిల్ రిపోర్టులో స్కోరుపై మాత్రం ప్రభావం చూపిస్తాయని మరిచిపోకూడదు. పోస్ట్‌పెయిడ్–లోన్ యాప్స్‌కు తేడా ఏంటి? పోస్ట్‌పెయిడ్‌లో సదరు సంస్థ తమ దగ్గర కొన్న వస్తువుకో, అందుకున్న సర్వీ సుకో దీన్ని అందిస్తుంది. కానీ లోన్‌యాప్స్ అయితే ఏ కంపెనీలో కొన్న వస్తువుకైనా, ఎక్కడ తీసుకున్న సర్వీసుకైనా వీటి నుంచి చెల్లింపులు చేయొ చ్చు. నిజానికిప్పుడు లేజీ పే వంటి చాలా లోన్‌యాప్స్ అస్సలు వడ్డీలు వసూలు చేయటం లేదు. మరి వాటి మనుగడ ఎలా? అనే సందేహం సహజం. ప్రస్తుతానికైతే ఆలస్య రుసుములే వీటికి ప్రధాన ఆదాయ వనరు. పైపెచ్చు ఇవన్నీ యూజర్ బేస్‌ను (కస్టమర్ల సంఖ్య) పెంచుకోవటంపైనే దృష్టిపెడుతున్నాయి. అక్కడ సక్సెస్ అయితే పెట్టుబడులొస్తాయి. ఏదో ఒక దశలో ఆ పెట్టుబడులపై లాభాన్ని అందించాల్సిన బాధ్యత ప్రమోటర్‌కు ఉంటుంది. కాబట్టి మున్ముందు ఇవన్నీ వడ్డీల రూపంలోనో... నెలవారీ ఫీజుల రూపంలోనో యూజర్ల నుంచి చార్జీలు వసూలు చేయక తప్పదు కూడా. ఇంతకీ వీటిని వాడొచ్చా? క్రెడిట్ కార్డుల్ని సైతం ఎడాపెడా వాడితే ఆ తరువాత ఇబ్బందులు తప్పవన్నది చాలామందికి అనుభవంలోకి వచ్చిన వాస్తవం. అలాంటిది అందుబాటులో ఉన్నాయి కదా అని ఎడాపెడా లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకుంటే?. వీటి బిల్లింగ్‌ను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ అప్డేటెడ్గా ఉండటం అంత తేలికేమీ కాదు. బిల్లుకు సంబంధించిన మెసేజ్ వచ్చాక... ఏ కాస్త నిర్లక్ష్యం చేసినా మరిచిపోయి ఫైన్ పడే ప్రమాదం ఎక్కువ. అందుకని వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. సిబిల్ రిపోర్టులో సైతం మీరు ఉపయోగించిన ఒక్కో లోన్ యాప్ ఒక్కో క్రెడిట్లైన్ మాదిరి కనిపిస్తుంది. వాటిలో జరిమానాలు, ఆలస్యపు చెల్లింపులు ఉంటే స్కోరు దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంటుంది. మరో ముఖ్యమైన అంశమేంటంటే కొన్ని యాప్‌లు తమ బకాయిల వసూలుకు రకరకాల అనైతిక మార్గాలు కూడా అనుసరిస్తున్నాయి. రుణం తీసుకున్న వారి కాంటాక్టు లిస్టులో ఉన్నవారందరికీ ఫోన్లు చేయటం... భయపెట్టడం... వారి దగ్గర ఈ వ్యక్తిని అవమానించటం వంటివన్నీ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంతవరకూ వీటికి దూరంగా ఉండటమే మంచిదని చెప్పాలి. -మంథా రమణమూర్తి -
పేమెంట్ అయినట్టు మెసేజ్ వస్తుంది.. చెక్ చేసుకోకుండానే ఓకే చెప్తే అంతే!
‘ఇటీవల వనస్థలిపురంలో ఓ మొబైల్ షాప్‌లోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఒకట్రెండు ఉత్పత్తులను కొనుగోలు చేయగా.. రూ.2,800 బిల్లు అయింది. స్పూఫింగ్ పేటీఎం యాప్ నుంచి షాప్ వివరాలను నమోదు చేయగానే యజమానికి బిల్లు చెల్లించినట్లు సందేశం వచ్చింది. దీంతో యజమాని తన ఖాతాలో చెక్ చేసుకోకుండానే ఓకే అనడంతో ఆ ఇద్దరు కస్టమర్లు అక్కణ్నుంచి వెళ్లిపోయారు. తాపీగా బ్యాంక్ ఖాతాలో చూసుకుంటే బిల్లు జమ కాలేదు. మెసేజ్ వచ్చింది కదా నగదు క్రెడిట్ కాకపోవటమేంటని బ్యాంకులో ఆరా తీస్తే.. అది నకిలీ మెసేజ్ అని తేల్చేశారు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు.. ఇలా ఒకరిద్దరు కాదు నగరంలో రోజుకు పదుల సంఖ్యలోనే రిటైల్ యజమానులకు స్పూఫింగ్ పేమెంట్ యాప్‌లతో టోపీ పెడుతున్నారు కొందరు వినియోగదారులు’ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత నుంచి నగదు లభ్యత తగ్గడంతో చాలా మంది డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతున్నారు. కరోనా మహమ్మారితో ఈ వినియోగం మరింత పెరిగింది. చిన్న కిరాణా షాపులు, కూరగాయల బండ్ల మీదా పీటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ అప్లికేషన్లు కనిపిస్తున్నాయి. యాప్ పేమెంట్ వినియోగం విరివిగా అందుబాటులోకి రావటంతో మోసగాళ్లు వీటినీ అవకాశంగా మలుచుకుంటున్నారు. కస్టమర్ కేర్ నంబర్లు, వెబ్సైట్లు, ఈ– మెయిల్ ఐడీలతో పాటూ ఈ– వ్యాలెట్లు కూడా స్పూఫింగ్ చేస్తున్నారు. చదవండి: కార్వీ ఎండీ పార్థసారథి అరెస్ట్ ఎలా చేస్తారంటే.. ►స్పూఫింగ్ యాప్‌లను మొబైల్ అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. షాపింగ్ చేశాక కొనుగోలుదారుల మొబైల్లోని స్పూఫింగ్ ఈ– వ్యాలెట్‌లో షాప్ పేరు, ఫోన్ నంబర్, అమౌంట్ వంటి వివరాలను నమోదు చేసి ఎంటర్ చేస్తారు. దీంతో షాప్ యజమాని ఫోన్ నంబర్‌కు పేమెంట్ పూర్తయినట్లు నకిలీ నోటిఫికేషన్ వెళుతుంది. వాస్తవానికి యజమాని బ్యాంక్ ఖాతాలో మాత్రం నగదు జమ కాదు. ► బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేసి డబ్బు జమ అయిందో లేదో యజమాని చూసుకునే సమయం ఉండదు. ఎందుకంటే వేరే కస్టమర్లు ఉండటంతో బిజీగా ఉండిపోతారు. తీరా ఖాళీ సమయంలో అకౌంట్లో చూసుకుంటే ఆ నోటిఫికేషన్ తాలుకు పేమెంట్ జమై ఉండదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకుంటాడు. ఒకవేళ షాప్ యజమాని చూసుకున్నా.. డేటా, సాంకేతిక సమస్య వల్ల ఖాతాలో అప్డేట్ కావడంలో ఆలస్యం అవుతుందని ఈ కేటుగాళ్లు యజమానిని ఒప్పిస్తున్నారు. చదవండి: దేశమంతటా మన పథకాలే సౌండ్ బాక్స్‌తో పరిష్కారం.. నకిలీ లావాదేవీలకు సౌండ్ బాక్స్‌తో చెక్ పెట్టొచ్చని పేటీఎం నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా పేటీఎంకు 2.3 కోట్ల మంది వర్తకులు పార్ట్నర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. పేమెంట్ జరిగిందా లేదా అని తక్షణమే తెలుసుకునేందుకు సౌండ్ బాక్స్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కానింగ్, వాలెట్, డెటిట్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లు ఏ మాధ్యమం ద్వారా అయినా సరే పేమెంట్ చేయగానే, ఖాతాలో నగదు జమ కాగానే లావాదేవీల వివరాలు సౌండ్ బాక్స్‌లో వాయిస్ రూపేణా వినిపిస్తాయి. దుకాణా యజమానులు ప్రతి లావాదేవీ వివరాలు ప్రతిరోజూ లేదా వారానికోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ పూర్తయ్యాక బ్యాంక్ ఖాతాలో అమౌంట్ జమయ్యేందుకు ఎంత సమయం పట్టిందనే వివరాలనూ తెలుసుకోవచ్చు. -
ఫోన్‌పేకు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ లైసెన్స్
న్యూఢిల్లీ: చెల్లింపుల సేవల్లోని ప్రముఖ కంపెనీ ఫోన్‌పే.. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నుంచి బీమా బ్రోకింగ్ లైసెన్స్ లభించినట్టు సోమవారం ప్రకటించింది. కార్పొరేట్ ఏజెంట్ లైసెన్స్‌తో బీమా వ్యాపారంలోకి ఫోన్‌పే గతేడాదే ప్రవేశించింది. నిబంధనల కింద ఒక్కో విభాగంలో మూడు కంపెనీలతోనే భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి ఉంటుంది. కానీ, ఇప్పుడు నేరుగా బ్రోకింగ్ లైసెన్స్ లభించడంతో అన్ని బీమా కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే అనుమతులు లభించినట్టయింది. దీంతో బీమా బ్రోకింగ్ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది. ఈ సంస్థకు 30 కోట్లకుపైగా యూజర్ల బేస్ ఉంది. భారీ సంఖ్యలోనున్న యూజర్లకు బీమా ఉత్పత్తులను ఆఫర్ చేయగలదు. -
అరుదైన ఘనతను సాధించిన భారత్‌పే..!
ముంబై: మార్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం భారత్‌పే అరుదైన ఫీట్‌ను సాధించింది. కంపెనీ 370 మిలియన్ డాలర్లను సేకరించి యూనికార్న్ క్లబ్‌లోకి జాయిన్ అయ్యింది. ఈ నిధులను టైగర్ గ్లోబల్ సంస్థ నుంచి సేకరించింది. భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ఆయా స్టార్టప్‌లు గణనీయంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. భారత్‌పే ప్రస్తుత విలువ 2.85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ఈ సంవత్సరం 19 వ యూనికార్న్ స్టార్టప్‌గా భారత్‌పే నిలిచింది. ఒక స్టార్టప్ విలువ ఒక బిలియన్ డాలరుకు చేరిన స్టార్టప్‌ను యూనికార్న్ స్టార్టప్‌గా పిలుస్తారు. డ్రాగోనీర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, స్టెడ్‌ఫాస్ట్ క్యాపిటల్ కంపెనీలో భారత్‌పే కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం భారత్‌పే సంస్థాగత పెట్టుబడిదారుల్లో కోటు మేనేజ్మెంట్, ఇన్సైట్ పార్ట్నర్స్, సీక్వోయా గ్రోత్, రిబ్బిట్ క్యాపిటల్, ఆంప్లో కంపెనీలు నిలిచాయి. తొమ్మిది నెలల క్రితం భారత్‌పే విలువ 900 మిలియన్ డాలర్లుకు ఉండేది. ప్రస్తుతం 370 మిలియన్ల డాలర్ల పెట్టుబడిలో, సెకండరీ భాగం లో 20 మిలియన్ డాలర్లు కంపెనీ ఉద్యోగులకు క్యాష్ అవుట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. భారత్‌పే కంపెనీ టాప్ మేనేజ్మెంట్లో రీఆరెంజ్‌మెంట్‌ను కూడా చేయనుంది. కంపెనీ కో-ఫౌండర్, సీఈవో..అష్నీర్ గ్రోవర్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నుకోనున్నారు. సుహైల్ సమీర్‌ను కంపెనీ కొత్త సీఈవోగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
మీ ఫోన్ పోతే యూపీఐ యాప్స్ ను ఎలా బ్లాక్ చేయాలి?
భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) టెక్నాలజీ సహాయంతో పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఇతర పేమెంట్ యాప్స్ పనిచేస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు యుపీఐతో లింక్ చేయబడిన వారి ఫోన్లలో కనీసం ఈ మూడింటిలో ఒక పేమెంట్ యాప్స్ అయిన కలిగి ఉన్నారు. యుపీఐ ద్వారా ఎవరికైనా డబ్బును క్షణాలలో బదిలీ చేయవచ్చు. ఎవరైనా మీ ఫోన్ యాక్సెస్ చేస్తే వారు డబ్బును బదిలీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పేమెంట్ యాప్స్ గల స్మార్ట్ ఫోన్ ఎవరైనా దొంగలిస్తే ఏమి జరుగుతుంది?. వారు మీ బ్యాంకులో ఉన్న మొత్తం నగదును డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫోన్ కోల్పోయినట్లయితే లేదా ఎవరైనా దొంగలిస్తే ఈ సర్వీసులు యాక్సెస్ చేసుకోకుండా మనం చేయవచ్చు. మీ ఫోన్ పోతే పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్ పేని మీరు ఏ విధంగా బ్లాక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా బ్లాక్ చేయడం వల్ల వారు మీ ఖాతాలో నుంచి డబ్బును డ్రా చేయలేరు. పేటిఎమ్ ఖాతాను తాత్కాలికంగా ఎలా బ్లాక్ చేయాలి? పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నెంబరు 01204456456కు కాల్ చేయండి. పోయిన ఫోన్ కొరకు ఆప్షన్ ఎంచుకోండి. వేరే నెంబరు నమోదు చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి, మీ కోల్పోయిన ఫోన్ నెంబరును నమోదు చేయండి. అన్ని పరికరాల నుంచి లాగ్ అవుట్ అయ్యే ఆప్షన్ ఎంచుకోండి. తరువాత, పేటిఎమ్ వెబ్ సైట్ కు వెళ్లండి, 24ఎక్స్7 హెల్ప్ఎంచుకోవడానికి దిగువకు స్క్రోల్ చేయండి. Report a Fraud అనే దాన్ని ఎంచుకోండి, ఏదైనా కేటగిరీపై క్లిక్ చేయండి. తర్వాత, ఏదైనా సమస్యపై క్లిక్ చేయండి, ఇప్పుడు దిగువన ఉన్న Message Us బటన్ మీద క్లిక్ చేయండి. పేటిఎమ్ ఖాతా లావాదేవీలను చూపించే డెబిట్/క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేటిఎమ్ మీ ఖాతాను ధ్రువీకరిస్తుంది, బ్లాక్ చేస్తుంది. తర్వాత మీరు ధృవీకరణ సందేశాన్ని అందుకుంటారు. గూగుల్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి గూగుల్ పే వినియోగదారులు హెల్ప్ లైన్ నంబర్ 18004190157కు కాల్ చేసి మీ మాతృ భాషను ఎంచుకోండి. ఇతర సమస్యలకు సరైన ఆప్షన్ ఎంచుకోండి. మీ Google Payకు ప్రత్యామ్నాయంగా ఆండ్రాయిడ్ వినియోగదారులు తమ డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. తద్వారా ఫోన్ నుంచి మీ గూగుల్ ఖాతాను ఎవరూ యాక్సెస్ చేసుకోలేరు. ఐఓఎస్ వినియోగదారులు కూడా తమ డేటాను రిమోట్ ఆప్షన్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఫోన్ పే ఖాతాను ఎలా బ్లాక్ చేయాలి ఫోన్ పే వినియోగదారులు 08068727374 లేదా 02268727374 కాల్ చేయాల్సి ఉంటుంది. మీ మాతృ భాషను ఎంచుకున్న తరువాత, మీ ఫోన్ పే ఖాతాతో సమస్యను నివేదించాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు అప్పుడు దానికి తగిన నెంబరును నొక్కండి. ఇప్పుడు రిజిస్టర్డ్ నెంబరు నమోదు చేయండి. ధృవీకరణ కొరకు మీకు ఓటీపీ పంపబడుతుంది. తర్వాత ఓటీపీ అందుకోనందుకు ఆప్షన్ ఎంచుకోండి. దీని వల్ల సీమ్ లేదా మొబైల్ నష్టం గురించి మీకు ఆప్షన్ రిపోర్ట్ ఇవ్వబడుతుంది, దానిని ఎంచుకోండి. ఫోన్ నెంబరు, ఇమెయిల్ ఐడి, చివరి పేమెంట్, చివరి లావాదేవీ విలువ మొదలైన కొన్ని వివరాలను పొందిన తరువాత మీ ఫోన్ పే అకౌంట్ ని బ్లాక్ చేయడంలో మీకు సహాయపడే ప్రతినిధితో మీరు కనెక్ట్ అవుతారు. -
Digital Payments: యాప్స్ నుంచి చెల్లిస్తున్నారు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం.. పేరు ఏదైనా ఇప్పుడు రియల్ టైం చెల్లింపుల కోసం వినియోగదార్లు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా ఒక పేమెంట్ యాప్ వాడుతున్నారు. కోవిడ్–19 మహమ్మారి కారణంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత యాప్స్ వినియోగం దేశంలో అనూహ్యంగా పెరుగుతోంది. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా చెల్లింపులు, నగదు బదిలీ వంటి లావాదేవీలు క్షణాల్లో పూర్తి కావడం.. కచ్చితత్వం, అదనపు వ్యయాలు లేకపోవడం తదితర ప్రయోజనాలు ఉండడంతో వీటి పట్ల కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరెన్సీకి ప్రత్యామ్నాయంగా యూపీఐ యాప్స్ నిలిచాయంటే అతిశయోక్తి కాదేమో. 2020లో రియల్ టైమ్ లావాదేవీల పరిమాణం చైనాలో 1,500 కోట్లు దాటితే.. భారత్ ఏకంగా 2,500 కోట్లు నమోదైందంటే ఎంత వేగంగా కస్టమర్లు డిజిటల్ వైపు మళ్లుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ముఖ్య విషయమేమంటే ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను పెద్ద ఎత్తున విస్తరించే పనిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిమగ్నమైంది. ఇవీ యూపీఐ గణాంకాలు.. దేశంలో యాక్టివ్ యూపీఐ యూజర్లు సుమారు 20 కోట్లు ఉన్నారు. ఈ సంఖ్యను 2025 నాటికి 50 కోట్లకు చేర్చాలన్నది మొబైల్ పేమెంట్స్ ఫోరం ఆఫ్ ఇండియా లక్ష్యం. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం యూపీఐ లావాదేవీల పరిమాణం, విలువ రెండేళ్లలో మూడింతలు దాటింది. 2019 మే నెలలో రూ.1,52,449 కోట్ల విలువైన 73.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో రూ.4,90,638 కోట్ల విలువైన 253.9 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుతం 49 పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, 175 బ్యాంకులు, 16 థర్డ్ పార్టీలకు చెందిన యూపీఐ ఆధారిత యాప్స్ భారత్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో థర్డ్ పార్టీ యాప్స్‌దే హవా. పరిశ్రమలో వీటి వాటా ఏప్రిల్ గ ణాంకాల ప్రకారం ఫోన్‌పే 45%, గూగుల్ పే 34.3, పేటీఎం 12.14% వాటా దక్కించుకున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం.. యూపీఐ లావాదేవీల మీద సెకండ్ వేవ్ ప్రభావం పడింది. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో పరిమాణం 4.14 శాతం తగ్గి 253.9 కోట్లు, విలువ 0.61% పడిపోయి రూ.4,90,638 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో గరిష్టంగా రూ.5,04,886 కోట్ల విలువైన లావాదేవీలు నమోదయ్యాయి. పరిమాణం 273.2 కోట్లుంది. సున్నా లావాదేవీల నుంచి ఈ స్థాయికి అయిదేళ్లలో రావడం విశేషం. అయితే ప్రభుత్వం 2019 డిసెంబరులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) తొలగిస్తూ లావాదేవీల ఫీజును లేకుండా చేయడంతో దేశంలో యూపీఐ యాప్స్ హవాకు దారి తీసింది. కాగా, ఎండీఆర్ ఎత్తివేయడం వల్ల పేమెంట్ గేట్‌వే సంస్థల మనుగడపై ప్రభావం చూపిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ గతేడాది జూలైలో అభిప్రాయపడింది. ఈ నిర్ణయం పరిశ్రమలో ఆవిష్కరణలకు అడ్డుగా నిలిచిందని, ఉద్యోగాలు కోల్పోతున్నారని, డిజిటల్ పేమెంట్స్ మౌలిక వసతుల విస్తరణ నెమ్మదించిందని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎండీఆర్ తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే యూపీఐ లావాదేవీలపై ఫీజును కస్టమర్లు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకులకూ మేలు జరుగుతోంది.. డిజిటల్ లావాదేవీలను అన్ని బ్యాంకులూ ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వ్యయాలను తగ్గించుకుంటున్నాయి. గతంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బ్యాంకు శాఖలు నెలకొని ఉండేవి. ప్రస్తుతం తదుపరి తరం శాఖలు 1,500 చదరపు అడుగుల లోపుకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకానొక దశలో ఏటా 80,000 మందిని నియమించుకున్నాయి. 2020లో ఈ సంఖ్య 5,113 మాత్రమేనని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ కన్వీనర్ బి.ఎస్.రాంబాబు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. దేశవ్యాప్తంగా 80,000 పైచిలుకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలు నేడు 63,000లకు వచ్చి చేరాయని వెల్లడించారు. శాఖల విస్తరణ క్రమంగా తగ్గుతోందని, యూపీఐ యాప్స్ కారణంగా బ్యాంకులకూ మేలు జరుగుతోందని చెప్పారు. -
రియల్మీ బడ్జెట్ ఫోన్లు.. రూ.6,799కే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ బ్రాండ్ రియల్మీ తాజాగా సి–సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను రూపొందించింది. వీటి ధరలు రూ.6,799 నుంచి రూ.10,999 వరకు ఉన్నాయి. వేరియంట్‌నుబట్టి ర్యామ్ 2–4 జీబీ, ఇంటర్నల్ మెమరీ 32–128 జీబీ, బ్యాటరీ 5000–6000 ఎంఏహెచ్ ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా సి–సిరీస్‌లో 3.2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయని రియల్మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెలిపారు. 10 కోట్లు దాటిన భారత్‌పే యూపీఐ లావాదేవీలు న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ భారత్‌పే ఈ ఏడాది మార్చి నెలలో 10.6 కోట్ల యూపీఐ (830 మిలియన్ డాలర్ల విలువ) లావాదేవీలను సాధించింది. 2021–22లో యూపీఐ విభాగంలో మూడు రెట్ల వృద్ధిని సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఫిన్‌టెక్ పరిశ్రమలో భారత్‌పే 8.8 శాతం మార్కెట్ వాటాను కలిగింది. గత ఏడాది కాలంగా భారత్‌పే యూపీఐ పర్సన్ టు మర్చంట్ (పీ2ఎం) విభాగం శరవేగంగా అభివృద్ధి చెందింది. నగరాలలో కంటే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో పీ2ఎం లావాదేవీలు పెరిగాయని భారత్‌పే గ్రూప్ అధ్యక్షుడు సుహైల్ సమీర్ తెలిపారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో యూపీఐ లావాదేవీ పరిమాణం ఏడు రెట్లు వృద్ధి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య యూపీఐ చెల్లింపులు 23.7 శాతం పెరిగాయి. క రోనా నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయని.. దీంతో గత 12 నెలల్లో భారత్‌పే సేవలు 30 నగరాల నుంచి వంద నగరాలకు విస్తరించామని పేర్కొన్నారు. 2022 ఆర్ధిక సంవత్సరంలో మరొక వంద నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం 40 లక్షలుగా ఉన్న మర్చంట్ల సంఖ్యను 60 లక్షలకు చేర్చాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు. 2023 మార్చి నాటికి భారత్‌పే చెల్లింపుల వ్యాపారం మూడు రెట్లు వృద్ధితో 30 బిలియన్ డాలర్ల టీపీవీ (టోటల్ పేమెంట్స్ వ్యాల్యూ)కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్
వాషింగ్టన్: తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. చైనాకు చెందిన 8 పేమెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌పై నిషేధాన్ని విధించారు. వీటి ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. నిషేధం విధించిన జాబితాలో అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్ గ్రూప్‌నకు చెందిన అలీ పే, టెన్సెంట్కు చెందిన వియ్‌చాట్ పే సైతం చోటు చేసుకోవడం గమనార్హం! ఈ నెలలో కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ట్రంప్ యాప్‌లపై నిషేధ బాణాన్ని ఎక్కుపెట్టారు. తద్వారా బీజింగ్‌తో నెలకొన్న వివాదాలు మరింత ముదిరే వీలున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. (మ్యూజిక్ బిజినెస్‌కు అలీబాబా టాటా) 45 రోజుల్లో చైనా యాప్‌లపై ట్రంప్ నిషేధ ఆజ్ణలను మంగళవారం జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ అయిన 45 రోజుల తరువాత నిషేధం అమల్లోకి వస్తుందని వాషింగ్టన్ ప్రభుత్వం పేర్కొంది. తాజా ఆదేశాల ప్రకారం 8 చైనా యాప్‌ల ద్వారా వ్యక్తులు లేదా సంస్థలు లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థిక శాఖ తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యత వహించవలసి ఉంటుందని తెలియజేసింది. నిషేధం విధించిన యాప్‌ల జాబితాలో అలీపే, కామ్‌స్కానర్, క్యూక్యూ వాలెట్, షేర్ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమేట్, వియ్‌చాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ చోటు చేసుకున్నాయి. యాప్‌ల ద్వారా చైనా బల్క్ డేటా కలెక్షన్ చేపడుతున్నట్లు ట్రంప్ ఆరోపించారు. యూజర్లకు చెందిన ప్రయివేట్ సమాచారాన్ని యాప్స్ సంగ్రహిస్తాయని, దీనివల్ల అమెరికన్లకు రిస్కులు ఎదురుకానున్నట్లు అభిప్రాయపడ్డారు. కాగా.. కొత్త ప్రెసిడెంట్‌గా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి నిషేధం అమల్లోకి రానున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. (బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్) యూజర్లు.. యూఎస్‌లో యాంట్ గ్రూప్‌నకు చెందిన పేమెంట్, లైఫ్‌స్టైల్ యాప్ అలీపే గతేడాది 2.07 లక్షల డౌన్లోడ్స్ను సాధించినట్లు తెలుస్తోంది. యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే యాప్‌స్టోర్ నుంచి డౌన్లోడ్స్ నమోదయ్యాయి. ఇక గతేడాది టెక్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వియ్‌చాట్ పేతో కూడిన వియ్‌చాట్ 1.6 మిలియన్ డౌన్లోడ్స్ను సాధించినట్లు సెన్సర్ టవర్ ఇంక్ పేర్కొంది. వీటితోపాటు టెన్సెంట్కు చెందిన క్యూక్యూ వాలెట్, టెన్సెంట్ క్యూక్యూ సైతం నిషేధాన్ని ఎదుర్కోనున్న జాబితాలో చేరాయి. మరోవైపు గతేడాది కామ్‌స్కానర్ యాప్‌ను సైతం 4.4 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు సెన్సర్ టవర్ తెలియజేసింది. -
అక్షయ తృతీయ @ ఆన్లైన్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అక్షయ తృతీయ అనగానే బంగారం షాపుల ముందు క్యూ కట్టిన కస్టమర్ల దృశ్యాలు కళ్ల ముందు మెదులుతాయి. హిందువులు పవిత్ర దినంగా భావించే అక్షయ నాడు జువెల్లరీ దుకాణాల్లో హడావుడి అంతా ఇంతా కాదు. సెంటిమెంటుగా భావించి చిన్న మొత్తంలో అయినా సరే బంగారం కొనేందుకు షాపులకు వచ్చే కస్టమర్లుంటారు. అయితే కోవిడ్–19 పుణ్యమాని ఈసారి మాత్రం అక్షయ లాక్డౌన్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే తెరిచిన సంగతి తెలిసిందే. బంగారం కొనాలంటే ఆన్లైన్ మినహా ప్రస్తుతం మరో మార్గం లేదు. పలు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ ద్వారా ఆభరణాలు, ముడి బంగారాన్ని కొనుక్కోవచ్చు. లాక్డౌన్ ముగిశాక ఈ పుత్తడిని కస్టమర్లు అందుకోవచ్చు. ఏప్రిల్ 26న అక్షయ తృతీయ. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలు దాటింది. సిద్ధమైన కంపెనీలు.. ఆభరణాలను, ముడి బంగారాన్ని అమ్మేందుకు జువెల్లరీ సంస్థలు, పేమెంట్ యాప్స్ సిద్ధమయ్యాయి. వ స్త్రాలతోపాటు బంగారాన్ని అమ్మే సంప్రదాయ రిటైల్ కంపెనీలు ఈసారి పుత్తడి అమ్మకాల నుంచి దూరమైనట్టే. ఇప్పటికే ఆన్లైన్లో విక్రయాలు సాగిస్తున్న కంపెనీలకే అక్షయ కలిసిరానుంది. కల్యాణ్ జువెల్లర్స్, లలితా జువెల్లర్స్, జోయాలుక్కాస్, జోస్ ఆలుక్కాస్, మలబార్, ఖజానా, తనిష్క్, బ్లూస్టోన్ వంటి కంపెనీలు అక్షయకు పోటీపడుతున్నాయి. డిస్కౌంట్లను సైతం ఇవి ఆఫర్ చేస్తున్నాయి. కస్టమర్లు ఈ కంపెనీల వెబ్సైట్లో తమకు కావాల్సిన నగలు, కాయిన్స్‌ను ఆన్లైన్లో డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. లాక్డౌన్ ముగిశాక నిర్దేశిత రోజుల్లో సమీపంలోని దుకాణానికి వెళ్లి కొనుగోలు చేసిన వస్తువును తెచ్చుకోవచ్చు. కస్టమర్ కోరితే ఇంటికే డెలివరీ చేస్తారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ ద్వారా కూడా బంగారాన్ని బుక్ చేసుకోవచ్చు. అక్షయ వాటా 30–40 శాతం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019లో భారత్‌లో 690.4 టన్నుల పుత్తడి అమ్ముడైంది. ప్రస్తుత సంవత్సరం డిమాండ్ 700–800 టన్నులు ఉండొచ్చని కౌన్సిల్ గతంలో అంచనా వేసింది. అయితే కోవిడ్–19 నేపథ్యంలో అంచనాలకు తగ్గట్టుగా అమ్మకాలు ఉండకపోవచ్చన్నది నిపుణుల మాట. 350–400 టన్నులకే పరిమితం అవొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఎన్.అనంత పద్మనాభన్ తెలిపారు. సాధారణంగా మొత్తం విక్రయాల్లో అక్షయ వాటా 30–40% ఉంటుందని శారీనికేతన్ జువెల్లరీ విభాగం మేనేజర్ గుల్లపూడి నాగకిరణ్ కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కస్టమర్లలో కోవిడ్–19 తద నంతర పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన ఉంది కాబట్టి కొనుగోళ్లకు మొగ్గు చూపరని అన్నారు. వినియోగదార్లలో 20–30% మంది ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక బంగారం కొనేద్దాం.. కొత్త రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం: డబ్ల్యూజీసీ న్యూఢిల్లీ: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, ఫిన్‌టెక్ ఊతం, ఆర్థి కాంశాలపై పెరుగుతున్న అవగాహన తదితర అంశాల కారణంగా గతంలో ఎన్నడూ బంగారాన్ని కొనని వారు కూడా ప్రస్తుతం పసిడి కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. పుత్తడి పెట్టుబడుల్లో ఆభరణాలు, నాణేలదే అగ్రస్థానంగా ఉంటోంది. దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల అభిప్రాయాలపై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం సుమారు 29 శాతం మంది రిటైల్ ఇన్వెస్టర్లు భవిష్యత్‌లో పసిడిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 52 శాతం ఇన్వెస్టర్ల దగ్గర ఏదో ఒక రూపంలో బంగారం ఉండగా, 48 శాతం మంది గడిచిన 12 నెలల్లో పసిడిలో పెట్టుబడులు పెట్టారు. ‘భారత్‌లో రిటైల్ పెట్టుబడుల ధోరణులు మారుతున్నాయి. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఫైనాన్షియల్ టెక్నాలజీ విస్తృతి చెందుతుండటం, ఆర్థిక సాధనాలపై ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతుండటం ఇందుకు కారణం‘ అని డబ్ల్యూజీసీ భారత విభాగం ఎండీ సోమసుందరం పీఆర్ తెలిపారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ధోరణులు.. సర్వే ప్రకారం.. పట్టణ ప్రాంత ఇన్వెస్టర్లలో సుమారు 76 శాతం మంది ఇప్పటికే బంగారంపై ఇన్వెస్ట్ చేయగా, 21 శాతం మంది గతంలో ఎన్నడూ కొనుగోలు చేయనప్పటికీ భవిష్యత్‌లో కొనాలని భావిస్తున్నారు. అటు గ్రామీణ ఇన్వెస్టర్లలో కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్న వారి సంఖ్య 37 శాతంగా ఉంది. కొనుగోలు చేయడంలో సౌలభ్యం, పెట్టుబడికి భరోసా వంటి అంశాల కారణంగానే పసిడివైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. -
ఇక్కడంతా వెరీ 'స్మార్ట్' !
సాక్షి, ఆత్మకూరు : కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా టెక్నాలజితో సమానంగా పరుగులు తీస్తున్నారు. అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్నే చుట్టి వస్తున్నారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు ఉంటే చాలు ఏ పనైనా సులువుగా చేసేస్తున్నారు. 4జీదే హవా ప్రస్తుత ప్రతి ఒక్కరి చేతిలో 4 జీ సెల్ ఫోన్ దర్శనమిస్తోంది. స్టూడెంట్ మొదలు ఉద్యోగి దాకా అంతా స్మార్ట్‌బాటలో పయనిస్తున్నారు. తమ అవసరాలను తీర్చుకునేందుకు కూడా ఎక్కువగా ఫోన్‌నే ఉపయోగిస్తున్నారు. దూరానికి వెళ్లి చేసుకోవాల్సిన పనులు సైతం ఇంట్లో కూర్చొని ఒక్క క్లిక్‌తో కానిచ్చేస్తున్నారు. పరుగుకు స్వస్తి గతంలో కరెంట్ బిల్లులు , గ్యాస్ బిల్లులు, రేషన్ బిల్లులు ఇలా ఏ బిల్లు చెల్లించాలన్నా ఆయా కార్యాలయాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఒక్కోసారి కొన్ని పనులకు అర్ధరోజు కూడా పట్టేది. అయితే ఇప్పుడు డిష్ బిల్లు మొదలు టిఫిన్ బిల్లు దాకా నీటి పన్ను మొదలు సినిమా టికెట్ దాకా అన్నింటికీ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్‌లను వినియోగిస్తూ చక్కబెట్టుకుంటున్నారు. తప్పిన చిల్లర సమస్య గతంలో ఏ దుకాణానికి వెళ్లినా రూ.5 విలువ చేసే వస్తు కొనాలంటే చిల్లర సమస్య వచ్చేది. దీంతో దుకాణదారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే ఇప్పుడు టీ తాగినా సరే ఎక్కువ మంది యాప్‌ల ద్వారానే నగదును బదిలీ చేసేస్తూ ఏ గొడవా లేకుండా బయటపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా చిన్న బడ్డీ కొట్టు మొదలు పెద్ద పెద్ద స్టార్ హోటళ్ల దాకా వాటి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీ షాపులు, టిఫిన్ సెంటర్లు, సరుకుల అంగళ్లు, ఎరువుల దుకాణాలు ఒక్కటేంటి అంతా స్మార్‌బాట పట్టారు. -
ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్ పే
సాక్షి: ఆన్లైన్ నగదు చెల్లింపు సేవల సంస్థ ఫోన్ పే మే నెలలో4.70 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే కంపెనీ 27 శాతం వృద్ధి నమోదు చేసింది. 9 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో గూగుల్ పే(తేజ్) మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో పే పాల్, క్యాష్ యాప్, యూనియన్ పే ఉన్నాయని అనలిస్టు జూలియా చాన్ తెలిపారు. ఫోన్ పే, గూగుల్ పే రెండూ కూడా ఇప్పటి వరకు గూగుల్ ప్లేస్టోర్ నుంచి పది కోట్ల డౌన్లోడ్లు సాధించాయి. కాగా గూగుల్ పే యాప్‌ను 99.40 శాతం ఇండియాలోనే డౌన్లోడ్ చేసుకున్నారు. పైన తెలిపిన 9 మిలియన్లలో అయితే 99.90 శాతం డౌన్లోడ్లు ఇండియాలోనే జరిగాయి. -
షావోమి బిగ్ సర్ప్రైజ్.. బంపర్ ఆఫర్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో సంచనాలను నమోదు చేసిన చైనా కంపెనీ షావోమి ఇపుడిక డిజిటల్ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గూగుల్ పే, పేటీఎం తరహాలో తన పేమెంట్ యాప్ ఎంఐపేను లాంచ్ చేసింది. ఇండియాలో 'ఎంఐ పే' యూపీఐ సర్వీస్ కోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. డేటా లీక్ పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అత్యధిక భద్రమైన సర్వీసులను అందిస్తామని హామీ ఇచ్చింది. యూజర్ల డేటాను ఇండియాలో మాత్రమే స్టోర్ చేస్తామని షావోమీ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) క్లియరెన్స్ అనంతరం 'ఎంఐ పే' యాప్‌ను అధికారికంగా తీసుకొచ్చింది. ఎంఐ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదు... బిల్లులు, రీఛార్జుల చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం 120 బిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ క్యూఆర్ కోడ్‌తో సహా ఇతర క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొచ్చు. యూజర్లకు ఆఫర్లు ఎంఐ పే యాప్ యూజర్లకు మరో బంపర్ఆఫర్ కూడా ప్రకటించింది. వినియోగదారులు రెడ్మీ నోట్ 7, 32 అంగుళాల ఎంఐటీవీ 4ఏ ప్రో గెలుచుకునే అవకాశముందని షావోమీ ప్రకటించింది. ఇప్పటికే చైనాలో వినియోగంలో ఉన్న ఈ వ్యాలెట్ సర్వీసును ఇండియన్ యూజర్ల కోసం ఆవిష్కరించింది. కొద్ది రోజుల క్రితం ఇండియాలో 'ఎంఐ పే' బీటా వర్షన్ రిలీజ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. Mi fans! Here's a BIG surprise for all of you. Use #MiPay and stand a chance to win #RedmiNote7 and #MiTV 4A Pro 32". pic.twitter.com/wAEM0Bll7P — Mi India (@XiaomiIndia) March 19, 2019 -
వచ్చేవారమే వాట్సాప్ చెల్లింపు సేవలు..
వాషింగ్టన్ : వచ్చే వారం నుంచే భారత్‌లో వాట్సాప్ పేమెంట్ సేవలను ప్రారంభించేందుకు ఫేస్బుక్ సన్నాహాలు చేస్తోంది. భాగస్వామ్య సంస్థలు ఇంకా సన్నద్ధం కాకపోయినా మార్కెట్ వాటాను పెంచుకునేందుకే హడావిడిగా చెల్లింపు సేవలను చేపడుతున్నారని భావిస్తున్నారు. చెల్లింపు సేవల కోసం వాట్సాప్ ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లతో ఒప్పందం చేసుకుంది. త్వరలోనే ఎస్బీఐ కూడా వాట్సాప్ చెల్లింపులను అనుమతిస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రత్యర్థుల దూకుడుకు బ్రేక్ వేసేందుకు మూడు బ్యాంకులతో ఒప్పందాలతోనే ముందుకెళ్లాలని, వీలైనంత త్వరగా వాట్సాప్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని ఫేస్బుక్ భావిస్తోంది. వాట్సాప్ పే పైలట్ వెర్షన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో పది లక్షల మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకురాగా మెరుగైన స్పందన లభించిందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. వాట్సాప్ పేమెంట్స్ సేవలు తమకు తీవ్ర పోటీ ఇస్తాయని గూగుల్ తేజ్, అలీబాబా పేటీఎం భావిస్తున్నాయి. వాట్సాప్ మెసేజింగ్ సేవలను భారత్‌లో 20 కోట్ల మంది ఉపయోగిస్తున్న క్రమంలో వాట్సాప్ పేమెంట్ సేవలు విజయవంతమవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. -
కర్ణాటక ఎన్నికలు: ఆన్లైన్లో నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : కన్నడ నాట ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు రాజకీయపార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎన్నికల సంఘంతో పాటు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ అధికారుల కళ్లుగప్పి ఓటర్ల మద్దతు పొందేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కట్టుదిట్టమైన ఆంక్షలతో ఓటర్లకు నగదు పంపిణీ కష్టతరమే కాకుండా అసాధ్యంగా మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు డిజిటల్ బాట పట్టారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని నగదు కొరత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కర్ణాటక అభ్యర్థులకు ఆన్లైన్ లావాదేవీలు అందివచ్చినట్టు అయ్యింది. వివిధ సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ’ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) స్కీం నుంచి ఈ పార్టీల అభ్యర్థులు స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తోంది. ఇదీ పద్ధతి... ఈ అభ్యర్థుల విశ్వాసపాత్రులు ముందుగా ఓటర్లను కలుస్తారు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, సెల్‌ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫలానా క్యాండెట్‌కే ఓటు వేస్తామంటూ ఓటర్ల నుంచి వాగ్దానం తీసుకుంటారు. ఇందుకోసం ఓటుకు రూ.2 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, మొదటి ఇన్స్టాల్మెంట్ కింద వెంటనే రూ.వెయ్యి ఓటర్ అకౌంట్‌కు పంపిస్తారు. ఓటింగ్ ముగిసాక రెండో ఇన్స్టాల్మెంట్ కింద మరో వెయ్యి రూపాయిలు ట్రాన్స్‌ఫర్‌పై హామీనిస్తారు. ఈ రెండో దఫా చెల్లింపు మాత్రం అభ్యర్థి గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవహారంలో సంబంధిత రాజకీయపార్టీ అభ్యర్థి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా అతడి నమ్మకస్తులైన కార్యకర్తలు లేదా ఇతర వ్యాపారవేత్తలు,సన్నిహితుల అకౌంట్ల నుంచి నగదు బదిలీ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల డబ్బు ఓటరు అకౌంట్లోకి ఎవరి ప్రోద్భలంతో వచ్చిందన్న దానిపై నిఘావర్గాలు పసిగట్టే అవకాశం దాదాపు ఉండదు. అదీకూడా కొన్ని వేల మొత్తంలోనే ఈ లావాదేవీలు సాగుతుండడంతో ఆదాయపుపన్ను శాఖ కనిపెట్టడం కూడా కష్టమవుతోంది. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమూ ఉంది... వ్యక్తిగతంగా ఒక్క ఓటరుకు పరిమితంగా కాకుండా ఈ పథకంలో భాగంగా ఫ్యామిలీ ప్యాకేజీలు సైతం అమలవుతున్నాయి. ఒక కుటుంబంలోని ఓటర్ల సంఖ్యను బట్టి అన్ని వేల రూపాయలు మొదటి దఫా కింద వారి అకౌంట్లలోకి వచ్చి చేరుతున్నాయి. అయితే బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తున్నా, డిజిటల్ లావాదేవీల వ్యాప్తిలో భాగంగా మొబైల్ యాప్‌ల నుంచి ఓటర్లకు పంపిస్తున్న డబ్బును గుర్తించడం కష్టమవుతోంది. ఓట్ల కొనుగోలు కోసమే ఈ నగదు బదిలీ అయ్యిందని నిరూపించడం కూడా అసాధ్యంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘జన్ ధన్ యోజన’లో భాగంగా సంక్షేమ పథకాల లబ్ది కోసం గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోని వారు బ్యాంక్ ఖాతాలు తెరవడంతో ఎన్నికల్లో డబ్బు పంపిణీకి రాజకీయపార్టీలు, అభ్యర్థుల పని మరింత సులువవుతోంది. బ్యాంకుల సాయంతో ›ప్రతీ లావాదేవీని తాము పరిశీలిస్తున్నా అభ్యర్థులు అనుసరిస్తున్న కొత్త ట్రిక్కుల వల్ల వీటి కట్టడి సాధ్యం కావడం లేదని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. ఓటర్లకు ఆన్లైన్లో నగదు బదిలీకి సంబంధించి ఫిర్యాదులు రావడంతో నిఘాను మరింత పెంచినట్టు, అయితే మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లింపులను ఓ కంట కనిపెట్టడం ఎలాగన్నది తెలియడం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారత్‌లోకి గూగుల్ పేమెంట్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం భారత్‌లో పేమెంట్ యాప్‌లకు భారీగా డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని కంపెనీలు యూపీఏ ఆధారిత పేమెంట్ యాప్‌లను వినియోగదారులకు ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా పేమెంట్ యాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే వారంలో యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ సర్వీసు ''తేజ్''ను గూగుల్ లాంచ్ చేయబోతుంది. సెప్టెంబర్ 18న గూగుల్ భారత్‌లోకి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టబోతుందని ది-కెన్.కామ్ రిపోర్టు చేసింది. గూగుల్ లాంచ్ చేయబోతున్న తేజ్ అంటే హిందీలో వేగవంతం అని అర్థం. ఇది అచ్చం ఆండ్రాయిడ్ పే లాగా పనిచేస్తోంది. యూపీఐ పేమెంట్ సిస్టమ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ పేమెంట్ సిస్టమ్‌ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు బ్యాంకు అకౌంట్ల మధ్య వెనువెంటనే ఫండ్ ట్రాన్సఫర్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ ద్వారా వీలవుతుంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ కూడా ఈ డిజిటల్ పేమెంట్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఎన్పీసీఐతో ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సంప్రదింపులు జరుపుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీచాట్, హైక్ మెసెంజర్ వంటి కొన్ని మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులను సపోర్టు చేస్తున్నాయి.